ఉద్వేగం
ఉద్వేగం | |
---|---|
దర్శకత్వం | మహిపాల్ రెడ్డి |
రచన | మహిపాల్ రెడ్డి |
నిర్మాత | జి. శంకర్ ఎల్. మధు |
తారాగణం | |
ఛాయాగ్రహణం | అజయ్ |
కూర్పు | జశ్వీన్ ప్రభు |
సంగీతం | కార్తిక్ కొడగండ్ల |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 29 నవంబరు 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఉద్వేగం 2024లో తెలుగులో విడుదలైన కోర్ట్ రూమ్ డ్రామా సినిమా.[1] కళా సృష్టి ఇంటర్నేషనల్, మణిదీప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై జి. శంకర్, ఎల్. మధు నిర్మించిన ఈ సినిమాకు మహిపాల్ రెడ్డి దర్శకత్వం వహించాడు. త్రిగుణ్, దీప్సిక, శ్రీకాంత్ అయ్యంగార్, సురేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 12న,[2] ట్రైలర్‌ను నవంబర్ 23న విడుదల చేసి, నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలైంది.
కథ
[మార్చు]న్యాయవాది అయిన మహీంద్రా (త్రిగుణ్) తనదైన శైలిలో క్రిమినల్ కేసులను సులభంగా తీర్చేస్తుంటాడు. మహీంద్రా అమ్ములు (దీప్షిక)ను ప్రేమిస్తుంటాడు. ఈ క్రమంలో ఒక రోజు గ్యాంగ్ రేప్ కేసు అతనికి వస్తుంది. మొదట అతను ఈ కేసు తీసుకోవడానికి నిరాకరిస్తాడు, కానీ తరువాత కొన్ని కారణాల వల్ల కేసును స్వీకరించి, A2 నిందితుడు సంపత్ కోసం వాదిస్తాడు, ప్రసాద్ (శ్రీకాంత్ అయ్యంగార్) అమ్మాయి తరపున ఈ కేసును వాదిస్తాడు. ఈ కేసు మహీంద్రా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఏమి మార్పులు తీసుకువచ్చింది? చివరికి ఈ కేసులో ఏం జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[3][4][5]
నటీనటులు
[మార్చు]- త్రిగుణ్
- దీప్సిక
- శ్రీకాంత్ అయ్యంగార్
- సురేష్
- పరుచూరి గోపాలకృష్ణ
- శివ కృష్ణ
- ఐ డ్రీమ్స్ అంజలి
మూలాలు
[మార్చు]- ↑ NT News (29 November 2024). "కోర్ట్‌రూమ్ డ్రామా 'ఉద్వేగం'". Archived from the original on 2 December 2024. Retrieved 2 December 2024.
- ↑ Sakshi (30 August 2024). "ఉద్వేగం సినిమా టీజర్‌ని RGV విడుదల చేశారు". Archived from the original on 2 December 2024. Retrieved 2 December 2024.
- ↑ Chitrajyothy (29 November 2024). "కోర్ట్ రూమ్ డ్రామా.. ఉద్వేగం ఎలా ఉందంటే." Archived from the original on 2 December 2024. Retrieved 2 December 2024.
- ↑ Sakshi (29 November 2024). "'ఉద్వేగం' మూవీ రివ్యూ". Archived from the original on 2 December 2024. Retrieved 2 December 2024.
- ↑ Zee News Telugu (28 November 2024). "'ఉద్వేగం' మూవీ రివ్యూ.. ఆకట్టుకునే కోర్ట్ రూమ్ డ్రామా." Archived from the original on 2 December 2024. Retrieved 2 December 2024.