ఎం. కె. సుగంబాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ఎం. కె. సుగంబాబు తెలుగు రచయిత, జర్నలిస్టు[1]. అతను పలు చలన చిత్రాలకు దర్శకుడిగా, రచయితగా వ్యవహరించాడు. అతను 9 సంపుటాల కవిత్వాన్ని, 3 సంపుటాల ఇతర రచనలను చేసాడు. రెండు డాక్యుమెంటరీలకు దర్శకత్వం వహించాడు. అతను రాసిన గురజాడ జీవిత విశేషాలతో కూడిన "అస్తమించిన సూర్యుడు"[2] కు బంగారు నంది పురస్కారం లభించింది[3].

జీవిత విశేషాలు[మార్చు]

అతను గుంటూరు జిల్లా గుంటూరు పట్టణంలో 1944 ఏప్రిల్‌ 1 న సకినాబీబి, ఫరీద్‌ఖాన్ దంపతులకు జన్మించాడు. అతనికి తల్లితండ్రులు పెట్టిన పేరు మహబూబ్‌ ఖాన్‌ కాగా అదికాస్తా "సుగంబాబు" గా పేరు స్థిరపడింది[4]. అతను బి.ఏ (తెలుగు) చదివాడు. 1963 డిసెంబర్‌లో 'భారతి' మాసపత్రికలో 'మట్టీ బొమ్మ' కవిత ప్రచురణతో అతని రచనా వ్యాసంగం ఆరంభం అయింది. అప్పటినుండి వివిధ పత్రికల్లో, సంకలనాల్లో కవితలు, కథానికలు, సాహిత్య వ్యాసాలు రాసాడు. తెలుగు సాహిత్యంలో 'పైగంబర్‌ కవులు' గా సుప్రసిద్ధులైన ఐదుగురిలో ఒకరైన సుగంబాబు 2003లో తెలుగు సాహిత్యంలో 'రెక్కలు' అను నూతన కవితా ప్రక్రియను ప్రారంభించి ఐదుఎడిషన్లు వెలువరించాడు. తొలిసారిగా హిబ్రూ విశ్వవిద్యాలయం (ఇజ్రాయిల్‌) కు చెందిన ఆచార్య సుర్మన్‌ డేవిస్‌ ఆంగ్ల భాషలో 'వింగ్స్' పేరిట వాటిని అనువదించి వెలువరించినప్పటి నుండి తెలుగులోనే కాకుండా జాతీయ స్థాయిలో 'రెక్కలు' ప్రక్రియ పాఠకాదరణ పొంది, అది కన్నడం, హిందీ భాషా సాహిత్యంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అతను రాసిన గ్రంధాలలో 'సూరీడు' ఖ్యాతి తెచ్చిపెట్టింది.

రచనలు[మార్చు]

 • చరలో సెలయేరు (1968)
 • విప్లవం (1969)[5]
 • పైగంబర్‌ కవులు (1971)
 • సూరీడు (పాటల పుస్తకం, 1971)
 • లెనిన్‌...లెనిన్‌ (1984)[6]
 • రెక్కలు (2003)
 • కొత్తనీరు రెక్కలు[7]

"రెక్కలు" కవితా ప్రక్రియ[మార్చు]

ఈ ప్రక్రియ 20 వ దశకం నుండి ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిని సుగం బాబు రూపకల్పన చేశాడు[2]. ఈ ప్రక్రియలో

 1. అక్షరాల నియమం లేదు .
 2. ఆరు వరసలు ఉండాలి.
 3. మొదటి నాలుగు వరుసల్లో స్టేట్ మెంట్ చెప్పాలి . చివరి రెండు వరుసలూ పై స్టేట్ మెంట్ ని ఉన్నతీకరించి ఎగిరేటట్టు చేయాలి. అవే రెక్కలు అన్నమాట.
 4. తాత్విక విషయాలకు ప్రాధాన్యత నివ్వాలి.

ఉదాహరణ[మార్చు]

నిన్ను నీవు
ప్రశ్నించుకో
ఎదుటి వానిలో
దర్శించుకో !

ఆత్మజ్ఞానం
దైవ సమానం !

------పి. లక్ష్మణ్ రావ్

మూలాలు[మార్చు]

 1. "పుట:అక్షరశిల్పులు.pdf/151 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-02-04.
 2. 2.0 2.1 "Vivid and Vibrant - 8 by Rama Rao Vadapalli V.B." www.boloji.com. Retrieved 2020-02-04.
 3. "Kritya :: Poetry In Our Time". www.kritya.in. Retrieved 2020-02-04.
 4. "ELK Asia Pacific Journals – Special Issue" (PDF). Archived from the original (PDF) on 2018-06-02.
 5. Babu, M. K. Sugam (1970). Viplavaṃ.
 6. Babu, M. K. Sugam (1988). Lenin ... lenin: vacana kavita. For copies, M.K. Sugam Babu.
 7. "Green Book - 2 Kotha Neeru Rekkalu". www.logili.com (in ఆంగ్లం). Retrieved 2020-02-04.