మాలపాక యగ్నేశ్వర సత్యనారాయణ ప్రసాదు
Appearance
(ఎం.వై.ఎస్.ప్రసాద్ నుండి దారిమార్పు చెందింది)
మాలపాక యగ్నేశ్వర సత్యనారాయణ ప్రసాదు పద్మశ్రీ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్.సతీష్‌ధావన్ స్పేస్ సెంటరు షార్ డైరెక్టర్ .స్వగ్రామం పశ్చిమ గోదావరిజిల్లా మొగల్తూరు . అమ్మానాన్న మలపాక రామసూర్యనారాయణమూర్తి, భాస్కరమ్మ.నలుగురు అబ్బాయిలు,ఇద్దరు అమ్మాయిలు. నాన్న ఉపాధ్యాయుడు. పెద్ద కుటుంబం. భీమవరం గ్రామీణ మండలం వెంప లో కొంత వ్యవసాయ భూమి ఉండేది. పంటచేతికి వచ్చిన తర్వాత చదువులకు చేసిన అప్పులు తీర్చే వారు.చిన్నప్పుడే పాఠశాల స్థాయిలో రాకెట్ ప్రయోగం చేయాలని కలలు కన్నారు. అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో ఉద్యోగం పొందారు. గత 37 సంవత్సరాల్లో పలు అంతరిక్ష ప్రయోగాలల్లో విజయం సాధించి భారత కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయంగా నిలబెట్టారు. ఈ రంగంలో అగ్ర రాజ్యాలకు దీటుగా భారత్ నిలవడంలోనూ ఆయన కృషి అనన్యం.[1]
భావాలు అనుభవాలు
[మార్చు]- విద్యార్థులు గమనించాల్సింది ఒకటి ఉంది. ఎక్కడ ఏ పాఠశాలలో, కళాశాలలో ఎంత వెచ్చించి చదివామనేది ముఖ్యం కాదు. ఎంత నేర్చుకున్నామనేది బేరీజు వేసుకోవాలి. ఆసక్తి ఉన్న రంగంలోనే ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలి. పనిపై శ్రద్ధ, ప్రణాళికతో ప్రయత్నం చేస్తే అనుకున్న రంగంలో తప్పకుండా రాణించేందుకు అవకాశం ఉంటుంది.
- కల నీటి బుడగ. నిజం సముద్రం. ఈ రెండింటికీ ఎంతో తేడా ఉంది. నిజ జీవితంలో విజయాలు సాధించడానికి కలలు కనాలి. వాటిని సాధించేందుకు మాత్రం అలుపెరగని కృషి చేయాలి.
అవార్డులు
[మార్చు]- సైన్సులో కన్నడ రాజ్యోత్సవ అవార్డు,
- ఇస్రో మెరిట్ నాలుగుసార్లు అవార్డు,
- ఇస్రో టీమ్ ఎక్స్‌లెన్స్ అవార్డు,
- నాయుడమ్మ అవార్డు,
- కాకినాడ జేఎన్‌టీయూ నుంచి డాక్టరేట్
- 'పద్మశ్రీ