ఉబ్బ
ఉబ్బ
[మార్చు]ఉబ్బ అనేది చాకలివారి పొయ్యి. మూడు పెద్ద మట్టి కుండలను త్రికోణంలో ఒక దానికొకటి ఆనించి పెద్ద పొయ్యి మీద పెడ్తారు. కుండల చుట్టు కుండలు కనబడకుండా మట్టిని మెత్తిస్తారు. వాటిపైన కుండ మూతలు మాత్రమే కనిపిస్తుంటాయి. ఆ కుండలలో సౌడు కలిపిన నీటిని సగంవరకు నింపి కుండల క్రింద మంట పెడతారు. కుండలపై వలయాకారంలో సౌడు నీటిలో ముంచిన బట్టలను చుట్టతారు. ఇలా సుమారు రెండడుగుల ఎత్తు వరకు కప్పి చివరగా ఆ మొత్తానికి ఒక్క పెద్ద గుడ్డను కప్పుతారు. క్రింద మంట వలన కుండల్లో నీరు ఆవిరై పైన కప్పిన గుడ్డలన్నింటికి వ్వాపిస్తుంది. ఇలా సుమారు రెండు మూడు గంటలు పొయ్యి క్రింద మంట పెట్టినతర్వాత... మెల్లగా ఒక్కొక్క బట్టను విడదీస్తారు. ఆ తర్వాత వాటిని మంచి నీటిలో ఉతుకుతారు. దానివలన బట్టలకు అంటిన నూనె లాంటి మరకలు నీటి ఆవిరి వలన పోయి బట్టలు శుభ్ర పడతాయి. ఇందులో ఒక ప్రమాదమున్నది. అదేమంటే సౌడు నీటి ఆవిరికి గాడమైన రంగులు వున్న బట్టల రంగులు వేరె బట్టలకు అంటుకుంటుంది. అందు చేత చాకలి రంగులు వెలిసి పోయె బట్టలను ఉబ్బకు వేయరు. ఎక్కువగా తెల్ల బట్టలనే ఉబ్బ కేస్తారు.
సౌడు అనగా ఉప్పు నేలల్లో ...... ఎండాకాలంలో భూమి పొరపై ఒక విధమైన మట్టి తేలుతుంది. అక్కడక్కడా తెల్లని పొరలు కూడా కనిపిస్తాయి. దీని రుచి చాల ఉప్పగా వుంటుంది. ఈ భూములను సౌడుభూములు అని అంటారు. చాకలి వారు ఈ భూములపై పేరుకొన్న ఆ నున్నటి మట్టిని తీసి కుప్పలు పోసి తమ ఇంటి వద్ద దాచి పెట్టుకొని సమయానుకూలంగా వాడు కుంటారు. దీనినే సౌడు అని అంటారు. ఇది వున్న భూములను చవట భూములు, లేదా సవుడు భూములు అని అంటారు.