Jump to content

ఉద్ధవుడు

వికీపీడియా నుండి
ఉద్ధవుడు
కృష్ణుని దూత అయిన ఉద్ధవుడి చిత్రలేఖనం
ఇతర పేర్లుపవనయాధి
అనుబంధంవృష్ణి
పాఠ్యగ్రంథాలుపురాణాలు, మహాభారతం
రాజవంశంయదువంశం

ఉద్ధవుడు హిందూ పురాణాలలో కనిపించే వ్యక్తి. ఈయన శ్రీకృష్ణుడికి స్నేహితుడు, సలహాదారుడు. భాగవత పురాణంలో ఈయన పాత్ర ప్రముఖంగా కనిపిస్తుంది. ఇతనికి శ్రీకృష్ణుడే స్వయంగా యోగ, భక్తి విషయాలను బోధించాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించినది భగవద్గీత అయినట్లే, ఈ బోధలు ఉద్ధవ గీత అనే పేరుగాంచాయి.[1] మహాభారతంలో ఈయనను వృష్ణి సేనలకు సలహాదారుగా పేర్కొన్నారు. వారందరూ ఈయనను అభిమానంతోనూ, గౌరవంతోనూ చూసేవారు.[2] భాగవత పురాణంలో ఈయనను బృహస్పతి శిష్యుడిగా పేర్కొన్నారు.[3]

పురణ గాథ

[మార్చు]

బృందావనానికి దూత

[మార్చు]

భాగవత పురాణం, బ్రహ్మవైవర్త పురాణంలో, కృష్ణుడు కంసుడిని జయించిన తర్వాత, ఉద్ధవుడు కృష్ణుణ్ణి చూడటానికి వస్తాడు. దానికి కృష్ణుడు చాలా సంతోషిస్తాడు. బృందావనంలో తన సహవాసాన్ని కోరుకుంటున్న గోపికలకు, గ్రామంలోని ఇతర నివాసులకు తన తరపున ఒక సందేశాన్ని తీసుకెళ్ళాలని కృష్ణుడు ఉద్ధవుడిని కోరతాడు. భూమిపై తన విధులను పూర్తి చేయాలంటే, వాళ్ళు తనను మరచిపోవాలని బృందావన ప్రజలకు చెప్పమని కృష్ణుడు ఉద్ధవుడికి చెబుతాడు. అక్కడ ఉద్ధవుడు, రాధా, గోపికలూ కృష్ణుడి పట్ల చూపుతున్న భక్తికి ఎంతగానో ఆకర్షితుడయ్యి అక్కడే బృందావనంలోనే అతడు ఆరు నెలలు ఉంటాడు. అతడు గోపికలను తన గురువులుగా ఉండమని కోరతాడు.

కృష్ణుడి సందేశాన్ని ఉద్ధవుడు గోపికలకు చెప్పినపుడు వాళ్ళు, 'ఆనాడు అక్రూరుడు బృందావనానికి వచ్చి కృష్ణుడిని మానుండి తీసుకెళ్ళిపోయాడు, ఇప్పుడు నువ్వు అతని జ్ఞాపకాలను కూడా తీసుకువెళ్ళడానికి వచ్చావా?' అని గోపికలు అడిగిన ప్రశ్నతో అతడు నిరుత్తరుడౌతాడు. ఈ సంభాషణ లోని సారాంశం, అది మనసుల్లో కదిలించే భావాలూ గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో దేవునిపై ఉండే ప్రేమ పట్ల ఉత్కృష్టమైన అవగాహనకు ఆలంబనలయ్యాయి.[4]

మూలాలు

[మార్చు]
  1. Saraswati, Swami Ambikananda (2002-09-28). The Uddhava Gita: The Final Teaching of Krishna (in ఇంగ్లీష్). Ulysses Press. ISBN 978-1-56975-320-0.
  2. Mahbharata Sabha Parva by PC Roy Dyuta Parva page 111, Dhritarashtra's speech
  3. Bhagavata Purana Skandha XI Chapter 23 Verses 2, Bhiksu Gita, Motilal Bansaridass Publishers Book 5 pages 2061 Link: https://archive.org/details/BhagavataPuranaMotilalEnglish
  4. Desai, Kunal (2017-10-03). My Affair with Rãdhã (in ఇంగ్లీష్). Notion Press. ISBN 978-1-947851-91-7.
"https://te.wikipedia.org/w/index.php?title=ఉద్ధవుడు&oldid=4685352" నుండి వెలికితీశారు