ఎక్సైజ్ సుంకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఏదేని దేశంలో తయారైన వస్తువులు వినిగోగదారులను చేరడాన్కి ముందు ఉత్పత్తి దశలో కాని, ఉత్పత్తి పూర్తయిన తర్వాత దశలో కాని చెల్లించవలసిన పన్నులే ఎక్సైజ్ సుంకం (Excise Duty). భారత రాజ్యాంగం ప్రకారము మత్తును కల్గించే వస్తువులను మినహాయించి మిగితా అన్ని వస్తువల పై ఎక్సైజ్ సుంకాలను విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఆర్థిక కమీషన్ సిపార్సులను అనుసరించి ఎక్సైజ్ సుంకాలలో కొంతభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయిస్తారు.

ఎక్సైజ్ సుంకాలను విధించే పద్ధతులు రెండు విధాలుగా ఉంది.మొదటి పద్ధతి ప్రకారం వస్తువుల విలువను బట్టి విధిసారు. వస్తువుల విలువలో కొంత శాతంగా నిర్ణయించి విధించబడుతుంది. రెండో పద్ధతి ప్రకారం విలువతో సంబంధం లేకుండా నిర్దుష్టమైన పన్ను విధిసస్తారు. వస్తువుల విలువను బట్టి పన్ను విధిస్తే పన్ను ఎగవేత ఆస్కారం ఉంది కనుక నిర్దిష్ట మొత్తం పన్ను అభిలషణీయమని ఆర్థిక వేత్తల అభిప్రాయం. కాని ఇందులోనూ లోపాలున్నాయి. ధరలు పెర్గినా, ఉత్పత్తి పెర్గినా ప్రభుత్వానికి ఆదాయం పెర్గదు. కాబట్టి తరచుగా మార్పులు చేయవలసి ఉంటుంది.