ఎం.మాలకొండయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం. మాలకొండయ్య, ఐపీఎస్‌
జననం1958 జులై 1
విద్యబిజినెస్‌ మేనేజ్‌మెంట్‌
విద్యాసంస్థఆంధ్రా విశ్వవిద్యాలయం
జీవిత భాగస్వామిపూనం మాలకొండయ్య

ఎం. మాలకొండయ్య 1985 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ఆయన 2017 డిసెంబరు 31 నుండి 2018 జూన్ 30 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ అఫ్ పోలీస్ (డీజీపీ) గా విధులు నిర్వహించాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

ఎం. మాలకొండయ్య 1961లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లాలో జన్మించాడు. ఆయన పాఠశాల విద్యను ప్రకాశం జిల్లాలోనే పూర్తిచేసి గుంటూరులో ఇంటర్మీడియట్, ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి క్రిమినాలజీలో డాక్టరేట్‌ పట్టా అందుకొని న్యాయశాస్త్రం, వ్యవసాయ విద్య పూర్తి చేసి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమో పూర్తి చేశాడు. ఆయన కొంతకాలం పాటు బ్యాంకు ఉద్యోగిగా పనిచేసి 1985 ఐపీఎస్ కు ఎంపికయ్యాడు.

వృత్తి జీవితం[మార్చు]

మాలకొండయ్య మొదట వరంగల్ జిల్లాలో ములుగులో అదనపు సూపరింటెండెంట్ (ఏఎస్పీ) గా వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన ఏపీఎస్పీ కమాండెంట్ గా, మెదక్, తూర్పుగోదావరి, ఆదిలాబాద్, గుంటూరు పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో ఏఎస్పీ, అదనపు ఎస్పీ, పోలీస్ సూపరింటెండెంట్ గా, విజిలెన్స్ ఎస్పీగా వివిధ హోదాల్లో పనిచేశాడు.

మాలకొండయ్య ఏసీబీ జాయింట్ డైరక్టర్‌గా, అదనపు డైరక్టర్‌గా, గుంటూరు, ఏలూరు రేంజ్, పోలీస్ ట్రైనింగ్ డీఐజీగా, పోలీస్ ట్రాన్స్ పోర్ట్ ఆర్గనైజేషన్ ఐజీగా, ఏసీబీ అదనపు డైరక్టర్‌గా, ట్రాన్స్‌కో సీఎండీగా, ఏపీ పోలీస్ నియామక మండలి ఛైర్మన్‌గా, ఏపీ పోలీస్ అకాడమీ డైరక్టర్‌గా, ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న సమయంలో అదనపు డీజీగా పదోన్నతి అందుకున్నాడు.[1]

మాలకొండయ్య ఏసీబీ డీజీగా పనిచేస్తున్న ఆయనను ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా (వీసీఎండీ) ప్రభుత్వం 2016 నవంబరు 14న నియమించింది.[2] మాలకొండయ్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ అఫ్ పోలీస్ (డీజీపీ) గా నియమిస్తూ 2017 డిసెంబరు 28న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నియమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ (రిఫామ్స్, అడ్మినిస్ట్రేటివ్‌) ఆర్డినెన్స్‌ నంబర్‌ 4–2017ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది.[3] ఆయన 2017 డిసెంబరు 31న డీజీపీగా బాధ్యతలు చేపట్టాడు.[4]

మూలాలు[మార్చు]

  1. Sakshi (20 July 2016). "ఐదుగురు అదనపు డీజీలకు పదోన్నతి". Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.
  2. Sakshi (14 November 2016). "ఆర్టీసీ వీసీఎండీగా ఎం.మాలకొండయ్య". Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.
  3. Samayam Telugu (27 December 2017). "ఏపీ డీజీపీగా మాలకొండయ్య.. రేపు ఉత్తర్వులు". Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.
  4. Deccan Chronicle (31 December 2017). "Dr M Malakondaiah is new Andhra Pradesh police cheif" (in ఇంగ్లీష్). Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.