ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని 1962 లో దేశవ్యాప్తంగా అమలుపరిచారు

ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఆంగ్లం: Model Code of Conduct) మొదటి సారిగా 1960లో కేరళ శాసనసభ ఎన్నికల్లో మొదలు పెట్టి, ఆ తర్వాత 1962 నుంచి లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. 1979 అక్టోబరులో అధికార పార్టీలను కూడా ‘నియంత్రణ’ పరిధిలోకి తీసుకువస్తూ భారత ఎన్నికల సంఘం ఎంసీసీలో మార్పులు చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రధానంగా ఎనిమిది అంశాలతో ముడిపడి ఉంటుంది. వాటిల్లో.. పార్టీలు, నేతలు, అభ్యర్థులు చేసే ప్రసంగాలు, సభలు-సమావేశాలు, ఊరేగింపులు-ర్యాలీలు, పోలింగ్‌ రోజున ఆంక్షలు, పోలింగ్‌ బూతుల్లో ఆంక్షలు, పర్యవేక్షకుల నియామకం, అధికారంలో ఉన్న పార్టీకి నిబంధనలు, ఎన్నికల మేనిఫెస్టోలపై నిఘా ఉంటాయి. భారత ఎన్నికల కమిషన్‌ ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) ప్రకారం, ఈ క్రింది ఎనిమిది అంశాలపై ఎన్నికల మేనిఫెస్టోలపై నిఘా ఉంటుంది.

  • 1. కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ప్రచారంలో అధికార యంత్రాంగాన్ని ఉపయోగించకూడదు.
  • 2. అధికార పార్టీలు కొత్త పథకాలు, ప్రాజెక్టులు, విధానాలను ప్రకటించకూడదు.
  • 3. ప్రభుత్వ ఖర్చులతో పత్రికలు, మీడియా, ఇతర మాధ్యమాల్లో ప్రకటనలపై నిషేధం ఉంటుంది.
  • 4. మంత్రులు, నామినేటెడ్‌ పదవుల్లో ఉన్నవారు అధికారిక కార్యక్రమాల పేరుతో ప్రచారాన్ని చేయకూడదు. ప్రభుత్వ వాహనాలను వినియోగించకూడదు.
  • 5. బహిరంగ సభల నిర్వహణకు మైదానాలు, హెలిప్యాడ్‌ల వినియోగంలో అధికార పార్టీతోపాటు.. అనుమతుల విషయంలో అన్ని పార్టీలకు ఒకే నిబంధన వర్తిస్తుంది.
  • 6. ప్రభుత్వాలు ఎలాంటి తాత్కాలిక (అడ్‌హాక్‌) నియామకాలు చేయకూడదు.
  • 7. ఎన్నికల ప్రచారానికి వేదికలుగా దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనామందిరాలను ఉపయోగించకూడదు.
  • 8. ఎన్నికలకు 48 గంటల ముందు ఎలాంటి ప్రచారాలు చేయకూడదు.

ఇవీ చదవండి[మార్చు]

మూలాలు[మార్చు]

https://www.andhrajyothy.com/artical?SID=735845[permanent dead link]