ఊబి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆస్ట్రేలియాలోని ఊబి దగ్గర గమనిక

ఊబిలో కూరుకు పోయి మరణించాడు. అని అంటుంటారు. ఊబిలో కూరుక పోయిన వారు ప్రాణాలతో బయట పడటం దాదాపు అసాధ్యం. అయితే [ఊబి] అనగా ఏమిటి?

ఊబి అనగా బురద నేల. సాధారణ పొలాల్లో వుండే బురద నేలలు కాదు. విస్తారంగా చవిటి భూములున్న చోట ఎక్కువగా ఊబి ఉండే అవకాశమున్నది. కొన్ని వందల అడుగుల విస్తీర్ణములో ఊబి వుండే అవకాశమున్నది. చదునుగా నున్న నేలపై మద్యలో చిన్న చలమ లాగ వుండి అందులో సర్వదా నీళ్ళు వుంటాయి. ఆ చలమ చుట్టూ కొన్ని వందల అడుగుల విస్తీర్ణములో భూమి లోపల కేవలము బురద మాత్రమే వుంటుంది. కాని ఆ భూమి పొర ఎండకు గట్టి పడి వుంటుంది. ఆ భూమి పొర బయటి వైపు మందంగా వుండి చలమ వైపు పోను పోను పలుచగా వుంటుంది. అల్లంత దూరంలో చలమ కనిపిస్తున్నా మనం నిలుచున్న భూమిపై గెంతితే ఊబి వున్న కైవారమంతా చలమ లోని నీళ్ళతో సహా కదులు తుంది. చలమకు దూరంగా నడుస్తుంటే మనం బెడ్ మీద నడచి నట్లుంటుంది. చలమ వైపు దగ్గరికి పోనుపోను పైనున్న పొర పలుచనైనందున మన కాళ్ళకు మెత్తగా తగులుతుంది. మనుషులు నిలబడగలిగిన ప్రదేశంలో జంతువులు లాంటివి అవి బరువుగా వున్నందున ఆ పలుచని పొరలో దిగబడి పోతాయి. క్రింద అంతా పలుచటి బురద మాత్రమే వుంటుంది. లోపల ఎలా వుంటుందంటే.... గడ్డ కట్టిన పెరుగు లాగ వుంటుంది. దాని లోతు పది/ ఇరవై అడుగుల పైగా కూడ వుండే అవకాశముంది. అందులో పడిన మనుషులు గాని, జంతువులు గాని ఈత వచ్చినా సరే అందులో కూరుక పోవలసినదే. ఎవరైనా దగ్గరకి వచ్చి రక్షించడానికి కూడ వీలు లేదు. ఎందుకనగా వారు కూడ అందులో కూరుక పోతారు. ఎండాకాలం దాని చుట్టు ప్రక్కలా భూమి పొర గట్టి పడి దాని పరిది కుంచించుక పోయి వుంటుంది. వర్షాకాలంలో దాని పరిది విస్తరించి మధ్యలోనున్న చలమలో నీరు ఉబికి వస్తూ చిన్న కాలువలాగ పారుతుంది. ఇవి ఎక్కువగా అటవీ ప్రాంతాలలో వుంటాయి. దాహం వేసిన అడవి జంతువులు ఊబి మధ్యలో నున్న చలమలోని నీళ్ళను చూసి త్రాగడానికొచ్చి అందులో చిక్కుకొని పోతుంటాయి. ఇది అతి ప్రమాదకరమైనది. అందులో ఎవరైనా... ఏ జంతువైనా కూరుక పోతే ... ఎవరూ చూడక పోతే అందులో కూరుక పోయిన విషయం గాని..... దాని ఆనవాళ్ళు గాని ఎప్పటికీ బయట పడే అవకాశము లేదు. పశువులను, గొర్రెలను, మేకలను అడవులలో మేపుకునే కాపరులు ఊబిని గమనించగానే దాని చుట్టు కంచ వేస్తారు ఎవరూ దాని దగ్గరికి పోకుండా వుండడానికి.

"https://te.wikipedia.org/w/index.php?title=ఊబి&oldid=3588241" నుండి వెలికితీశారు