ఎంఏఎల్ నరసింహారావు
Jump to navigation
Jump to search
ఎం ఏ ఎల్ నరసింహారావు (ముక్కామల వేంకట లక్ష్మీ నరసింహారావు) నేత్ర వైద్యుడు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]అతను చీమకుర్తి లో కంటి డాక్టరు. అతను తొలిసారి కంటిలోని నల్లగుడ్డును మార్చిన వైద్యుడు. ఇతని వైద్యానికి మెచ్చిన విశ్వనాధ సత్యనారాయణ తాను రాసిన గోపికా గీతలు కావ్యాన్ని అతనికి అంకితమిచ్చాడు,[2] వెంపరాల సూర్యనారాయణ, తుమ్మల సీతారామమూర్తి మొదలైన సాహితీ దిగ్గజాలు ఇతని దగ్గర కంటి వైద్యం కోసం వచ్చేవారు. అతను ప్రకాశం జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ గా పనిచేశాడు.అతనికి ఆయుర్వేద పరిషత్ జ్యోతి ప్రధాత బిరుదు ఇచ్చింది.[1] అతను ఒంగోలులో వైద్యశాల ఆరంభించి చాలా ఏళ్ళు సంగీత ఉత్సవాలు నిర్వహించాడు. .తానే వయొలిన్ నేర్చుకున్నాడు. చీమకుర్తి పరిసర గ్రామాలలో సైకిల్ పై తిరిగి ప్రభుత్వ వైద్యునిగా ప్రజలకు వైద్యం చేశాడు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "స్ఫూర్తిప్రదాత ఎంవిఎల్ నరసింహరావు". Prajasakti (in ఇంగ్లీష్). Archived from the original on 2023-05-28. Retrieved 2022-06-10.
- ↑ టి శ్రీరంగస్వామి (1994). విశ్వనాథ వారి కృష్ణకావ్యాలు.