ఉభయభారతి
ఉభయ భారతి మండన మిశ్రుడి భార్య ఈమెను సరస్వతి అంశగా చెపుతారు. ఆది శంకరుడుకి, తన భర్త మండనమిశ్రునికి జరిగిన వాద-వివాదంలో మధ్యవర్తిగా ఉండి వారి గెలుపోటములను నిర్ణయించినది ఈమె.
పూర్వవృత్తాంతము
[మార్చు]సత్యలోకంలో జరుగుతున్న మహాసభలో దూర్వాసుడు సామగానం పఠిస్తున్న సంధర్భలో స్వరం తప్పుగా పలికినపుడు సరస్వతి నవ్వగా కోపించిన దూర్వాసుడు చిన్న పెద్దల తారతమ్యం తెలుసుకొనక పరిహసించిన నువ్వు భూలోకంలో మనుష్యజాతిలో పుట్టు అని శపిస్తాడు. బ్రహ్మ క్షమింపమని శాపవిమోచనమిమ్మని అడుగగా నీ అంశతో పుట్టే మండన మిశ్రుని భార్యగా సరస్వతి జన్మిస్తుంది. ఈశ్వరుని అంశతో పుట్టే శంకరుని చూసి అతని ద్వారా పాండిత్యంలో ఓడింపబడినపుడు ఆమెకు శాపవిమోచనమౌతుంది అని చెప్పాడు. మందన మిశ్రునితో గెలుపొందిన శంకరుని చూసి భర్తలో సగం కనుక నన్ను కూడా ఓడిస్తేనే గెలిచినట్టుగా చెప్పి అతడిచే ఓడింపబడి ఆమె శాపవిమోచనం పొందుతుంది.
మూలాలు
[మార్చు]మధిర సుబ్బన్న దేక్షిత కవి కాశీమజిలీ కథలు నుండి.