ఉసిళ్ళు
ఉసిళ్ళు | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: |
ఉసిళ్ళు, ఇసుళ్ళు, వుసుళ్ళు అనేవి ఆర్ఢ్రోపొడా వర్గానికి చెందిన కీటకాలు, వీటిని గ్రామీణ ప్రాంతాలలో ఆహారంగా వినియోగిస్తారు. తొలకరి వర్షాలు పడినప్పుడు పుట్టల నుంచి ఇవి మందలుగా లేచి వస్తాయి. కాంతి ఎక్కువగా వున్న చోటుకు ఆకర్షితం అవుతాయి. ఒక జత రెక్కలు, మూడు జతల కాళ్ళు వుంటాయి
శరీర నిర్మాణము
[మార్చు]ఉసిళ్ళు ఇతర ఆర్ధోపొడా జీవుల మాదిరి గానే మూడు జతల కాళ్ళను కలిగి వుంటాయి, భాహ్య అస్థిపంజర నిర్మాణంలాగా శరీరంపై పల్చటి పెంకు రక్షణగా వుంటుంది. ఎగిరేందుకు ఒక జత రెక్కలు వుంటాయి.పుల్లకమ్మలు అనే కీటకాలు దాదాపు ఈ ఉసిళ్లను పోలి వుంటాయి కానీ అవి వీటికంటే సన్నగా వుండి రెక్కల పొడవు తక్కువగా వుండి తెలుపు పారదర్శక రెక్కలను కలిగివుంటాయి. ఉసిళ్లు కండబట్టినట్లు పులకమ్మల కన్నా లావుగా కనిపిస్తాయి. శరీర వర్ణం రెక్కల రంగులో కూడా వాటితో తేడా కనిపిస్తుంది.
ఉసిళ్ళు పై చెప్పే ఒక కథ
[మార్చు]గిరిజన ప్రాంతాలలోనూ, గ్రామీణ ప్రాంతాలలోనూ ఈ ఉసిళ్ళను ఆహారంగా తీసుకుంటూ వీటి గురించి ఒక కథ చెప్పుకుంటుంటారు. అనగనగా ఒక ఊరిలో ఒక అన్నకు ఇద్దరు చెళ్ళెళ్ళు ఉండేవారట అతనికి చిన్న చెల్లెలు అంటే ఎక్కువ గారాబంగా చూసుకునే వాడట, ఈ విషయంలో పెద్ద చెల్లికి ఎప్పుడూ కోపం గా వుండేది. వీరిద్దరికి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత కూడా చిన్న చెల్లి ఇంటికే అన్న ఎక్కువ సార్లు వెళుతున్నాడని ఎలాగైనా అతడికి చెల్లిపై కోపం వచ్చేలా చెయ్యాలని, మాయమాటలో వ్యూహం పన్నుతుంది పెద్ద చెల్లి, చిన్పదాని దగ్గరకు వెళ్ళి అన్నకు నువ్వు పరవన్నం అన్నం ఎలా వండుపెడుతున్నావు అంటే దాందేముంది అక్కా నీళ్ళతో ఎసరు పెట్టి పాలు బెల్లం తో వండి పెడుతున్నాను అంటుంది. ఓసి పిచ్చి మొహమా అలా వండితేనే గొప్పగా వుంటే చిన్నప్పటినుంచి గుండెలమీద పెంచిన అన్నకు ఇంకా బాగా వండి పెట్టాలి కదా, పాలతో కడిగి నెయ్యితో ఎసరు పెట్టి వంటు అని చెపుతుంది. నిజానికి నేతిలో బియ్యం ఉడకవు అనే సంగతి తెలియని చిన్న చెల్లి అన్న వచ్చినప్పుడు ఆయన్ను ముందు గదిలో కూర్చో బెట్టి పాలతో కడిగిన బియ్యాన్ని నెయ్యితో వండటం మెదలేస్తుంది.
కానీ ఎంత సేపటికీ అవి ఉడకనే ఉడకటం లేదు. అమ్మా వంటయ్యిందా అని అన్న అడగటం, ఆమె బయటికి రాకుండానే పొయ్యి ఊదుతూ ఇదిగొ అన్నా అయిపోయింది అంటూ సమాధానం ఇవ్వడం ఇలా మధ్యాహ్నం నుంచి సాయంత్రం పొద్దు దిగే వరకూ సాగుతూనే వుంది. ఎంతకీ వంట పూర్తి కాకపోయే సరికి చెల్లికి తను రావడం ఇష్టం లేక అలా వండుతున్నట్లే నటిస్తోంది అని కోపగించిన అన్న చర చరా నడుచుకుంటూ ఊరి వైపు వెళ్లి పోతుంటాడు. పైగా పొద్దుకుంకే లోగా స్వంత ఊరు చేరుకోవాలనే ఆతృత కూడా ఒక మైపు మనసులో వున్నదాయే. అన్నా ఇదిగో వస్తున్నా, అయ్యో వంటయ్యింది అంటూ చెట్టి ఉడుకుతున్న తపాళాను చుట్టకుదురు చుట్టి తలమీద పెట్టుకుని వెనకే వెంబడిస్తూ వెళుతుంది కానీ పెద్ద పెద్ద అంగలేసుకుంటూ విస విసా వెళ్లి పోయిన అన్న ఆ కాల బాట మొత్తం చూసినా కనుచూపు మేరలో కనపడదు. రాక రాక వచ్చిన అన్నకు పట్టెడు అన్నం పెట్టలేక పోయానే అని ఉస్సూరంటూ ఆ అయమ్మ, నాగరాజును ప్రార్ధించి అన్నా నాగరాజా నేను నిజమైన ప్రేమతో మా అన్నకు ఈ వంట చేసి వుంటే నువ్వే ఎలాగైనా నన్ను తండ్రిలా పెంచిన అన్నకు అవసరమైనప్పుడు ఆదుకునేలా శక్తి నిచ్చిే ఆహారంగా దీన్ని అందించు అంటూ తలమీది తపాళా సట్టె లోని పదార్ధాన్ని పుట్టలోకి దిమ్మరించి దణ్ణం పెట్టుకుని ఇంటికెళ్లి పోతుందట.
అలా ఆ అమ్మి దిమ్మరించిన నెయ్యిలో ఎసర్లో ఉడుకుతున్న అన్నమే ఒక్కో బియ్యం గింజ ఒక్కో ఉసిళ్ళి ఉరుగుగా మారిందట, అప్పుడప్పుడు అన్నకు వేట దొరకని వేళ ఇవి బయటకు వచ్చి ఆయన ఇంటి వెలుతురులో ఎగిరి పడిపోయి తినేందుకు మేతగా మారేవట. అందుకోసమే ఇప్పటికీ ఉసిళ్ళ పురుగుని వేలితో వత్తినప్పుడు పాలు గారుతుంది. పెంకమీద కాల్చినప్పుడు నూనె వస్తుంది. తింటున్నప్పుడు పాలు నెయ్యి కలిసిన రుచి తెలుస్తుంది. చేతికి అంటిన నూనె కూడా నెయ్యివాసన వస్తుంది అని చెప్తారు. ఇలా ఉసిళ్లనే పురురులు చక్కటి కథ చెప్పి పిల్లలు వాటిని ఇష్టంగా తినడం నేర్పిస్తారు. ఈ కథన గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ చెప్పుకుంటారు. కాకుంటే కొన్ని చోట్ల అన్నని ఈశ్వరుడు అని చెపితే మరికొన్ని చోట్ల మరో పేరు చెపుతుంటారు. లేదా వారి కులానికి తెగకు ఆపాదించి కథను చిన్న చిన్న మార్పులతో చెపుతుంటారు. ఇదే కథ లాంటిది చత్తీస్ ఘడ్ లోని బస్తర్ తెగలలో కూడా చెప్పుకుంటారు.
ఉసిళ్ళను వేటాడే విధానం
[మార్చు]- ఊళ్ళు, ఇళ్ళ దగ్గర అయితే పెద్ద వెలుతురు ద్వారా ఈ పురుగులను ఆకర్షించి నీళ్ల పాత్రలలో పడేలా చేస్తారు అందువల్ల రెక్కలు తడిచి రాలిపోయి అవి ఎగరలేకపోవడంతో సులభంగా పట్టుకుంటారు. దీపం దగ్గర పెద్దగా గాలి వీచకుండా చూసుకోవాలి. విసురుగా వీస్తున్న గాలిలో ఇవి ఎక్కువ సేపు నిలకడగా వుండలేవు.
- మరో పద్దతి ఇవి పుట్టలలోంచి బయటికి వచ్చేటప్పుడే వలలు, పెద్ద గుడ్డలు వంటివి పరిచి వాటిలో చిక్కకుకునేలా పట్టుకుంటారు.
తినే పద్దతి
[మార్చు]- ఎండబెట్టి చాటల సహాయంతో చెరగటం ద్వారా వాటి రెక్కలు అంటుకున్న ఇసుకా తొలగిపోయేలా చేస్తారు.
- ఆ తర్వాత పెంకల మీద దోరగా వేయించుతారు.
- ఇలా వేగిన ఉసిళ్ళలో జొన్న పేళాలు కలుపుకుని తింటారు.
- వివిధ పక్షులు, ఎలుగు బంట్లు వీటిని ఇష్టంగా తింటాయి
ఇతర భాషల్లో పేర్లు
[మార్చు]ఆహారంగా వాడే పురుగుల జాబితా
[మార్చు]ప్రపంచవ్యాప్తంగా వినియోగించబడే తినదగిన క్రిమి జాతుల సంఖ్య 1,000 నుండి 2,000 [1]వరకు ఉంటుంది. ఈ జాతులలో 235 సీతాకోకచిలుకలు చిమ్మటలు, 344 బీటిల్స్, 313 చీమలు, తేనెటీగలు కందిరీగలు, 239 మిడత, క్రికెట్ బొద్దింకలు, 39 చెదపురుగులు, 20 డ్రాగన్ఫ్లైస్, అలాగే సికాడాస్ ఉన్నాయి. పర్యావరణం, పర్యావరణ వ్యవస్థలు వాతావరణంలో తేడాల కారణంగా ఏ జాతులు వినియోగించబడుతున్నాయో ప్రాంతాల వారీగా మారుతుంది.[2]
ఈ క్రింది పట్టిక ప్రపంచవ్యాప్తంగా మానవులు వినియోగించే మొదటి ఐదు క్రిమి ఆర్డర్‌లను జాబితా చేస్తుంది,
కీటక వర్గం | పేరు | ప్రపంచ వ్యాప్త వినియోగం(%) |
---|---|---|
కోలియోప్టెరా | బీటిల్స్ | 31 |
లెపిడోప్టెరా | మాత్ లు సీతాకోకచిలుక రకాలు | 18 |
హైమనోప్టెరా | చీమలు,కందిరీగలు,తేనెటీగలు | 14 |
ఆర్ధోప్టెరా | మిడతలు,గొల్లభామలు, కీచురాయి | 13 |
హెమీప్టెరా | సికాడాస్, లీఫ్‌హాపర్స్, ప్లాంట్‌హాపర్స్ | 10 |
వివిధ పురుగుల పోషక విలువలు
[మార్చు]ఇతర మాంసం వనరులతో పోలిస్తే కీటకాలు అధిక పోషక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. చిమ్మటలు వంటి కీటకాలు ప్రోటీన్ మనకు సోయాబీన్స్ నుండి వచ్చే ప్రోటీన్తో పోల్చదగిన ఉపయోగకరమైనది. పైగా ఇవి కేసైన్ కంటే తక్కువ ఖర్చుతోనే దొరుకుతాయి[3] (జున్ను వంటి ఆహారాలలో లభిస్తుంది). ఇవి జీర్ణవ్యవస్థను మెరుగు పరచే పీచుపదార్ధాన్నికూడా పుష్కలంగా కలిగివుంటాయి ఎక్కువగా అసంతృప్త కొవ్వును కలిగి ఉంటాయి విటమిన్ బి 12,[4] రిబోఫ్లేవిన్ విటమిన్ ఎ అవసరమైన ఖనిజాలు వంటి కొన్ని విటమిన్లను కలిగి ఉంటాయి.[5][6]
మిడుతలు ప్రతి 100 గ్రాముల ముడి మిడుతకు 8 నుండి 20 మిల్లీగ్రాముల ఇనుము కలిగి ఉంటాయి. మరోవైపు పశు మాంసంలో సుమారు 6 మిల్లీగ్రాముల ఇనుము ఉంటుంది. పోషకాల విషయంలో క్రికెట్‌లు కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ప్రతి 100 గ్రాముల పదార్ధం క్రికెట్లలో 12.9 గ్రాముల ప్రోటీన్, 121 కేలరీలు 5.5 గ్రాముల కొవ్వు ఉంటుంది. గొడ్డు మాంసం 100 గ్రాముల పదార్ధంలో 23.5 గ్రాముల ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటుంది, కానీ సుమారు 3 రెట్లు కేలరీలు, 100 గ్రాములలో క్రికెట్స్ చేసే కొవ్వు కంటే నాలుగు రెట్లు ఎక్కువ. కాబట్టి, 100 గ్రాముల పదార్ధానికి, క్రికెట్స్‌లో ఇనుము మినహా గొడ్డు మాంసం యొక్క సగం పోషకాలు మాత్రమే ఉంటాయి. ప్రేగు క్యాన్సర్[7] గుండె జబ్బులు రాకుండా ఇనుము అధికంగా ఉపయోగపడుతుంది.[8]
పోషక విలువలు ప్రతి 100 గ్రా |
మీల్ వార్మ్ (Tenebrio molitor) |
బర్రె పురుగు (Alphitobius diaperinus) |
ఊరు చిమ్మటలు (Acheta domesticus) |
వలస మిడతలు (Locusta migratoria) |
---|---|---|---|---|
శక్తి | 550 kcal / 2303 KJ | 484 kcal/ 2027 KJ | 458 kcal/ 1918 KJ | 559 kcal/ 2341 KJ |
కొవ్వులు సంతృప్త కొవ్వు ఆమ్లాలతో |
37,2 g 9 g |
24,7 g 8 g |
18,5 g 7 g |
38,1 g 13,1 g |
పిండి పదార్ధాలు తీపి పదార్ధాలతో |
5,4 g 0 g |
6,7 g 0 g |
0 g 0 g |
1,1 g 0 g |
మాంసకృత్తులు | 45,1 g | 56,2 g | 69,1 g | 48,2 g |
లవణం | 0,37 g | 0,38 g | 1,03 g | 0,43 g |
ఇవి కూడా చూడండి
[మార్చు]ప్రచారం
[మార్చు]తినదగిన కీటకాల వినియోగం గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడానికి అక్టోబర్ 23న ప్రపంచ తినదగిన కీటకాల దినోత్సవాన్ని బెల్జియం ఔత్సాహిక వ్యాపారవేత్త క్రిస్ డెరుడర్ 2015 లో ప్రవేశపెట్టారు.[9]
మూలాలు
[మార్చు]- ↑ Ramos-Elorduy, Julieta (2009). "Anthropo-Entomophagy: Cultures, Evolution And Sustainability". Entomological Research. 39 (5): 271–288. doi:10.1111/j.1748-5967.2009.00238.x.
- ↑ van Huis, Arnold. Edible Insects: Future Prospects for Food and Feed Security. Rome. ISBN 9789251075968. OCLC 868923724.
- ↑ Van Huis, Arnold (2015). "Edible insects contributing to food security?". Agriculture & Food Security. 4 (20). doi:10.1186/s40066-015-0041-5.
- ↑ Schmidt, Anatol; Call, Lisa; Macheiner, Lukas; Mayer, Helmut K. (2018). "Determination of vitamin B12 in four edible insect species by immunoaffinity and ultra-high performance liquid chromatography". Food Chemistry. 281: 124–129. doi:10.1016/j.foodchem.2018.12.039. PMID 30658738.
- ↑ https://www.huffingtonpost.com/2014/02/10/eating-bugs-food_n_4726371.html?slideshow=true Here’s Why You Should Start Eating (More) Bugs
- ↑ FAO: Edible insects: future prospects for food and feed security. Online: PDF Archived 2019-02-04 at the Wayback Machine.
- ↑ http://www.medscape.com/viewarticle/502752_4
- ↑ http://www.webmd.com/heart-disease/news/20001025/too-much-iron-may-lead-to-heart-attack
- ↑ Edible Bug Farm (2015-10-03): Interview with Chris Derudder on WEID. Archived 2019-03-20 at the Wayback Machine