Jump to content

ఇరా ముఖోటి పౌరాణిక నవల సాంగ్ ఆఫ్ ద్రౌపది

వికీపీడియా నుండి

ఇరా ముఖోటి పౌరాణిక నవల సాంగ్ ఆఫ్ ద్రౌపది మహా భారత గాథను అనేకులు అనేక విధాలుగా మరల మరల రాశారు. చిత్రా బెనర్జీ “ది పేలెస్ ఆఫ్ ఇల్యూజన్" నవల ద్రౌపది దృష్టికోణం నుంచి రాశారు. సంతానం కోసం తాంత్రిక శక్తుల సహాయం తీసుకొనే పురుషులు, తమ పురుషులనుంచి అసాధ్యమయిన కోరికలను కోరే భార్యలు, తండ్రికోసం బ్రహ్మచర్యవ్రతం పూనిన భీష్ముడు, పునర్జన్మ ఎత్తి శత్రువును నాశనంచేసే మహిళలు, శతాబ్దాలుగా అనేక రూపాల్లో మళ్ళీ మళ్ళీ పునర్ లేఖనం చేయబడుతున్న ఇతిహాసం మహాభారతం. మహా భారతం స్త్రీవాద దృక్పథం నుంచి నవలీకరించడానికి అవకాశం ఇచ్చింది. సుప్రసిద్ధ నవలా రచయిత్రి ఇరా ముఖోటి మహాభారత కథను ద్రౌపది దృక్పథం నుంచి పౌరాణిక నవలగా చిత్రీకరించారు. ఆమె మహాభారత మూలకథను అనుసరించారు, ద్రౌపది వస్త్రాపహరణం వంటి ఘట్టాల్లో మాత్రం వాస్తవికంగా రాశారు. ధ్రుతరాష్ట్రుని భార్యల సంతానంగా నూరు మంది కౌరవులనూ చిత్రించారు. శంతనుడి కథతో మొదలుపెట్టి మహాప్రస్థానంతో ముగించారు. కథనం ఆసక్తి కరంగా సాగుతుంది. ముఖోటి ఈ నవలలో స్త్రీపాత్రల మీద దృష్తిపెట్టారు, ప్రత్యేకంగా ద్రౌపది, భానుమతి, కుంతి, సత్యవతి. గాంధారి వంటి గంభీరమైన పాత్రాలు. భర్తలు వేరువేరు స్త్రీలను పెళ్ళిచేసుకున్నా తాను రాణిగా ఉండేట్లు ద్రౌపది కోరుకొంటుంది. ద్రౌపది వస్త్రాపహరణం ముఖోటి వాస్తవికంగా చిత్రించారు. నవలలో అన్ని స్త్రీపాత్రలు అభద్రతా భావంతో కనిపిస్తాయి. గిరిజనస్త్రీ గంగ రాణివాసాన్ని జైలు జీవితంలాగా భావిస్తుంది. మొత్తం మహాభారతం ఇతిహసాన్ని రచయిత్రి మానవీకరించినట్లు విమర్శకులు భావించారు. నవలలో చదివించేగుణం పుష్కలంగా ఉంది. తరుణ వయస్కులు కూడా ఇష్టంగా చదువుతూన్న నవల.

మూలాలు: SONG OF DRAUPADI: A NOVEL by Ira Mukhoty (Author) Hardcover – 1 August 2021,Ruapa Publicatins, India.