ఌ
స్వరూపం
ఌ (Ḷ) తెలుగు వర్ణమాలలోని ఒక అచ్చు. ఇది బ్రాహ్మీ లిపిలోని అక్షరం నుండి రూపాంతరం చెందింది. ఇది కన్నడ లిపిలోని ಌ కి సమానమైనది. తెలుగు లిపిలోని ఇతర అచ్చుల మాదిరిగానే "ఌ"కు సంపూర్ణ అక్షరంతో పాటు, దీనికి గుణింత రూపంకూడా ఉన్నది. అయితే ఈ అచ్చు గుణింత రూపం హల్లులను ఏ విధంగా తాకకుండా, రూపాంతరం చేయకుండా, హల్లు క్రింద వ్రాయబడుతుంది. దేవనాగరిలో ऌ కలిగిన సంస్కృత పదాలను తెలుగులో వ్రాసేందుకు ఇది తెలుగు లిపిలో చేర్చబడిందని భావిస్తారు.
ఉదాహరణలు
[మార్చు]క్లుప్తము అనే పదము యొక్క అసలు రూపం కౢప్తము అని కకు ఌ గుణింతం జేర్చి వ్రాయబడేది। కాలక్రమేణా ఈ వాడుక మూలపడింది. ఆంగ్లములో ఈ శబ్దం యొక్క వాడకము అధికము. కౢప్తములో వచ్చెడి 'కౢ'ను ఆంగ్ల పదము tackle వంటి పదాలలో గమనించవచ్చు.
యూనీకోడు
[మార్చు]- యూనీకోడు - ఌ
- కోడు పాయింటు - U+0C0C [1]
- గుణింతం - ౢ
- గుణింతం కోడుపాయింటు - U+0C62
మూలాలు
[మార్చు]- ↑ AG, Compart. "Find all Unicode Characters from Hieroglyphs to Dingbats – Unicode Compart". compart.com/en/unicode/U+0C0C (in ఇంగ్లీష్). Retrieved 2021-04-03.
ఈ వ్యాసం అక్షరానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |