ఎన్నికల కమిషన్

వికీపీడియా నుండి
(ఎన్నికల సంఘం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఎన్నికల కమిషన్, ఎన్నికల నిర్వహణా వ్యవహారాలను సమీక్షించే వ్యవస్థే ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ వివిధ దేశాలలో వివిధ నామాలతో వ్యవస్థీకరించబడింది. 'కేంద్ర ఎన్నికల కమిషన్', 'ఎన్నికల శాఖ', ఎన్నికల కోర్ట్' వంటి పేర్లు చలామణిలో ఉన్నాయి.నిర్దేశించబడిన నియమావళిని అనుసరించి భౌగోళికమైన హద్దులని ఏర్పాటు చేయుట, వాటిలో ఎన్నికలు సజావుగా, క్రమ పద్ధతిలో జరిగేలా చూచుట కమిషన్ ప్రధాన విధులు.సమాఖ్య వ్యవస్థలలో, సభ్యులు విడిగా ఎవరికీ వారే కమిషన్లు ఏర్పాటు చేసుకునే సౌలభ్యం కూడా చాలా దేశాలలో వాడుకలో ఉంది.

కమిషన్‌లో రకాలు

[మార్చు]

స్వతంత్ర వ్యవస్థ

[మార్చు]

ఈ వ్యవస్థలో కమిషన్ కి స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. కమిషన్ పద్దులని స్వయంగా నిర్వహించుకునే అధికారం కలిగి ఉంటుంది. కొన్ని దేశాలలో కమిషన్ ఇటువంటి వ్యవస్థ కలిగిఉండటానికి రాజ్యాంగబద్ధత కూడా ఉంది. ఈ రకం వ్యవస్థ ఆస్ట్రేలియా, కెనడా, పోలాండ్, ఇండియా, ఇండోనేషియా, నైజీరియా, పాకిస్తాన్, రోమానియా, దక్షణ ఆఫ్రికా, శ్రీలంక, థాయిలాండ్, యూకే లలో వాడుకలో ఉంది.

శాఖా వ్యవస్థ

[మార్చు]

ఈ రకం వ్యవస్థలలో కమిషన్ ని 'ఎన్నికల శాఖ' గా వ్యవహరిస్తారు. ఇందులో కమిషన్ ప్రభుత్వ శాఖగా రాజ్యాంగం చేత గుర్తింపబడుతుంది. ప్రభుత్వాధికారులు కానీ, శాసన సభ్యులు కానీ కార్యనిర్వాహక సభ్యులుగా కొనసాగుతారు. ఈ వ్యవస్థ బొలివియా, కోస్టారికా, పనామా, నికరగ్వా, వెనిజులాలో వాడుకలో ఉంది. 

కార్యనిర్వాహక వ్యవస్థ

[మార్చు]

ఈ వ్యవస్థలో కమిషన్ ప్రభుత్వ శాఖలలో  ఒక కార్యనిర్వాహక శాఖగా కాబినెట్ మంత్రి పర్యవేక్షణలో నిర్వహింపబడుతుంది.డెన్మార్క్, సింగపూర్, స్వీడన్, స్విట్జర్లాండ్, ట్యునీషియాలలో ఈ రకం కమిషన్ ని గమనించవచ్చు

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]