ఎం. రామనాథం నాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం. రామనాథం నాయుడు
రామనాథం నాయుడు
జననంఎం. రామనాథం నాయుడు
01-06-1967
భారతదేశం మొగరాల
నివాస ప్రాంతంమైసూర్, కర్నాటక
వృత్తికవి,రచయిత,
సాహితీవేత్త, అచార్యుడు
పదవి పేరుప్రొఫెసర్(కర్ణాటక రాస్ట్ర సార్వత్రిక విశ్వ విద్యాలయం)
తండ్రిఎం. సీతారామయ్య నాయుడు
తల్లిఎం. మంగమ్మ
పురస్కారాలుకాళోజీ పురస్కారం, విశ్వకవి రవీంద్రుని పురస్కారం రాధాకృష్ణన్ పురస్కారం, శ్రీ శ్రీ పురస్కారం, కరుణశ్రీ పురస్కారం

ఎం . రామనాథం నాయుడు మొగరాల రామనాథం నాయుడు సాహిత్యకారుడు, రచయిత, సాహిత్య విశ్లేషకుడు, ఆచార్యుడు[1] .

బాల్యం - విద్యాభ్యాసం[మార్చు]

ఎం. ఏ., ఎం. ఫీల్., బి.ఇడి, పి హెచ్. డి.చేశారు. ఉన్నత విద్య, ప్రాథమిక విద్య రాయల్పాడు పాఠశాలలో కొనసాగింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, ముళబాగిలు (కర్నాటక) లొ డిగ్రీ చదివారు. బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగుళూరు.నుండి పి.జి. (తెలుగు) ఉత్తీర్ణులయ్యారు. "చిత్తూరు జిల్లాలోని జానపద ఐతిహ్యాల " పై పరిశోధన చేసి 1999 వ సంవత్సరం అప్పటి గవర్నర్ శ్రీమతి రమాదేవిగారి చేతుల మీదుగా పిహెచ్.డి. పట్టాను శ్రీ ఎం . రామనాథం నాయుడు అందుకున్నారు. పుంగనూరు తాలుకా జానపద ఐతిహ్యాలు-పరిశీలన అనే ఎం.ఫిల్. చేశారు తెలుగు ఆచార్యులుగా తెలుగు శాఖాధ్యక్షులుగా 28 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు.

కుటుంబం[మార్చు]

రామనాథం నాయుడు తల్లి ఎం. మంగమ్మ, తండ్రి ఎం. సీతారామయ్య నాయుడు, రామనాథం నాయుడు 01-06-1967లొ మొగరాలలో జన్మించారు.

తెలుగు శాఖ ఏర్పాటు[మార్చు]

కర్నాటక రాష్ట్రంలో రాచనగరిగా ఖ్యాతి గడించిన మైసూరు విశ్వవిద్యాలయంలో ఐసిసి & సిఇలో తెలుగు శాఖను 1994వ సంవత్సరంలో ప్రారంభించారు. అప్పుడు శ్రీ ఎం. రామనాథం నాయుడు తెలుగు విభాగానికి అధ్యాపకులుగా నియమితులయ్యారు. అప్పుడు బి.ఎ. / బి.కాం. తరగతులలో ' తెలుగు ' ఒక భాషగా వుండేది. తర్వాత కర్నాటక ప్రభుత్వం 1996 వ సంవత్సరం ఐసిసి & సిఇని మైసూరు విశ్వవిద్యాలయం నుంచి వేరు చేసి " కర్నాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం[2] "గా మార్చి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించింది. ఈ సార్వత్రిక విశ్వవిద్యాలయం " ఉన్నత విద్య అందరికీ అందుబాటు " అని ", ఇంటింటికీ ఉన్నత విద్య " అనే లక్ష్యంతో ఏర్పడింది. నాటి చిన్న సంస్థ నేడు బృహత్ విశ్వవిద్యాలయంగా రూపొంది, లక్షల మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తోంది. ఈ విశ్వవిద్యాలయం కర్నాటకలోనే కాక దేశంలోని ఇతర రాష్ట్రాలలోను, ఇతర దేశాలలోనూ వివిధ కోర్సుల్ని అందిస్తోంది. ఆన్లైన్ ద్వారా కూడా కోర్సుల్ని ప్రారంభించి దేశంలోనే అత్యుత్తమ స్థానాన్ని దక్కించుకుంది . బి.ఎ. / బి.కాం . తరగతులలో తెలుగును ఒక భాషగా తీసుకొని చదివే విద్యార్థులకు అవసరమైన, సులభమైన పాఠ్యాంశాల్ని పెట్టించి, వ్యావహారిక భాషలో సిద్ధ పాఠాల్ని తయారు చేయించి పాఠ్యాంశ సమన్వయకర్తగా, ప్రశ్నా పత్రాలు తయారీలో ఎంతో నియమ నిబద్ధతతో రామనాథం నాయుడు పనిచేశారు. శ్రీ ఎం . రామనాథం నాయుడు తెలుగు శాఖాధ్యక్షులుగా పనిచేస్తూ విశ్వవిద్యాలయం అధికారులతో ఎంతో నమ్మకంగా వుండి పరీక్షా విభాగంలోని చీఫ్, డిప్యూటీ చీఫ్, ఫ్లయింగ్ స్క్వాడ్, కస్టోడియన్, కోడింగ్ ఆఫీసర్, ట్యాబులేటర్, కోఆర్డినేటర్ వంటి ఎన్నో రహస్య కార్యాల్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. డా . ఎం రామనాథం నాయుడు ఎం.ఏ. తెలుగును ప్రారంభించాలని శతవిధాలా ప్రయత్నించారు. కాని ఫలితం దక్కలేదు. కర్నాటకలో తెలుగు ఎందుకని నిరుత్సాహపరిచారు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా విశ్వవిద్యాలయం అధికారులతో ఈ విషయం గురించి అవకాశం దొరికినప్పుడల్లా ప్రస్తావించేవారు. విశ్వవిద్యాలయం అధికారులు చెప్పిన పని కాదనకుండా విధేయతతో చేసుకుంటూ వెళ్ళేవారు. ఇటు తెలుగు విభాగం, అటు అడ్మినిస్ట్రేషన్ పనుల్ని అణుకువగా, సమర్థవంతంగా చేయడం గమనించిన అప్పటి కులపతి ' ఆచార్య వివేకరై గారు 2010లో ఎం.ఏ. తెలుగును ప్రారంభించడానికి అనుమతి ఇచ్చారు. 2014 సంవత్సరం తెలుగు ఎం.ఏ. మొదటి బ్యాచ్ ఉత్తీర్ణులయ్యారు. ఎం.ఎ. తెలుగులో మంచి మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రోత్సాహకంగా శ్రీ బండి ఆదినారాయణరెడ్డి గారు వి.వి.లో రెండు బంగారు పతకాల్నివారి పేరిట నెలకొల్పారు. 10-5-2014వ తేదీ వి.వి. ప్రాంగణంలో కర్నాటక గవర్నరు సమక్షంలో జరిగిన 14 వ స్నాతకోత్సవంలో తెలుగు విద్యార్థులు తమ పట్టాల్ని అందుకున్నారు. అక్కడే శ్రీ బండి ఆదినారాయణరెడ్డి గారి బంగారు పతకాల్ని కూడా గవర్నరు చేతులమీదుగా విద్యార్థులకు అందజేశారు.

పరిశోధనలు[మార్చు]

డా . ఎం . రామనాథంనాయుడుగారు తెలుగు భాషకు సంబంధించిన వివిధ విషయాలపై దాదాపు 50 పరిశోధనా వ్యాసాల్ని రాసి వివిధ పత్రికల్లో ప్రచురింపజేశారు.కర్నాటకలోని తెలుగు విద్యార్థులకు కర్నాటక ప్రభుత్వం ప్రచురించే తెలుగు పాఠ్యపుస్తకాల తయారీలో నాయుడుగారు తన వంతు కృషి చేశారు.వివిధ విశ్వవిద్యాలయాల ఎం.ఫిల్ మరియు పిహెచ్.డి. సిద్ధాంత గ్రంథాలను 170 కి పైగా పరిశీలించి, నివేదికలు పంపడం జరిగింది.దాదాపు 40 పరిశోధనా విద్యార్థులకు అధ్యక్షులుగా వుండి, మౌఖిక పరీక్షను నిర్వహించడం జరిగింది.జాతీయ, అంతర్జాతీయ (దాదాపు 160 ) సదస్సులలో పాల్గొని పరిశోధనాత్మక పత్రాలను సమర్పించడం జరిగింది.దాదాపు 60 పై చిలుకు కవి సమ్మేళనాలలో పాల్గోని యువ కవులకు తెలుగు కవిత్వం యొక్క విశిష్టతను కవితలను పఠించడం జరిగింది.దాదాపు 80 కవితలు కవితా సంకలనాలలో ప్రచురితం.దాదాపు 40 పాఠాలు రేడియో కార్యక్రమాలకు రికార్డు చేయడం జరిగింది.బి.ఎ / బి.కాం/ బి.ఎన్.సి / బి.బి.ఎ/ బి.సి.ఎ తెచు భాష మరియు ఎం.ఎ. విద్యార్థులకు ఉత్తమ బోధనా పాఠాలను రచించడం జరిగింది.

ప్రపంచ తెలుగు మహాసభలు[మార్చు]

2010 వ సం॥లో తిరుపతి మహా నగరంలో జరిగిన నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొని చిత్తూరు జిల్లాలోని ‘ రాజనాల బండ ' అనే విషయంపై ప్రసంగించారు. అలాగే ప్రపంచ తెలుగు సభల ప్రత్యేక సంచికలో నాయుడుగారు రాసిన “ రాయలసీమలోని ఐతిహ్యాలు ' అనే వ్యాసం ప్రచురింపబడింది.ప్రాచ్య వస్తు పరిశోధనా సంస్థ, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి మరియు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో 7-1-2014 వ తేదీ నుండి 11-1-2014 వ తేదీ వరకు నిర్వహించిన మహాభారతం పై అంతర్రాష్ట్రీయ సమ్మేళనంలో పాల్గొని ' భారతంలో కర్ణుడు ' అనే విషయంపై ప్రసంగించారు. అలాగే ఆనాటి ఒక సదస్సుకు అధ్యక్షులుగా బాధ్యత నిర్వహించారు. (ఎన్సైక్లోపీడియా ఆఫ్ సౌత్ ఇండియన్ ఫాల్క్లోర్ ) ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం వారు ప్రచురించిన ఈ విజ్ఞాన కోశంలో నాయుడుగారు రాసిన 5 పరిశోధనా వ్యాసాలు ప్రచురింపబడ్డాయి . ఇదే విజ్ఞాన కోశాన్ని హంపి విశ్వవిద్యాలయం వారు కన్నడంలో తర్జుమా చేశారు.డా . ఎం . రామనాథం నాయుడు తాను పనిచేస్తున్న విశ్వవిద్యాలయంలో తెలుగువారి కోసం 3 జాతీయ సదస్సుల్ని, 2 వర్క్ షాపులను నిర్వహించారు. రెగ్యులర్ ఎం.ఎ. విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు లేకపోయినా తెలుగు భాష కోసం ఒక్కడే నిలబడి, వి.వి.లోని అధికారుల సన్నిహిత సంబంధాలతో, ఎంతో శ్రమకోర్చి తెలుగులోనే జాతీయ సదస్సుల్ని నిర్వహించాలనే పట్టుదలతో 3 సదస్సుల్ని విజయవంతంగా నిర్వహించారు.వి.వి. తెలుగు శాఖ, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం వారి సహాయ సహకారాలతో సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలపై మైసూరులోని వి.వి. ఆవరణంలో 20-9-2010 న జాతీయ సదస్సును నిర్వహించారు . ఈ సదస్సుకు అప్పటి సార్వత్రిక వి.వి. కులపతి ఆచార్య రంగప్ప అధ్యక్షత వహించగా, అప్పటి ద్రావిడ వి.వి. కులపతి ఆచార్య సి . రమణయ్య [3] సదస్సు ప్రారంభకులుగా విచ్చేశారు. ముఖ్య అతిథిగా సేవా భారత్ ట్రస్టు అధినేత శ్రీ బండి ఆదినారాయణ రెడ్డి విచ్చేసి, తెలుగు విద్యార్థులు ఎం. ఏ.లో అధిక మార్కులు సాధిస్తే, అలాంటి వారికి బంగారు పతకాల్ని అందజేయడానికి లక్ష రూపాయలు విరాళంగా ఇస్తానని వాగ్దానం చేశారు. తన వాగ్ధానాన్ని నిలబెట్టుకున్నారు. ఇందులో కీలకోపన్యాసం ఆచార్య ఆర్వీయస్ సుందరం ఇచ్చారు. డా . ఎం . రామనాథం నాయుడు గారు తన విభాగం తరపున 1-3-2013 వ తేదీన సర్వజ్ఞు'లపై మైసూరులోని వి.వి. ఆవరణలో తెలుగు, కన్నడ విద్యార్థులతో కలసి జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు వి.వి. కులపతి ఆచార్య ఎం.జి. కృష్ణన్ అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా తెలుగువారైన శ్రీ గురజాల రవీంద్రనాథరెడ్డి, కమీషనరు, ఇన్కంటాక్స్, మైసూరు వారు విచ్చేశారు. కీలకోపన్యాసాన్ని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి ఇచ్చారు. వేటూరి ప్రభాకరశాస్త్రి వాజ్మయపీఠం, తిరుమల, తిరుపతి దేవస్థానం సహకారంతో సార్వత్రిక వి.వి. తెలుగు శాఖ అధ్యక్షులైన రామనాథం నాయుడు " వేటూరి ప్రభాకరశాస్త్రిగారిపై వి.వి. ఆవరణంలో 28.2.2013 వ తేదీన జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు వి.వి. కులపతి ఆచార్య ఎం.జి. కృష్ణన్ అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా తెలుగు ప్రముఖులైన శ్రీ సి.ఎన్ . రెడ్డి హాజరయ్యారు. కీలకోపన్యాసం ఆచార్య వేటూరి ఆనందమూర్తి ఇచ్చారు.

పురస్కారాలు[మార్చు]

డా ॥ ఎం . రామనాథం నాయుడు కర్ణాటక రాష్ట్రంలో తెలుగు భాషకు చేస్తున్న కృషిని గుర్తించి, హరిత అసోసియేషన్ పాలమూరు మరియు వేద సంస్కృతి పరిషత్, హైదరాబాద్ వారు 10.12.2013వ తేదీనాడు మహబూబ్నగర్లో ఆ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రసిద్ధ శాసన పరిశోధకులు, గ్రంథ రచయిత, మూసీ పత్రిక సంస్థాపకుడైన " శ్రీ బి.ఎస్ . శాస్త్రి స్మారక ఆత్మీయ పురస్కారాన్ని అందజేశారు. డా . ఎం . రామనాథం నాయుడు ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన, పడమటి పాళేలలో గొప్పదైన పుంగనూరు ప్రాంతంపై విశేష పరిశోధనలు చేసి " పులినాడు పుంగనూరు ఐతిహ్యాలు " అనే పుస్తకాన్ని ప్రచురించినందులకు తెలుగు భాషా పరిరక్షణ సమితి, పుంగనూరు, చిత్తూరు జిల్లా నారు " తెలుగు వాజ్మయ ప్రగతి రత్నం " అనే పురస్కారంతో రామనాథం నాయుడి దంపతుల్ని ఘనంగా సత్కరించారు. బెంగుళూరు తెలుగుతేజం ప్రధాన సంపాదకులు అయిన బొగ్గవరపు మాల్యాద్రి రామనాథం నాయుడుకు తెలుగుతేజం నాల్గవ వార్షికోత్సవం సభలో " తెలుగుతేజం ఆత్మీయ సత్కారాన్ని అందించారు.వివిధ పుస్తక సంకలనాలలోనూ, సావనీర్ లోనూ, పత్రికలలోనూ, 70 వ్యాసాలు ప్రచురితం చేశారు.

పదవులు[మార్చు]

సార్వత్రిక విశ్వవిద్యాలయం తమ విద్యార్థులకు ఉపయోగకరంగా రాష్ట్రంలోని తాలూకా కేంద్రాలలో అధ్యయన కేంద్రాలు, ముఖ్య నగరాల్లో ప్రాదేశిక కేంద్రాల్ని స్థాపించింది. అందులో ధారవాడ ప్రాదేశిక కేంద్రం ఒకటి. దానికి మొదటి ప్రాదేశిక నిర్దేశకుడుగా డా. ఎం. రామనాథం నాయుడి దక్షతకు ప్రతిఫలంగా ఆయనను నియమించింది. నాయుడు గారు తన ప్రాదేశిక కేంద్రం పరిధిలో వున్న 30 అధ్యయన కేంద్రాల సంయోజనాధికారులతో అన్యోన్యంగా కలిసి మెలసి అధ్యయన కేంద్రాలకు, విశ్వవిద్యాలయానికి వారధిగా నిలిచారు.ప్రాదేశిక కేంద్రంలోనే వివిధ కోర్సులకు సంబంధించిన ప్రవేశాలు, సిద్దపాఠాల వితరణ మొదలైన మహత్తరమైన విశ్వవిద్యాలయం నిర్ణయాలతో నాయుడుగారు ఏకీభవించి, శ్రమించి ప్రవేశాల్ని బెంగుళూరు ప్రాదేశిక కేంద్రంతో పోటీ పడేటట్టుగా గణనీయంగా పెంచుకొచ్చారు.ధారవాడ నగరంలో అప్పటి వి.వి. కులపతి ఆచార్య కె. సుధారావు గారి అధ్యక్షతన ఒక సభను ఏర్పాటు చేసి, ఆ సభకు ముఖ్యఅతిథులుగా సీనియర్ జర్నలిస్ట్, స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ పాటీల పుట్టప్పగారిని, చెన్నవీరకణవిని ఆహ్వానించారు. ఆ సభ ఎంతో విజయవంతమైంది. కులపతి, అతిథులు, విద్యార్థులు నాయుడుగారిని ఎంతో మెచ్చుకున్నారు. వి.వి. కులపతి ఆచార్య కె. సుధారావుగారు నాయుడు గారిని సన్మానించారు.1. కర్నాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం, మైసూరు. 2. మైసూరు విశ్వ విద్యాలయం, మైసూరు. 3. తుమకూరు విశ్వవిద్యాలయం, తుమకూరు.4. మహారాణి క్లస్టర్ విశ్వవిద్యాలయం, బెంగుళూరు.తెలుగు పాఠ్య ప్రణాళిక అధ్యక్షులుగా, తెలుగు పరీక్షామండళి అధ్యక్షులుగా వ్యవహరించారు.

ప్రసంగాలు[మార్చు]

ఆకాశవాణి, బెంగుళూరు కేంద్రం నుండి అనేక తెలుగు పాఠాలను అనేక ఫోన్ - ఇన్ కార్యక్రమం ద్వారా రామనాథం నాయుడు ప్రసంగించారు. సార్వత్రిక విశ్వవిద్యాలయం, మైసూరులోని జ్ఞానవాణి స్టూడియో ద్వారా రామనాథం నాయుడు తెలుగు పాఠాల్ని రికార్డు చేయించి, తెలుగు విద్యార్థుల కోసం వేళాపట్టి ప్రకారం రేడియో ద్వారా ప్రసారం చేయించారు.ఇది తెలుగువారికి విశ్వవిద్యాలయంలో లభించిన అరుదైన గౌరవం. వి.వి.లో ఎంతో మంది సీనియర్ ఆచార్యులు వున్నాడా. ఎం. రామనాథం నాయుడి ప్రవర్తన, దక్షత, పెద్దలపై వున్న గౌరవం లాంటి ఉత్తమ గుణాల్ని గుర్తించిన అప్పటి వి.వి. కులపతి ఆచార్య కె. సుధారావు ఆయనను అధ్యయన కేంద్రాల విభాగానికి డిప్యూటీ రిజిస్ట్రార్గా నియమించారు. ఈ విభాగం కింద 21 ప్రాదేశిక కేంద్రాలు, 130 అధ్యయన కేంద్రాలు వుండేవి. అంతేకాక భారతదేశంలో 80 భాగస్వామ్య సంస్థలు వాటికింద 3000 అధ్యయన కేంద్రాలు వుండేవి. వాటన్నింటినీ నిర్వహించగల బరువైన బాధ్యతను నాయుడుగారికి అప్పగించారు. వాటిని ఎంతో సమర్థవంతంగా ఉత్సాహంగా, ఎవరినీ విసిగించక, ఆయన విసుగు పడక ఓపికతో ఆరు సంవత్సరాల పాటు సేవల్ని అందించారు.

గ్రంధాలు[మార్చు]

 • పులినాడు పుంగనూరు ఐతిహ్యాలు.
 • చిత్తూరు జిల్లా ఐతిహ్యాలు.
 • రా. నా. వ్యాస సంకలనం.
 • చిత్తూరు జిల్లా జానపద వ్యాసాలు.
 • సాహితీ మందారం.
 • సాహితీ సౌరభం.
 • సాహితీ మకరందం.
 • కవితాధారలు.
 • అమ్మమనసు అనంతం.

పురస్కారాలు[మార్చు]

 • శ్రీ బి.ఎన్ . శాస్త్ర స్మారక ఆత్మీయ పురస్కారం.
 • తెలుగు ప్రగతి రత్రం పురస్కారం.
 • తెలుగు రత్రా జాతీయ పురస్కారం.
 • ఉగాది పురస్కారం.
 • కరుణశ్రీ పురస్కారం.
 • శ్రీ శ్రీ పురస్కారం.
 • కాళోజీ పురస్కారం
 • విశ్వకవి రవీంద్రుని పురస్కారం
 • రాధాకృష్ణన్ పురస్కారం
 • జాన భారతి పురస్కారం వంటివి 20 దాకా పొందారు.

మూలాలు[మార్చు]

 1. రామనాథం నాయుడు, ఎం. https://ksoumysuru.ac.in (PDF) https://ksoumysuru.ac.in/profile/resumes/Dr%20Ramanatham%20naidu.pdf. {{cite web}}: External link in |website= (help); Missing or empty |title= (help)
 2. https://web.archive.org/web/20191231012108/http://www.ksoudistanceeducation.in/Governance.html. Archived from the original on 2019-12-31. Retrieved 2022-04-05. {{cite web}}: Missing or empty |title= (help)
 3. (PDF) https://www.dravidianuniversity.ac.in/Downloads/seminars_2017/Prof_RVS_Sundaram_contribution_to_classical_literature_folklore_and_translation_studies.pdf. {{cite web}}: Missing or empty |title= (help)