ఇ-చౌపల్
ఇ-చౌపల్ అన్నది అంతర్జాలం ద్వారా గ్రామీణ రైతులు సోయా చిక్కుళ్ళు, గోధుమలు, కాఫీ, రొయ్యలు వంటి వ్యవసాయ, ఆక్వాకల్చర్ ఉత్పత్తులు పొందడానికి ఐటిసి లిమిటెడ్ చేసిన ఇనిషియేటివ్. ఇ-చౌపల్ చిన్న చిన్న కమతాలుగా విభజితం కావడం, బలహీనమైన మౌలిక వసతులు, మధ్యవర్తుల ప్రమేయం వంటి అనేక సమస్యలు ఎదుర్కొనే భారతీయ వ్యవసాయ రంగపు సమస్యలను అధిగమించే ప్రయత్నాలు చేసింది. ఈ ప్రోగ్రాం ద్వారా భారతదేశపు గ్రామీణ ప్రాంతాల్లో మార్కెటింగ్, వ్యవసాయ సమాచారం వంటివి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కంప్యూటర్లను ఏర్పాటుచేశారు.
ఇ-చౌపల్ ప్రభావాలు
[మార్చు]ఐటీసీ లిమిటెడ్ దేశంలోని వివిధ వ్యవసాయ ప్రాంతాల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటుచేసింది, తద్వారా వ్యవసాయదారులు నేరుగా ఐటీసీతోనే వారు పండించిన వ్యవసాయోత్పత్తుల అమ్మకం గురించి బేరం ఆడవచ్చు. అంతర్జాలంతో అనుసంధానం కావడం వల్ల రైతులకు మండి ధరలు, వ్యవసాయంలో ఉత్తమ పద్ధతులు వంటి వివరాలు పొందగలరు, అంతేకాక విత్తనాలు, ఎరువులు వంటివి ఆర్డర్ చేయగలుగుతారు. తద్వారా రైతులు వారి ఉత్పత్తుల నాణ్యత పెంపొందించుకుని, మరింత మెరుగైన ధర పొందగలరు.
ఐటీసీ లిమిటెడ్ వారు ఇంటర్నెట్ సౌకర్యంతో ఏర్పాటుచేసిన ప్రతీ కియోస్క్ ని శిక్షణ పొందిన రైతు సంచాలక్ గా నడిపిస్తారు. కంప్యూటర్ ను సంచాలక్ ఇంటిలో ఉంచి, విశాట్ కనెక్షన్ తో కానీ, ఫోన్ లైనుతో కానీ ఇంటర్నెట్ కు అనుసంధానం చేస్తారు. ఇలాంటి ప్రతి కంప్యూటర్ ఏర్పాటూ సుమారు చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలో 10 గ్రామాలకు చెందిన 600 మంది వ్యవసాయదారులకు సేవలు అందించింది. సంచాలక్ కొద్దిపాటి నిర్వహణ వ్యయాన్ని భరిస్తారు, ఐతే ప్రతిఫలంగా ఇ-చౌపల్ ద్వారా జరిగే లావాదేవీలపై సేవా రుసుము సంపాదించుకుంటారు.