ఉన్నియార్చ
ఉన్నియార్చ | |
---|---|
16వ శతాబ్దం | |
ఇతర పేర్లు: | ఉన్నార్చ |
జన్మస్థలం: | పుత్తూరం వీడు, కడతనాడ్, కేరళ |
ఉద్యమం: | నాదపురం పోరాటం(మాప్పిలాలతో) |
ఉన్నియార్చ (ఉన్నార్చ అని కూడా పిలుస్తారు) కేరళ రాష్ట్రానికి చెందిన కళరియపట్టు అనే యుద్ధక్రీడ యోధురాలు. ఆమె కడతనాడ్‌లోని పుత్తూరం వీడ్‌లో గల తియ్యర్ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి పేరు కన్నప్ప చేకవర్. ఆమె 16వ శతాబ్దంలో ఉత్తర కేరళ ప్రాంతంలో నివసించినట్లు ఆధారాలు ఉన్నాయి.[1][2] ఆమె కేరళ జానపద కథలలో ఒక ప్రసిద్ధ పాత్ర వలన, కేరళ స్థానిక యుద్ధ కళ అయిన కళరిపయట్టులోని ఆమె పరాక్రమం, నైపుణ్యాల వలన ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం, ఉన్నియార్చ కేరళకు చెందిన ఒక ప్రత్యేకమైన కత్తి, కొరడా లాంటి ఉరుమితో యుద్ధం చేయగల యోధురాలు. సాంప్రదాయ కళరిపయట్టు అభ్యాసకుల వలె, ఆమె ఏడు సంవత్సరాల వయస్సులోనే కళరియపట్టులో శిక్షణ పొందింది.[3][4]
చరిత్ర
[మార్చు]అట్టుమ్మనమ్మెల్ ఉన్నియార్చ ఉత్తర కేరళలోని కడతనాడ్‌లోని ప్రసిద్ధ పుత్తూరం వీడుకి చెందిన యోధురాలు.[4][3] ఉన్నియార్చ అట్టుమనమ్మెల్ కుంజిరామన్‌ను వివాహం చేసుకుంది. ఉన్నియార్చ కేరళలోని కళరిపయట్టు యుద్ధ నైపుణ్యంతో ప్రసిద్ధి చెందింది.[5]
ఉన్నియార్చ ఉత్తర మలబార్‌లోని కథానాయికల అందరిలో చాలా అసాధారణమైనది. ఆర్చా అని కూడా పిలుస్తారు, ఆమె కేరళలో సాధికారత పొందిన స్వతంత్ర మహిళకు మారుపేరుగా మారింది. ఆమె పేరు కేరళ స్త్రీలలో అందం, ధైర్యం, స్వాతంత్ర్యానికి చిహ్నంగా మారింది.[6] [7]
నాదపురం పోరాటం
[మార్చు]చరిత్రకారుడు ఎ శ్రీధర మీనన్ ప్రకారం, ఉన్నియార్చ తన బాల్యంలో కళరిలో కఠినమైన శిక్షణ పొందడం ద్వారా యుద్ధ సాంకేతికతలో ప్రావీణ్యం సంపాదించింది. ఆమె స్త్రీ వీరత్వ స్వరూపం, ఉత్తర బల్లాడ్‌లలో ఆమెకు ఆపాదించబడిన అనేక శౌర్య పరాక్రమాలు ఉన్నాయి. ఆమె అట్టుమ్మనమ్మెల్ కుంజిరామన్‌ను పెళ్లాడింది. పెళ్లయిన తర్వాత ఒకరోజు ఉన్నియార్చ ఇంటి నుండి అల్లిమలర్‌కావులోని కుతు, అయ్యప్పన్‌కావులోని విళక్కు, అంజనకావులోని వేలపురం (బల్లాల్లోని వెర్షన్) అనే పండుగలను చూడటానికి బయలుదేరారు. దారిలో ఉన్న మాప్పిలాలు (మాహిళలను వేధించి అరేబియకు పంపించి బానిస వ్యాపారం చేయించే ముస్లింలు) చాలా భయంకరంగా ఉంటారన్న ఉద్దేశ్యంతో, ఆమె ప్రయాణాన్ని ఆమె భర్త, కుటుంబీకులు అంగీకరించలేదు. అయినప్పటికీ, ఆమె ఈ పండుగలకు వెళ్లాలని నిశ్చయించుకుంది. ఊహించినట్లుగానే, ఆమెను మాప్పిలాలు నాదపురంలో వేధించారు. కుంజిరామన్ సందిగ్ధంలో ఉన్నప్పటికీ, ఉన్నియార్చా తన ప్రత్యర్థులను దాదాపు ఒంటరిగా ఎదుర్కోవడం ద్వారా తన సత్తాను ప్రదర్శించింది. ప్రత్యర్థుల నాయకుడు (ముప్పన్) ఆమె పరాక్రమాలను వెంటనే గ్రహించాడు. తన తప్పును గ్రహించిన ముప్పన్ ఆమెను శాంతింపజేయడానికి తన శాయశక్తులా ప్రయత్నించాడు, కానీ ఖచ్చితమైన హామీ లేకుండా అతన్ని క్షమించలేదు. పాలక అధిపతి భార్య లేదా చేకవర్ స్నేహితుడైన చెట్టి మధ్యవర్తిత్వం కూడా ఆమెను గెలవలేకపోయింది. ఎట్టకేలకు ఆరోమల్ చేకవర్ స్వయంగా రంగంలోకి దిగాడు. ముప్పన్ క్షమాపణలు చెప్పి, అన్ని రకాల బహుమతులు అందించిన తర్వాత మాత్రమే ఆమె శాంతించింది, తన విరోధుల పట్ల శాంతిని నెలకొల్పింది.[8][9]
సినిమాలు
[మార్చు]ఉన్నియార్చ జీవిత చరిత్ర ఆధారంగా అనేక సినిమాలు తీయబడ్డాయి:
- ఉన్నియార్చ (1961)
- ఆరోమలున్ని (1972)
- ఒరు వడక్కన్ వీరగాథ (1989)
- పుత్తూరంపుత్రి ఉన్నియార్చ (2002).
- ఏషియానెట్ (2006)లో ఉన్నియార్చ అనే టెలివిజన్ సీరియల్ ప్రసారం చేయబడింది.
- ఆమె పాత్ర వీరమ్ (2016)లో కూడా చూపించబడింది.
మూలాలు
[మార్చు]- ↑ Kurup, Pushpa (28 November 2017). "What MT did to Unniyarcha". Deccan Chronicle. Archived from the original on 21 నవంబరు 2020. Retrieved 8 మార్చి 2022.
- ↑ Jumbos and Jumping Devils: A Social History of Indian Circus - Nisha P.R. - Google Books and Jumping Devils
- ↑ 3.0 3.1 "History of Malayalam Literature: Folk literature". Archived from the original on 2012-07-12. Retrieved 2013-08-09.
- ↑ 4.0 4.1 "Meet Padma Shri Meenakshi Gurukkal, the grand old dame of Kalaripayattu - The 75-year-old Padma winner is perhaps the oldest Kalaripayattu exponent in the country".
- ↑ "What MT did to Unniyarcha - Deccan Chronicle". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2019-03-12.
- ↑ Ullekh.N.p, Kannur:inside India's Bloodiest Revenge Politics[permanent dead link] google books. P.201
- ↑ Ayyappapanicker, K. (2000). Medieval Indian Literature: An Anthology. en:Sahitya Akademi. p. 316. ISBN 81-260-0365-0.
- ↑ Menon, A. Sreedhara (4 March 2011). Kerala History and its Makers (in ఇంగ్లీష్). D C Books. pp. 82–86. ISBN 978-81-264-3782-5. Retrieved 10 October 2021.
- ↑ Gangadharan, Dr. Thikkurissi (1984). Puthariyankam. en:DCBooks. p. 148.