ఉప్పలపాటి సైదులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

షేక్ సైదులు పౌరాణిక రంగస్థల కళాకారుడు.గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు గ్రామంలో జూన్ 30, 1941వ సంవత్సరంలో షేక్ అబ్దుల్లా, షేక్ మీరాబి దంపతులకు జన్మించారు. 6 వేలకు పైగా పౌరాణిక నాటక ప్రదర్శనలిచ్చారు.నాటకాలలో శ్రీరాముడుగా, శ్రీకృష్ణ, హరిశ్చంద్ర, శ్రీనివాస, ఇంధ్ర, భవాని, బాలవర్ధి, కార్యవర్ధి, బిల్వ, అర్జున, నకుల, సహదేవ, వికర్ణ, మాతంగి తదితర పాత్రలు ధరించారు. బంగారు కిరీటాన్ని, స్వర్ణ సింహ తలాటాన్ని, సువర్ణహస్త ఘంటా కంకణాలు, వెండి వేణువులు, గండ పెండేరాలతో పాటు 18 పరిషత్ నాటక పోటీల్లో ప్రథమ బహుమతులను అందుకున్నారు.పద్యం భావ రాగయుక్తంగా ఆలపిస్తారు.తెలుగునాట నాలుగున్నర దశాబ్దాలకు పైబడి పౌరాణిక నాటకరంగంలో శ్రీ కృష్ణపాత్రలో జీవించారు ఉప్పలపాడు సైదులు.