ఎండపల్లి భారతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎండపల్లి భారతి
డిడిగిలో జరిగిన కథా ఉత్సవంలో ఎండపల్లి భారతి
పుట్టిన తేదీ, స్థలం (1981-03-22) 1981 మార్చి 22 (వయసు 43)
విద్యఐదవ తరగతి వరకు
జీవిత భాగస్వామిఎండపల్లి శ్రీనివాసులు
సంతానంవిజయకుమారి
స్వరూప
సోమశేఖర్

ఎండపల్లి భారతి తెలుగు కథా రచయిత్రి, గ్రామీణ విలేఖరి, పత్రికా సంపాదకురాలు, లఘుచిత్ర దర్శకురాలు. వీరి కథలకు వీరికి గిడుగు రామ్మూర్తి పురస్కారం, డాక్టర్ వి చంద్రశేఖరరావు సాహితీ పురస్కారం, పుట్ల హేమలతా పురస్కారం అందాయి.[1]

బాల్యం, విద్య

[మార్చు]

భారతి 22 మార్చి 1981న నిమ్మనపల్లె లోని దిగువబురుజు గ్రామంలో పుట్టారు. ఐదవ తరగతి వరకు చదువుకుంది.

ఉద్యోగం

[మార్చు]

భారతికి నీళ్ళ ఆధారం లేని 20 కుంట్ల భూమి ఉంది. భారతి ఇంట్లో వంటా వార్పు చేసుకుంటూ, చేనులో పొలం పని, గొడ్లను, ఆవులను చూసుకోవటంతో పాటుగా కూలీపనికి కూడా వెళుతుంది.

స్వయంసహాయక బృందంలో

[మార్చు]

గత 23 సంవత్సరాలుగా భారతి స్వయంసహాయక బృందంలో పని చేస్తోంది. ఈమె చేత సెర్ప్ సంస్థ రాష్ట్ర స్థాయిలో అనేక కథనాలు రాయించారు. ఉభయ రాష్ట్రాల్లో మైక్రోఫైనాన్స్ పైన 500 కేస్ స్టడీలు, లక్షాధికారులయిన సంఘ మహిళలపైన, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపైన రైతులతో మాట్లాడి కేస్ స్టడీస్ చేయడం, కదిరిలో మహిళల ట్రాఫికింగ్ పైన 100 కేస్ స్టడీలు, పార్లమెంట్ సభ్యుల నిధుల ద్వారా చేపట్టిన కార్యక్రమాలపై కేస్ స్టడీలు, ప్రజ్వలిక ద్వారా చదివి మంచి స్థాయికి వచ్చిన విద్యార్థులకేస్ స్టడీలు, శ్రీకాకుళం లక్ష్మీపేటలో కుల ఘర్షణలపై రిపోర్ట్ మొ. కథనాలు భారతి చేసారు.

లఘు చిత్రాలు

[మార్చు]

భారతి సామాజిక, సాంఘిక సమస్యల పైన, సంఘ విజయాలపైన అనేక లఘు చిత్రాలు తీసింది. భారతి తన తోటి విలేకరి జయంతితో కలిసి వీడియో శిక్షణ తీసుకుంది. సంగం క్రియేషన్స్ పైన బానర్ రిజిస్టర్ చేసుకుని అనేక లఘుచిత్రాలు రూపొందించింది. సెజ్ (సత్యవేడు)పైన , క్షయవ్యాధి పైన ,మహిళల ట్రాఫికింగ్ పైన, ఇసుక లావాదేవీలపైన, నవోదయం పత్రిక పైన, సంఘంలోచేరిఅభివృద్ధి పొందిన మహిళల పైన అనేక లఘు చిత్రాలు నిర్మించింది. రాయి పలికిన రాగాలు సినిమాతీసి, దానికి సెన్సార్ సర్టిఫికెట్ కూడా తీసుకుంది. భారతి నెట్వర్క్ ఫర్ విమెన్ ఇన్ మీడియా సంస్థలో సభ్యులుగా చేరి జాతీయ స్థాయి మీటింగులకు హాజరయింది. కలకత్తా, బెంగళూరు, పూణే, మణిపూర్, కేరళ, అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, పాట్నా, చెన్నైలలో జరిగిన సమావేశాల్లో నవోదయం పత్రిక ప్రతినిధిగా పాల్గొంది.

సాహిత్యం

[మార్చు]

భారతి మదనపల్లి పరిసర ప్రాంత రాయలసీమ మాండలికంలో, చక్కని తెలుగు నుడులతో, ప్రత్యేకంగా తనకు చిరపరిచితమైన తన పల్లె భాషలో రచనలు చేస్తుంది. ఆమె కథల్లో పేద శ్రామిక మహిళల వెతలు, తమదైన సంస్కృతి, సామాజిక చింతన, పల్లెల రూపురేఖలు పటం ముఖ్య అంశాలుగా ఉంటాయి. ఆమె రచనలకు ఎన్నో ప్రశంసలు పురస్కారాలు అందాయి.

రచనలు

[మార్చు]
  1. ఎదారి బతుకులు (2016)[2](కథలు)
  2. బతుకీత[3] (కథలు)
  3. జాలారిపూలు (కథలు)
  4. జక్కీకు (నవల)[4][5]

గుర్తింపు

[మార్చు]
  1. గిడుగు రామ్మూర్తి పురస్కారం,చిత్తూరు 2018
  2. డాక్టర్ వి చంద్రశేఖర రావు సాహితీ పురస్కారం,గుంటూరు 2019
  3. పుట్ల హేమలత పురస్కారం,హైదరాబాద్ 2022[6]
  4. విమల శాంతి నారాయణ పురస్కారం,అనంతపురం 2022[7]
  5. వెంకటసుబ్బమ్మ స్మారక పురస్కారం,హైదరాబాద్ 2023
  6. హంస పురస్కారం 2023లో రాజమండ్రిలో[8]
  7. హెచ్ఆర్‌సె సాహిత్య పురస్కారం, ఖమ్మం, 2023
  8. మాడభూషి సాహిత్య పురస్కారం, చెన్నై, 2023
  9. దాసరి శిరీష జ్ఞాపిక 2023 జక్కీకు నవలకు వచ్చింది [9]

మూలాలు

[మార్చు]
  1. "సాహిత్యం, వాస్తవం రెండింటిలోనూ ఒకేలా జీవిస్తున్న మట్టిమనిషి". Sakshi. 9 October 2022. Retrieved 28 September 2023.
  2. "దళితస్త్రీ అస్తిత్వ సంవేదనలు ఎదారి బతుకులు". ప్రజాశక్తి (in ఇంగ్లీష్). 17 July 2023. Archived from the original on 28 సెప్టెంబరు 2023. Retrieved 28 September 2023.
  3. "బతుకీత: ఎండపల్లి భారతి – పుస్తకం.నెట్". pustakam.net. Retrieved 28 September 2023.
  4. "జక్కీకు – పుస్తకం.నెట్". pustakam.net. Retrieved 5 April 2024. {{cite web}}: |first1= missing |last1= (help)CS1 maint: multiple names: authors list (link)
  5. "ఆనంద తాండవమాడిరచిన జక్కీకు నవల – కొండవీటి సత్యవతి | స్త్రీవాద పత్రిక భూమిక". Retrieved 5 April 2024.
  6. పత్రిక, విహంగ మహిళా. "పుట్ల హేమలత స్మారక పురస్కారాలు 2022 ప్రదానం |". Retrieved 5 April 2024.
  7. "విమలాశాంతి కథా పురస్కారాలు-2022 – ప్రకటన | సంచిక - తెలుగు సాహిత్య వేదిక". 1 October 2022. Retrieved 5 April 2024.
  8. "వేడుకగా హంస పురస్కారాల ప్రదానం". Sakshi. 30 August 2023. Retrieved 5 April 2024.
  9. "కత రాస్తే నా కడుపులో ఆరాటం చల్లారుతుంది!". Retrieved 5 April 2024.