Jump to content

ఎపిస్టాక్సిస్

వికీపీడియా నుండి
ఎపిస్టాక్సిస్
ఇతర పేర్లురక్తం కారుతున్న ముక్కు , ముక్కు రక్త స్రావం , ముక్కు హేమరేజ్
ముక్కులో రక్తస్రావంతో మూడు ఏళ్ల పిల్లవాడు
ఉచ్చారణ
ప్రత్యేకతఓటోరినోలారిన్జాలజీ
లక్షణాలుముక్కు నుండి రక్తం కారడం
సాధారణ ప్రారంభంపదేళ్ల లోపు , 50 సంవత్సరాల పైన
ప్రమాద కారకములుగాయం, రక్తాన్ని పలుచన చేసేవి, అధిక రక్తపోటు, మద్యపానం, కాలానుగుణ అలెర్జీలు, పొడి వాతావరణం
రోగనిర్ధారణ పద్ధతిప్రత్యక్షంగా పరీక్షించడం
భేదాత్మక రోగనిర్థారణ పద్ధతిహెమోప్టిసిస్ఊ లేదా పిరితిత్తుల నుండి రక్తస్రావం, ఎసోఫాగియల్ వేరిస్
నివారణపెట్రోలియం జెల్లీ వాడడం
చికిత్సముక్కు ముందు భాగంలో ఒత్తిడి, నాసల్ ప్యాకింగ్, ఎండోస్కోపీ
ఔషధంట్రానెక్సామిక్ యాసిడ్
తరుచుదనము60% ఎదో ఒక సమయం లో
మరణాలుఅరుదు

ఎపిస్టాక్సిస్ అంటే ముక్కు నుండి రక్తస్రావం జరిగే శరీర పరిస్థితి. దీనిని ముక్కు నుండి రక్త స్రావం లేదా రక్తం కారడం అని కూడా పిలుస్తారు[1]. రక్తం కడుపులోకి కూడా ప్రవహించి వికారం, వాంతులకు కారణమవుతుంది[2]. మరింత తీవ్రమైన సందర్భాల్లో రెండు నాసికా రంధ్రాల నుండి రక్తం రావచ్చు[3]. అరుదుగా రక్తస్రావం చాలా ఎక్కువగా ఉండవచ్చు, రక్తపోటు తగ్గవచ్చు[1]. అరుదుగా రక్తం నాసోలాక్రిమల్ వాహిక పైకి వచ్చి కంటి నుండి బయటకు వస్తుంది[4].

సమస్యలు

[మార్చు]

ముక్కులో వేలు దూర్చడం వలన ఏర్పడిన గాయం, రక్తం పలుచబడటం, అధిక రక్తపోటు, మద్యపానం, కాలానుగుణంగా వస్తుండే అలెర్జీలు, పొడి వాతావరణం, కార్టికోస్టెరాయిడ్లను పీల్చడం వంటివి ప్రమాద కారకాలు. ఈ ముక్కు రక్తస్రావంలో రెండు రకాలు ఉన్నాయి - అవి పూర్వ రక్తస్రావం, పృష్ఠ రక్తస్రావం, ఇది అరుదుగా సంభవిస్తుంది కానీ మరింత తీవ్రమైనది[5]. పూర్వ ముక్కు రక్తస్రావం సాధారణంగా కీసెల్బాచ్ ప్లెక్సస్ (నాసికా రంధ్రాలను వేరుచేసే విభాజకం (సెప్టం)కు సరఫరా చేసే ముక్కులోని నాలుగు లేదా ఐదు ధమనుల నెట్‌వర్క్ - ప్లెక్సస్) నుండి సంభవిస్తుంది, అయితే పృష్ఠ రక్తస్రావం తరచుగా స్ఫెనోపాలటైన్ ధమని నుండి సంభవిస్తుంది[5]. రోగ నిర్ధారణ సాధారణంగా ప్రత్యక్ష పరిశీలన ద్వారా జరుగుతుంది [1].

నివారణ, చికిత్స

[మార్చు]

ఈ సమస్యకు నివారణగా ముక్కులో పెట్రోలియం జెల్లీని వాడుతారు[6]. ప్రారంభంలో చికిత్సగా సాధారణంగా ముక్కు ముందు భాగంలో కనీసం ఐదు నిమిషాలు ఒత్తిడి చేయడం ఉంటుంది. ఇది సరిపోకపోతే నాసికా ప్యాకింగ్ ఉపయోగించవచ్చు[7]. ట్రానెక్సామిక్ ఆమ్లం కూడా సహాయపడవచ్చు [8]. రక్తస్రావం కొనసాగితే ఎండోస్కోపీ సిఫార్సు చేస్తారు[7].

వ్యాప్తి

[మార్చు]

దాదాపు 60% మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ముక్కు నుండి రక్తస్రావం సమస్యకి గురిఅవుతారు. సుమారు 10% మందిలో ముక్కు నుండి రక్తం రావడం అనే సమస్య తీవ్రంగా ఉంటుంది[9]. ముక్కు కారడం అనేది ప్రాణాంతకం అవడం అరుదు. 1999లో అమెరికాలో జరిగిన 24 లక్షల మరణాలలో ఈ సమస్యతో మరణించిన వారు నాలుగు మంది.[10] ముక్కు నుండి రక్తం కారడం అనేది సాధారణంగా 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిని, 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిని ప్రభావితం చేస్తుంది[11].

సూచనలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Ferri, Fred F. (2013). Ferri's Clinical Advisor 2014 E-Book: 5 Books in 1 (in ఇంగ్లీష్). Elsevier Health Sciences. p. 399. ISBN 978-0-323-08431-4. Archived from the original on 2021-08-28. Retrieved 2020-04-13.
  2. Wilson, I. Dodd (1990). Walker, H. Kenneth; Hall, W. Dallas; Hurst, J. Willis (eds.). Clinical Methods: The History, Physical, and Laboratory Examinations (3rd ed.). Boston: Butterworths. ISBN 978-0409900774. PMID 21250251. Archived from the original on 2019-12-15. Retrieved 2018-01-29.
  3. Krulewitz, NA; Fix, ML (February 2019). "Epistaxis". Emergency Medicine Clinics of North America. 37 (1): 29–39. doi:10.1016/j.emc.2018.09.005. PMID 30454778.
  4. Riordan-Eva, Paul (2000). Vaughan and Asbury's General Ophthalmology (in ఇంగ్లీష్). McGraw Hill Professional. p. 92. ISBN 978-0-07-137831-4.
  5. 5.0 5.1 (January 2020). "Epistaxis (Nose Bleed)".
  6. Morgan, Daniel J.; Kellerman, Rick (March 2014). "Epistaxis". Primary Care: Clinics in Office Practice. 41 (1): 63–73. doi:10.1016/j.pop.2013.10.007. ISSN 0095-4543. PMID 24439881.
  7. 7.0 7.1 Tunkel, David E.; Anne, Samantha; Payne, Spencer C.; Ishman, Stacey L.; Rosenfeld, Richard M.; Abramson, Peter J.; Alikhaani, Jacqueline D.; Benoit, Margo McKenna; Bercovitz, Rachel S.; Brown, Michael D.; Chernobilsky, Boris; Feldstein, David A.; Hackell, Jesse M.; Holbrook, Eric H.; Holdsworth, Sarah M.; Lin, Kenneth W.; Lind, Meredith Merz; Poetker, David M.; Riley, Charles A.; Schneider, John S.; Seidman, Michael D.; Vadlamudi, Venu; Valdez, Tulio A.; Nnacheta, Lorraine C.; Monjur, Taskin M. (7 January 2020). "Clinical Practice Guideline: Nosebleed (Epistaxis) Executive Summary". Otolaryngology–Head and Neck Surgery. 162 (1): 8–25. doi:10.1177/0194599819889955. PMID 31910122.
  8. Joseph, Jonathan; Martinez-Devesa, Pablo; Bellorini, Jenny; Burton, Martin J (2018-12-31). Cochrane ENT Group (ed.). "Tranexamic acid for patients with nasal haemorrhage (epistaxis)". Cochrane Database of Systematic Reviews (in ఇంగ్లీష్). 12: CD004328. doi:10.1002/14651858.CD004328.pub3. PMC 6517002. PMID 30596479.
  9. Wackym, James B. Snow,... P. Ashley (2009). Ballenger's otorhinolaryngology : head and neck surgery (17th ed.). Shelton, Conn.: People's Medical Pub. House/B C Decker. p. 551. ISBN 9781550093377.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link)
  10. "Work Table I. Deaths from each cause by 5-year age groups, race and sex: US, 1999" (PDF). CDC. 2011. p. 1922. Archived (PDF) from the original on 14 October 2021. Retrieved 13 April 2020.
  11. Kucik, Corry J.; Clenney, Timothy (2005-01-15). "Management of epistaxis". American Family Physician. 71 (2): 305–311. ISSN 0002-838X. PMID 15686301.