ఇర్విన్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇర్విన్ మండలం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాకు చెందినది. ఈ మండలం 28 జూన్ 2023న ఇర్విన్ మండల కేంద్రంగా ఏర్పడింది.

నేపథ్యం[మార్చు]

మాడ్గుల మండలంలో ఇర్విన్‌ మండల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌ మిట్టల్‌ ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇర్విన్‌ గ్రామాన్ని మండలం చేయాలని చాలా కాలంగా ఇర్విన్‌, సమీప గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ డిమాండ్‌పై కలెక్టర్‌ 2022 జూలై 30న ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. కల్వకుర్తి శాసనసభ్యుడు జైపాల్‌యాదవ్‌ చొరవ తీసుకొని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ను మండల కేంద్రంపై ఆభ్యర్థించారు. ఇర్విన్‌, బ్రాహ్మణపల్లి, అర్కపల్లి, అందుగుల, అన్నెబోయిన్‌పల్లి, సుద్దపల్లి, గిరికొత్తపల్లి, కలకొండ, రమణంపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలోని 19 పంచాయతీలతో ఇర్విన్‌ను మండలం చేసేందుకు ప్రతిపాదించారు. దీనిపై ఏవైనా అభ్యంతరాలుంటే 15 రోజుల్లో కలెక్టర్‌కు తెలపాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. [1]

ఈ మండలం ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్‌ ​​పరిధిలోకి వచ్చింది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

  • అర్కపల్లి
  • ఇర్విన్‌,
  • బ్రాహ్మణపల్లి,
  • అండుగుల,
  • అన్నెబోయినపల్లి,
  • సుద్దపల్లి,
  • గోరికొత్తపల్లి,
  • కలకొండ,
  • రమనపల్లి

మూలాలు[మార్చు]

  1. ABN (2023-06-28). "ఇర్విన్‌ మండలం ఏర్పాటుకు నోటిఫికేషన్‌". Andhrajyothy Telugu News. Retrieved 2023-09-12.