ఓటు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి.
మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. పోలింగ్ రోజున ప్రభుత్వం సెలవు ఇస్తుంది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించడానికి ఓటు ఉపయోగపడును. డబ్బుకు, మధ్యానికి ఓటు అమ్ముకోకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి.
గుర్తింపు పత్రాలు[మార్చు]
- ఎన్నికల సంఘం జారీచేసిన ఓటరు గుర్తింపు కార్డు,
- భారత విదేశాంగ శాఖ జారీ చేసిన పాస్ పోర్టు,
- డ్రైవింగ్ లైసెన్స్,
- పాన్ కార్డు,
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, స్థానిక సంస్థలు, ఇతర రంగాల్లో పని చేస్తున్న వారు సంబంధిత సంస్థచే జారీచేసిన గుర్తింపు కార్డు,
- బ్యాంకు, కిసాన్, పోస్టాఫీస్ పాసుబుక్కులు,
- విద్యార్థుల విషయంలో గుర్తింపు పొందిన విద్యాసంస్థలు జారీచేసే గుర్తింపు కార్డులు,
- పట్టాదారు పాసు పుస్తకాలు,
- రిజిస్టర్డ్ డీడ్ లాంటి ఆస్తి సంబంధ పత్రాలు,
- రేషన్ కార్డు,
- ఎస్సీ, ఎస్టీ, బి.సి.లకు సంబంధిత అధికార సంస్థలు జారీచేసే పత్రాలు,
- పెన్షన్ మంజూరు పత్రాలు,
- రైల్వే గుర్తింపు కార్డు,
- స్వాతంత్రం పోరాట యోధుల గుర్తింపు కార్డు,
- ఆయుధ లైసెన్స్‌లు,
- వికలాంగుల పత్రాలు.
ప్రవాస భారతీయులకు(ఎన్నారైలకు) ఓటు హక్కు[మార్చు]
ప్రపంచవ్యాప్తంగా 2.2 కోట్ల మందికి పైగా ఎన్నారైలు ఉన్నట్లు అంచనా.ఎన్నారైలకు ఓటు హక్కు కల్పిస్తూ త్వరలోనే ఒక చట్టం తెస్తారు. ఎన్నికల సమయంలో వారు భారత్‌ను సందర్శించాల్సి ఉంటుంది.ఇతర దేశాల పౌరసత్వం పొందిన వారికి మాత్రం ఓటు హక్కు కల్పించరు.