ఇస్లాం షా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Islam Shah Suri
173 islam-11.jpg
A coin of Islam Shah
Sultan of the Suri Empire
పరిపాలనా కాలం 27 May 1545 – 22 November 1554
పట్టాభిషేకం {{{Coronation}}}
ముందువారు Sher Shah Suri
తర్వాతివారు Firuz Shah Suri
జీవిత భాగస్వామి Bibi Bai
సంతతి
Firuz Shah Suri
రాజగృహం Sur dynasty
తండ్రి Sher Shah Suri
మరణం 22 November 1554
మతం Islam

" ఇస్లాం షా సూరి " (1545-1554) సూరీ రాజవంశానికి రెండవ పాలకుడు. 16 వ శతాబ్ధంలో ఆయన భారత ఉపఖండంలో కొంతభాగాన్ని పాలించాడు. ఆయన అసలు పేరు జలాల్ ఖాన్. ఆయన షేర్ షా రెండవ కుమారుడు.

చరిత్ర[మార్చు]

తన తండ్రి మరణం తరువాత ప్రముఖులు అత్యవసర సమావేశం జరిపి షేర్ షా పెద్ద కుమారుడు ఆదిల్ ఖానుకు బదులుగా జలాల్ ఖానును వారసుడిగా ఎంచుకుని సింహాసనాధిష్టుని చేసారు. ఆయన గొప్ప సైనిక సామర్థ్యాన్ని చూపించడమే అందుకు ప్రధాన కారణం. 1545 మే 26 న జలాల్ ఖాన్ సింహాసనాన్ని అధిష్టించి "ఇస్లాం షా" బిరుదును తీసుకున్నాడు. తన సోదరుడు తన అధికారాన్ని ఎదిరిస్తాడని భయపడి అన్నను బంధించాలని ప్రయత్నించాడు. కానీ ఆదిల్ ఖాన్ తప్పించుకుని సైన్యాన్ని సమీకరించాడు. ఆయన ఆగ్రాలో ఉన్నప్పుడు ఇస్లాం షా మీద సైన్యంతో దాడి చేశాడు. యుద్ధంలో ఇస్లాం షా విజయం సాధించాడు. ఆదిల్ ఖాన్ పారిపోయాడు. ఆదిల్ ఖాన్ తిరిగి ఎన్నడూ కనిపించలేదు.[1]

ఇస్లాం షా తన సోదరుడికి మద్దతిచ్చారని సందేహించిన అధికారులను నిర్దాక్షిణ్యంగా పదవుల నుండి తొలగించి ప్రక్షాళన చేసాడు. తరువాత ప్రముఖులు ఖచ్చితంగా కిరీటానికి లోబడి ఉన్నారు. ఆయన ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నిర్వహణచేస్తూ అధికారాన్ని కేంద్రీకరణ చేసి పాలన సాగిస్తూ తండ్రి విధానాలు కొనసాగించాడు. ఆయనకు సైనిక పోరాటాలకు తక్కువ అవకాశాలే ఉన్నాయి. తన తండ్రి చేత పదవీచ్యుతుడైన ముఘల్ చక్రవర్తి హుమయూన్ ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు.

మరణం[మార్చు]

ఇస్లాం షా 1554 నవంబరు 22 న మరణించాడు. తరువాత 12 సంవత్సరాల వయసున్న ఆయన కుమారుడు ఫిరుజ్ షా సూరి పదవీ బాధ్యతలు వహ్and ంచాడ. కొద్దిరోజుల్లో బాల పాలకుడిని షేర్ షా మేనల్లుడు ముహమ్మద్ ముబారీస్ ఖాన్ హత్య చేసాడు. తర్వాత ఆయన ముహమ్మద్ ఆదిల్ షాగా సింహాసనాన్ని అధిరోహించాడు. షేర్ షా సమాధికి వాయవ్యంలో ఒక కిలోమీటరు దూరంలో ఇస్లాం షా అసంపూర్ణ సమాధి ఉంది.[2]

Silver Rupee of Islam Shah

మూలాలు[మార్చు]

  1. "Biography of Islam Shah the Successor of Sher Shah".
  2. Sanatani, Rohit Priyadarshi. "Tomb of Salim Shah Suri (Islam Shah): The Glory that never was". http://thespeakingarch.com/islam_shah_tomb/. Retrieved 21 March 2015. External link in |website= (help)

వెలుపలి లింకులు[మార్చు]

అంతకు ముందువారు
Sher Shah Suri
Sultan of Delhi
1545–1554
తరువాత వారు
Firuz Shah Suri
"https://te.wikipedia.org/w/index.php?title=ఇస్లాం_షా&oldid=2525147" నుండి వెలికితీశారు