ఎన్.జి.ఓ. (నాటకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆచార్య ఆత్రేయ 1948 లో ఈ నాటకం రచించారు. అప్పుడే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి మధ్యతరగతి పరిస్థితులను చక్కగా ఈ నాటకంలో ప్రతిబింబింప చేసారు ఆత్రేయగారు. ఇంకా చెప్పాలంటే Hungry 30's లోని పరిస్థితులను మనం ఇందులో చూడవచ్చు. ఆత్రేయ గారి మాటల్లో "ఎన్.జి.ఓ అనే పేరేగాని, మన మధ్యతరగతి కుటుంబాల - అందులో పట్నవాసుల అగచాట్లు, మనస్తత్వం, ప్రెస్టేజి పేరుతో పడుతూన్న ఆర్థిక సాంఘిక బాధలు చిత్రించటానికి ప్రయత్నించాను. ఏమాత్రం సఫలుణ్ణి కాగలిగానో ప్రజా బాహుళ్యమే నిర్ణయించాలి". ఆత్రేయ గారు! మీరు సఫలం ఏంటి...ఈ నాటకంతో ట్రెండ్సెట్టర్ అయ్యారు. కావాలంటే 1950 నుంచి మొన్న మొన్నటి దాక వచ్చిన సాంఘిక సినిమాలు చుస్తే అర్ధమైపోతుంది. మధ్యతరగతి మీద వచ్చిన ప్రతీ సినిమాలో ఎన్.జి.ఓ మార్కు స్పష్టంగా కనబడుతుంది.

పాత్రలు[మార్చు]

  • రంగనాథం - గుమాస్తా
  • గోపి - అతని తమ్ముడు (విప్లవ భావాలు కలవాడు)
  • ముసలాయన - అతని తండ్రి
  • గుప్త - అద్దెకొంప యజమాని

నాటిక కథాంశం[మార్చు]

స్థూలంగా ఈ నాటకం చెప్పాలంటే, మన కథానాయకుడైన రంగనాథం ఒక గుమస్తా. మధ్యతరగతి జీవి. అతని మాటల్లోనే చెప్పాలంటే ఇంటి ముందున్న గుడిసెలను చూసి వారి కన్నా తన స్థాయి బాగుందని తృప్తి పడలేదు. అలాగే పక్కనున్న కోటీశ్వరుడి బంగ్లా చూసి అసూయ పడకుండా ఉండలేడు. లేని పోని భేషజాలకు పోయి అనవసరమైన కష్టాలు కొని తెచ్చుకుంటారు వీరు. ఇక గోపి రంగనాథం తమ్ముడు. విప్లవ భావాలు కలిగినవాడు. చిన్న వయసులోనే జీవితం పట్ల విరక్తి కలిగినవాడు. రంగనాథం ఇంట్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక రోగం తో బాధపడుతూఉంటారు. ఇన్ని కష్టాలు ఉన్నా ఎప్పుడూ లంచం తీసుకోడు రంగనాథం. చివరికి ఒకానొక పరిస్థితిలో అతనికి డబ్బులు అత్యవసరం అయినప్పుడు లంచం తీసుకుంటాడు. అప్పుడే గోపి ఒక బహిరంగ సభలో ఒక రాజకీయ నాయకుడు ఉపన్యాసం ఇస్తుంటే, అతన్ని నిలదీస్తాడు. చివరికి వీరిద్దరి పరిస్థితి ఏమయిందనేది నాటకం చదివితే తెలుస్తుంది.