Jump to content

ఉద్యాన పుష్పములు (పుస్తకం)

వికీపీడియా నుండి

ఉద్యాన పుష్పములు 1967లో విష్ణు స్వరూప్ రచించిన పుస్తకానికి తెలుగు అనువాదం. ఈ పుస్తకాన్ని జి.నరసింహం తెలుగులోకి అనువదించాడు. [1]

రచన నేపథ్యం

[మార్చు]

ఉద్యాన పుష్పములు పుస్తకాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా భారతదేశము-ప్రజలు శీర్షిక ద్వారా ప్రచురించారు. 268 పుటల్లో రూ.30కి ఈ పుస్తకాన్ని నే.బు.ట్ర. అందిస్తోంది (2013 నాటికి)[2]

విషయం

[మార్చు]

ఈ పుస్తకములో భారతదేశంలోని తోటలలో సాధారణముగా పెంచు వివిధ రకాల పూలను వర్ణించడం జరిగింది. ఉద్యాన పుష్పాల రకాలు, పెంపకం పద్ధతులు వంటివి ఈ పుస్తకంలోని విషయాలు. పూలమొక్కలు పెంచేవారికి, ముఖ్యంగా ఔత్సాహికులకు, వివిధ జాతుల పూవులను తోటల్లో వాటి ప్రయోజనాలను, పెంచే విధానాన్ని పరిచయం చేయడమే దీని ముఖ్యాశయం.

ప్రతీ పూవునకు దాని వాడుక పేరు, లాటిన్ పేరు కూడా ఇందులో పేర్కొనబడినవి. తోటలలో పెంచు పూలను, భారతదేశముల పూల, పూదోటల సంక్షిప్త చరిత్రను గూర్చి రాయబడినది. మొక్కలకు పీడించు రోగములను, కీటకములున్నూ, వాటిని అదుపు చేయు పద్ధతులు కూడా వివరించబడినవి.

మూలాలు

[మార్చు]
  1. విష్ణుస్వరూప్, బి నరసింహం(అను ) (1969). ఉద్యాన పుష్పములు.
  2. పుస్తకసూచి 2013 తెలుగు ప్రచురణలు: మా పరిచయం:నే.బు.ట్ర.ప్రచురణ