Jump to content

ఎండకుర్తి కామేశ్వరి

వికీపీడియా నుండి
ఎండకుర్తి కామేశ్వరి
జననంకామేశ్వరి
కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
నివాస ప్రాంతంఆంధ్రప్రదేశ్
వృత్తిరంగస్థల నటి
మతంహిందు
భార్య / భర్తవేదనభట్ల నరసింహమూర్తి
తండ్రిఎండకుర్తి అప్పలస్వామి
తల్లినరసయ్యమ్మ

ఎండకుర్తి కామేశ్వరి రంగస్థల నటీమణి.

జననం

[మార్చు]

కామేశ్వరి ఎండకుర్తి నరసయ్యమ్మ, అప్పలస్వామి దంపతులకు తూర్పు గోదావరి జిల్లా, కాకినాడలో జన్మించారు. ఈమె భర్త కీ.శే. వేదనభట్ల నరసింహమూర్తి కూడా రంగస్థల నటుడు.

రంగస్థల ప్రస్థానం

[మార్చు]

చిరుప్రాయమునందే ఆంధ్ర సేవా సంఘం నాటకసంస్థలో చేరి, పూజ్యశ్రీ కిళాంబి కృష్ణమాచార్యుల శిష్యరికంలో ఆంధ్రశ్రీ అనే నాటకంలో మాంచాల పాత్రను ప్రతిభావంతంగా పోషించింది. ఆ తరువాత చింతామణి నాటకంలో చింతామణి, బాలనాగమ్మ నాటకంలో బాలనాగమ్మ, సతీసక్కుబాయి నాటకంలో సక్కుబాయి పాత్రలనే కాక ఇతర పద్య నాటకాలలో కూడా ప్రధాన పాత్రధారణతో పాల్గొని, వందలాది ప్రదర్శనలిచ్చింది. స్త్రీ పాత్రలేకాక, శ్రీకృష్ణతులాభారం నాటకంలో శ్రీకృష్ణుడి పాత్రను కూడా పోషించింది. ఎస్.ఆర్.ఎల్.జి. కళాసమితి, రాజోలు వారి నిర్వాహణలో ప్రదర్శించిన సతీసక్కుబాయి, భర్తృహరి నాటకాలలో ప్రధాన పాత్రలు పోషించింది. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల పథకాల ప్రచారం నిమిత్తం, ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖ గ్రామ, గ్రామాన ఏర్పాటుచేసిన వెలుగొచ్చింది సాంఘిక నాటకంలో సీతాలుగా నటించి ప్రభుత్వాధికారుల నుండి ప్రశంసా పత్రాలందుకున్నది.

సత్కారాలు, బిరుదులు

[మార్చు]
  1. పాలకొల్లులో ప్రజానాట్యమండలి వారిచే గానకోకిల బిరుదు
  2. రాజోలు ఎస్.ఆర్.ఎల్.జి. కళాసమితి 1997, ఏప్రిల్ 19న హైదరాబాదులోని రవీంద్రభారతిలో రజతోత్సవ సభలో అప్పటి గజల్ గాయకుడు, ప్రభుత్వ అధికారి డి. మురళీకృష్ణ, ఐ.ఏ.ఎస్. చేతుల మీదుగా ఘన సన్మానం

మూలాలు

[మార్చు]

ఎండకుర్తి కామేశ్వరి, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట.30.