Jump to content

ఎమైనో ఆమ్లాలు

వికీపీడియా నుండి
అమినీ ఆమ్ల నిర్మాణం

ఎమైనో ఆమ్లాలు (amino acids) జీవరసాయన శాస్త్రంలో చాల ముఖ్యమైనవి. వీటిని తెలుగులో నవామ్లాలు అంటారు.

ఈ పేరు వెనక చరిత్ర

[మార్చు]

మిగిలిన ఆమ్లాలతో పోలిస్తే ఇవి కొత్త జాతి పదార్థాలు. కనుక ఈ జాతికి కూడా ఒక ఇంగ్లీషులో ఒక కొత్త పేరు పెట్టవలసిన అవసరం వచ్చింది. ఈ కొత్త జాతి అణుపుంజములన్నింటిలో కొన్ని ఉమ్మడి లక్షణాలు కనబడ్డాయి. వీటన్నిటికి ఒక చివర -NH2 సమూహం, మరొక చివర -COOH సమూహం ఉండటం ఈ ఉమ్మడి లక్షణం. -NH2 ని ఇంగ్లీషులో ఎమైన్‌ గ్రూపు (amine group) అంటారు. ఈ ఎమైన్‌ (amine) అనే విశేషణం (adjective) అమ్మోనియా (ammonia) అనే నామవాచకం (noun) నుండి వచ్చింది. ఇక రెండవ పక్క ఉన్న -COOH ని ఇంగ్లీషులో కార్బాక్సిల్‌ గ్రూపు (carboxyl group) అంటారు. ఈ కార్బాక్సిల్‌ గుంపు ఉన్న పదార్థాలన్నీ ఆమ్ల లక్షణాలు కలిగి ఉంటాయి. కనుక వీటి పేర్ల చివర 'ఆమ్లం' అని వస్తే బాగుంటుంది. మాట మొదట్లో ఎమైన్‌-, చివర -ఏసిడ్‌. వెరసి ఎమైనో ఏసిడ్‌.

ప్రాణ్యాల కట్టడికి ఇటికలు

[మార్చు]

శరీరంలో ఉన్న కణజాలం (tissue) కట్టడికి ప్రాణ్యాలు ముఖ్యం. కణజాలాన్ని ఒక కట్టడం లా ఊహించుకుంటే ఆ కట్టడానికి కావలసిన ఇటికలే నవామ్లాలు. ఈ నవామ్లాలనే ఇటికలు ఒకటి కాదు, రెండు కాదు, ఇరవై రకాలు కనుక వీటితో ఎన్నో రకాల ఆకారాల్లో, ఎన్నో రకాల లక్షణాలతో ప్రాణ్యాలని కట్టడి చెయ్యవచ్చు. అందుకనే పట్టు పురుగు చేసే పట్టు లక్షణాలు వేరు, నెత్తి మీద పెరిగే జుత్తు లక్షణాలు వేరు. రక్తానికి ఎరుపు రంగు ఇచ్చే ప్రాణ్యం లక్షణం ఒకటయితే గోళ్ళకి గట్టితనాన్నిచ్చే ప్రాణ్యం మరొకటి. నవామ్లాలని రకరకాల వరసల్లో అమర్చటం వల్ల సాధ్యపడే రకరకాల ఆకారాలే ఈ లక్షణాల వైవిధ్యతకి కారణం.

నవామ్లాల లక్షణాల పట్టిక

[మార్చు]
అమినో ఆమ్లం 3-అక్షరాల పేరు 1-అక్షరం పేరు పక్క గొలుసు ధ్రువత్వం పక్క గొలుసు యొక్క ఆమ్లత్వం లేక క్షారత్వం Hydropathy index[1]
అలనీన్ Ala A ధ్రువత్వం లేదు (nonpolar) మధ్యస్థం (neutral) 1.8
ఆర్జినీన్ Arg R ధ్రువత్వం ఉంది (polar) క్షారత్వం (strongly basic) -4.5
ఆస్పర్టీన్‌ Asn N ధ్రువత్వం ఉంది (polar) మధ్యస్థం (neutral) -3.5
ఆస్పార్టిక్ ఆమ్లం Asp D ధ్రువత్వం ఉంది (polar) ఆమ్లత్వం (acidic) -3.5
సిస్టైన్ Cys C ధ్రువత్వం ఉంది (polar) మధ్యస్థం (neutral) 2.5
గ్లుటామిక్ ఆమ్లం Glu E ధ్రువత్వం ఉంది (polar) ఆమ్లత్వం (acidic) -3.5
గ్లుటమీన్ Gln Q ధ్రువత్వం ఉంది (polar) మధ్యస్థం (neutral) -3.5
గ్లయిసీన్ Gly G ధ్రువత్వం లేదు (nonpolar) మధ్యస్థం (neutral) -0.4
హిస్టిడీన్ His H ధ్రువత్వం ఉంది (polar) క్షారత్వం (కొద్దిగా) -3.2
ఐసోలూసీన్ Ile I ధ్రువత్వం లేదు (nonpolar) మధ్యస్థం (neutral) 4.5
లూసీన్ Leu L ధ్రువత్వం లేదు (nonpolar) మధ్యస్థం (neutral) 3.8
లైసీన్ Lys K ధ్రువత్వం ఉంది (polar) క్షారత్వం (basic) -3.9
మిథియొనీన్ Met M ధ్రువత్వం లేదు (nonpolar) మధ్యస్థం (neutral) 1.9
ఫినైన్ అలనీన్ Phe F ధ్రువత్వం లేదు (nonpolar) మధ్యస్థం (neutral) 2.8
ప్రొలీన్ Pro P ధ్రువత్వం లేదు (nonpolar) మధ్యస్థం (neutral) -1.6
సెరీన్ Ser S ధ్రువత్వం ఉంది (polar) మధ్యస్థం (neutral) -0.8
థ్రియోనీన్ Thr T ధ్రువత్వం ఉంది (polar) మధ్యస్థం (neutral) -0.7
ట్రిప్టోఫాన్ Trp W ధ్రువత్వం లేదు (nonpolar) మధ్యస్థం (neutral) -0.9
టైరోజీన్ Tyr Y ధ్రువత్వం లేదు (nonpolar) మధ్యస్థం (neutral) -1.3
వేలీన్ Val V ధ్రువత్వం లేదు (nonpolar) మధ్యస్థం (neutral) 4.2

మూలాలు

[మార్చు]
  1. Kyte J & RF Doolittle (1982). "A simple method for displaying the hydropathic character of a protein". J. Mol. Biol. (157): 105–132. PMID 7108955.