Jump to content

ఉవ్వటుడు

వికీపీడియా నుండి

ఉవ్వట లేదా ఆచార్య ఉవ్వటుడు ప్రసిద్ధ వేద వ్యాఖ్యాత. ఇతను యజుర్వేదానికి వ్యాఖ్య రచించినవారిలో ప్రముఖుడు. ఆచార్య ఉవ్వటుడు రచించిన యజుర్వేదంలోని 'మంత్రభాష్య' ద్వారా ఈతని తండ్రి పేరు వజ్రటుడని తెలుస్తున్నది. అలాగే, అతని జన్మస్థలం ఆనందపూర్ అని చెబుతారు.

కొంతమంది పండితుల ప్రకటన ప్రకారం, అతను మహారాజ్ భోజుడు సమయంలో పదకొండవ శతాబ్దంలో అవంతీనగరిలో ఉన్నాడు. ఉవ్వటుడు భోజుడు పాలనలో ఉజ్జయినిలో ఉంటూ, ఉవ్వట భాష్యము అనే పేరుతో ప్రసిద్ధి చెందిన శుక్ల యజుర్వేదంలోని మాధ్యందిన వాజసనేయి సంహిత యొక్క పూర్తి నలభై అధ్యాయాలను వ్యాఖ్యానించాడు. 'భవిష్య-భక్తి-మహాత్మ్య' అనే సంస్కృత గ్రంథం అతన్ని కాశ్మీర్ దేశ నివాసిగా, మమ్మటుడు, కైయ్యటుడు సమకాలీనుడిగా వివరిస్తుంది.

అతను శుక్ల యజుర్వేద కణ్వ శాఖపై వ్యాఖ్యానంచేసి ఋగ్వేద శౌనక ప్రాతిశాఖ్య అనే పుస్తకాన్ని రచించాడు. ఋగ్వేద శౌనక ప్రాతిశాఖ భాష్యం వ్రాసిన తరువాత, అతను ఋగ్వేదానికి వ్యాఖ్యానం కూడా రచించాడని కొందరు అంటారు.

మూలములు

[మార్చు]

ఋగ్వేద ప్రాతిశాఖ్య ఉవ్వట

"https://te.wikipedia.org/w/index.php?title=ఉవ్వటుడు&oldid=4079904" నుండి వెలికితీశారు