ఉజ్జయిని చింతామన్ వినాయక దేవాలయం
ఉజ్జయిని చింతామన్ వినాయక దేవాలయం | |
---|---|
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | మధ్యప్రదేశ్ |
జిల్లా: | ఉజ్జయిని |
ప్రదేశం: | ఫతేహాబాద్ |
ఉజ్జయిని చింతామన్ వినాయక దేవాలయం, మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఉజ్జయిని నగరంలో ఉన్న అతిపెద్ద వినాయకుడి దేవాలయం. ఫతేహాబాద్ రైలుమార్గంలో క్షిప్రా నదికి అడ్డంగా నిర్మించబడిన ఈ దేవాలయం, ఉజ్జయిని పట్టణానికి నైరుతి దిశలో సుమారు 7 కి.మీ.ల దూరంలో ఉంది.[1] ఈ దేవాలయం ప్రస్తుతం పట్టణ మార్కెట్ మధ్యలో ఉంది.
ఈ దేవాలయంలో ప్రతిష్టించబడిన వినాయకుడి విగ్రహం స్వయంభూగా వెలిసిందని చరిత్ర చెబుతోంది. అన్ని చింతలను తీర్చేవాడుగా ఇక్కడి ప్రజులు ఈ వినాయకుడిని చింతామన్ అని కూడా పిలుస్తారు.[2]
ప్రాముఖ్యత
[మార్చు]హిందూ విశ్వాసాల ప్రకారం వినాయకుడు తొలి దేవుడిగా పరిగణించబడ్డాడు. వినాయకుడిని చింతాహరన్ (అన్ని చింతలు, ఉద్రిక్తతలను తొలగించేవాడు) అని పిలుస్తారు.[3]
చరిత్ర
[మార్చు]ఈ దేవాలయం 11వ, 12వ శతాబ్దాలలో మాళవను పరమారాసు పాలించినప్పటిదని, రామాయణ యుగం నాటిదని, సీత ద్వారా స్థాపించబడిందని కూడా ఇక్కడి భక్తుల నమ్మకం.[3]
ఆర్కిటెక్చర్
[మార్చు]సభా ప్రాంగణంలో చక్కగా చెక్కబడిన రాతి స్తంభాలు, తెల్లటి మందిరం మొదలైనవి ఈ దేవాలయ పురాతన పవిత్రతను తెలుపుతున్నాయి.[4]
మూలాలు
[మార్చు]- ↑ mptourism Archived 3 సెప్టెంబరు 2014 at the Wayback Machine
- ↑ Karkar, S.C. (2009). The Top Ten Temple Towns of India. Kolkota: Mark Age Publication. p. 124. ISBN 978-81-87952-12-1.
- ↑ 3.0 3.1 "गणेश मंदिर: इस मंदिर की दीवार पर उल्टा स्वास्तिक बनाने से होती है हर मन्नत पूरी". Patrika News (in hindi). Retrieved 2022-08-01.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ culturalindia