Jump to content

జెంబతాన్ అకర్

వికీపీడియా నుండి
(ఊడల వంతెన నుండి దారిమార్పు చెందింది)
Jembatan akar, a tourist attraction in Pesisir Selatan

జెంబతాన్ అకర్ (ఆంగ్లం:the root bridge)(తెలుగు:ఊడల వంతెన) సుమత్రా దీవిలో ఉన్న ఊడల వంతెన. ఇది సహజమైనది. ఇది ఇండోనేషియా లోని బయాన్ ఉతర ఉపజిల్లాలో గల ఒక నదిపై సహజంగా ఏర్పడిన వంతెన. నదికి రెండువైపుల గల మర్రి చెట్ల ఊడలతో తయారుచేయబడిన వంతెన.[1] ఇది పాడంగ్ పట్టణానికి దక్షిణంగా 88 కి.మీ దూరంలో ఉన్నది.

నిర్మాణ కారణం

[మార్చు]

ఈ వంతెనకు కారణమైన ఊడలు వాటంతటవే అల్లుకుపోలేదు. వాటిని కొన్ని సంవత్సరాల క్రితం స్థానిక ఉపాధ్యాయుడు అల్లేటట్లు చేశాడు. 1890 ప్రాంతంలో వకిహ్ సొహన్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధిస్తుండేవాడు. నది అవతలి విద్యార్థులు కూడా పాఠశాలకు వస్తుండేవారు. నదీ ప్రవాహం ఎక్కువగా ఉన్నపుడు విద్యార్థులు పాఠశాలకు రాలేకపోయేవారు. వారి సౌకర్యార్థం ఆ ఉపాధ్యాయుడు నదికి ఇరువైపుల ఉన్న చెట్ల ఊడలను అల్లేశాడు. 26 సంవత్సరాల తరువాత అవి బాగా అల్లుకొని ఒక సహజ ఊడల వంతెనగా మారి ఆ గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగపడింది.

లక్షణాలు

[మార్చు]

ఈ వంతెన పొడవు 25 మీటర్లు, వెడల్పు 1.5 మీటర్లు ఉంటుంది. ఇది నది ఉపరితలానికి సుమారు 3 మీటర్ల ఎత్తున ఉంటుంది. ఇది 1890 లో ప్రారంభమైనా 1916 నాటికి వినియోగంలోకి వచ్చింది.[2] ఇది ప్రస్తుతం బలంగా తయారై 20 మంది బరువును కూడా తట్టుకోగల సామర్ధ్యం కలిగి ఉంది. ఈ ప్రాంత పరిసరాలను స్థానికులు పవిత్రంగా భావిస్తారు. ఈ వంతెనను సజీవ వంతెన అంటారు.[3] ఈ ప్రాంతంలో ప్రజలకు పర్యాటక ప్రదేశంగా ఈ ప్రాంతం భాసిల్లుతోంది. ఇది అనేకమంది విదేశీ పర్యాటకులను కూడ ఆకర్షిస్తోంది.

మూలాలు

[మార్చు]
  1. "Jembatan Akar, Bukti Kekuatan Alam di Painan". Detik.com (in Indonesian). 16 February 2012. Archived from the original on 28 మార్చి 2013. Retrieved 14 March 2013.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  2. "Menelusuri Jembatan Akar Terunik di Dunia". Okezone.com (in Indonesian). 9 May 2009. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 14 March 2013.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  3. "Wisata Alam: Jembatan Akar" (in Indonesian). Official website of Pesisir Selatan Regency. Archived from the original on 11 జనవరి 2012. Retrieved 14 March 2013.{{cite web}}: CS1 maint: unrecognized language (link)

ఇతర లింకులు

[మార్చు]