ఎగువ మానేరు డ్యామ్
ఎగువ మానేరు డ్యామ్ | |
---|---|
అధికార నామం | ఎగువ మానేరు డ్యామ్ Upper Manair Dam |
ప్రదేశం | రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ, భారతదేశం |
అక్షాంశ,రేఖాంశాలు | 18°16′13″N 78°32′40″E / 18.27028°N 78.54444°E |
నిర్మాణం ప్రారంభం | 1945 (నిజాంచే నిర్మించబడింది) |
ప్రారంభ తేదీ | 1948 |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
నిర్మించిన జలవనరు | మానేరు నది, కుద్లైరు నది |
Height | 31 మీటర్లు (102 అడుగులు) నది ఉపరితలం నుండి |
పొడవు | 9,201 మీటర్లు (30,187 అడుగులు) |
జలాశయం | |
సృష్టించేది | ఎగువ మానేరు జలాశయం |
మొత్తం సామర్థ్యం | 62,387,000 మీ3 (50,578 acre⋅ft) |
క్రియాశీల సామర్థ్యం | 61,439,000 మీ3 (49,809 acre⋅ft)[1] |
ఉపరితల వైశాల్యం | 15.3 కి.మీ2 (5.9 చ. మై.) |
ఎగువ మానేరు డ్యామ్ తెలంగాణ రాష్ట్రం లోని రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట్ మండలం నర్మల గ్రామంలో మానేరు నదిపై (1945-48) నిర్మించబడిన జలాశయం.[2] ఇది 1,62,000 హెక్టార్లకు సాగు నీటిని అందించడమేకాకుండా, మత్స్య పరిశ్రమకు, త్రాగునీటి సరఫరా వంటి ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
నిర్మాణం - ప్రదేశం
[మార్చు]1945లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కూడవెళ్లి, పల్వంచ వాగులపై నర్మాల వద్ద ఎగువ మానేరు ప్రాజెక్టును నిర్మించాడు, 1948లో పనులు పూర్తయ్యాయి.[3] నిజాం గెస్ట్‌హౌజ్ నిర్మించి, ఉద్యానవనం కూడా ఏర్పాటు చేశాడు. ఈ డ్యామ్ సిరిసిల్లా రాజన్న జిల్లాలో మానేరు నదిపై 18°16' అక్షంశ, 79°32' రేఖాంశాల మధ్య ఉంది. మానేరు నది గోదావరి నదికి ఉపనది.
లక్షణాలు
[మార్చు]ఇది తాపీపని భూమి డ్యాం. దీని ఎత్తు నది ఉపరితలం నుండి 31 2మీటర్లు (102 అడుగులు) ఉండగా, డ్యామ్ పొడవు 9,201 మీటర్లు (30,187 అడుగులు) ఉంది.
ఇతర వివరాలు
[మార్చు]2016, సెప్టెంబర్ 26న రెండేళ్ల విరామ అనంతరం 31 అడుగుల ఎత్తున్న ప్రాజెక్టు మూడు రోజుల్లోనే పూర్తిస్థాయిలో నిండి పొంగిపోర్లుతుండడంతో పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రాజెక్టును తిలకించారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "India: National Register of Large Dams 2012" (PDF). Central Water Commission. Archived from the original (PDF) on 20 ఆగస్టు 2014. Retrieved 4 July 2018.
- ↑ నమస్తే తెలంగాణ, నిపుణ విద్యా వార్తలు (26 April 2016). "తెలంగాణ నీటిపారుదల సౌకర్యాలు". Retrieved 4 July 2018.[permanent dead link]
- ↑ సాక్షి, తెలంగాణ (11 June 2018). "ఎగువ మానేరు ఎడారేనా..?". Retrieved 4 July 2018.
- ↑ ఆంధ్రభూమి, కరీంనగర్ (27 September 2016). "ఎగువ మానేరు జలాశయానికి జనజాతర". Archived from the original on 4 July 2018. Retrieved 4 July 2018.