ఇస్త్రీ పెట్టె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కరెంటు ఇస్త్రీ పెట్టె

దుస్తులకు ఉన్న మడతలు పోవడానికి ఇస్త్రీ చేయడానికి వాడే పరికరము.ఇది ప్రధానంగా రెండు రకములు.రజకుల ప్రధాన అదాయవనరుగా చెప్పవచ్చు.

  1. బొగ్గుల ఇస్త్రీ పెట్టె
  2. విద్యుత్ ఇస్త్రీ పెట్టె

ఇస్త్రీ చేస్తే మడతలు ఎందుకు పోతాయి[మార్చు]

మనం ధరించే బట్టలు ఎంతగా నలిగి పోయినా ఉష్ణం, తేమ, ఒత్తిడి ద్వారా వాటిని సాఫీగా చేయవచ్చు. వస్త్రాల తయారీలో దారాల పోగుల్ని వడకడం, నేయడం లాంటి ప్రక్రియల ద్వారా ఒక క్రమపద్ధతిలో అమరి ఉండేలా చేస్తారు. పత్తితో తయారైన నూలు వస్త్రాలను చేసే ముందు నూలు పోగులను కావలసిన పరిమాణంలో తెంచి మృదువుగా మారేలా చేస్తారు. జంతువుల వెంట్రుకలతో తయారు చేసే ఉన్ని దుస్తులలోని పోగులు సహజంగానే మృదువుగా ఉంటాయి. వస్త్రాలు నలిగిపోయినప్పుడు ఏదైనా చదునైన ప్రదేశంపై వాటిని ఉంచి వేడిగా ఉండే ఇస్త్రీపెట్టెతో పాముతారు. ఆ వేడి వల్ల, ఒత్తిడి వల్ల వస్తాల్లోని పోగులు సాఫీగా మారతాయి. ఇస్త్రీ చేయవలసిన వస్త్రంపై ముందు కొద్దిగా నీళ్లు చిలకరించడం వల్ల నీటితేమ వస్త్రంలోని పోగుల మధ్యకు చొరబడి ఆ పోగులను కొంచెం ఉబ్బేటట్లు చేస్తుంది. అందువల్ల పోగుల మధ్య ఉండే పట్టు సడలి పోతుంది. అలా ఉబ్బిన పోగులను వేడిగా ఉండే ఇస్త్రీ పెట్టెతో రుద్దడం ద్వారా ఆ ఒత్తిడికి, వేడికి తడిపోగులు పొడిబారే క్రమంలో అవి మనకు కావలసిన పద్ధతిలో నున్నగా, సాఫీగా మారుతాయి. మామూలు ఇస్త్రీపెట్టెలో మండే బొగ్గులతో వేడిని కలుగజేస్తే, ఎలక్ట్రిక్ ఐరన్ బాక్సులో విద్యుత్ శక్తి ద్వారా వేడిని ఉత్పత్తి చేస్తారు. కొన్ని ఇస్త్రీ పెట్టెల్లో దుస్తులపై తేమను కలిగించే ఏర్పాటు కూడా ఉంటుంది. వీటిని వాడినప్పుడు వేరే నీటిని చిలకరించనక్కర్లేదు.

ఇస్త్రీ చేయునపుడు మెళకువలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]