ఎమ్మర్సన్ మంగాగ్వా
స్వరూపం
జింబాబ్వే అధ్యక్షుడిగా ఎమ్మర్సన్ మంగాగ్వా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు[1]. 2023 ఆగస్టు 26వ తేదీన వెల్లడైన ఫలితాల్లో ఎమ్మర్సన్ మంగాగ్వా రెండోసారి విజయం సాధించారు[2]. అధికార పార్టీ జాను - పీ ఎఫ్ అవకతవకులకు పాల్పడిందని ఆరోపణలు వెల్లువెత్తిన ప్రజలు రెండోసారి కూడా అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించారు. ఎమ్మర్సన్ మంగాగ్వా తన సమీప ప్రత్యర్థి నెల్సన్ చామిసా పై విజయాన్ని నమోదు చేశారు. 1980 సంవత్సరంలో బ్రిటన్ నుంచి జింబాబ్వే దేశం స్వాతంత్రం పొందిన తరువాత తొలిసారి ఎమ్మర్సన్ మంగాగ్వా హయాంలో జాను - పీ ఎఫ్ పార్టీ బలపతమైంది[3]. అంతేకాకుండా ఎమ్మర్సన్ మంగాగ్వా తొలిసారి పూర్తి కాలం పదవిలో ఉన్న జింబాబ్వే అధ్యక్షుడిగా గుర్తింపు పొందారు. గత రెండు దశాబ్దాలకు పైగా జింబాబ్వే దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నది, నిరుద్యోగం పెరిగిపోయింది.
మూలాలు :
- ↑ telugu, NT News (2023-08-27). "Zimbabwe President | జింబాబ్వే అధ్యక్షుడిగా రెండోసారీ ఎమ్మర్సన్ నంగాగ్వా ఎన్నిక". www.ntnews.com. Retrieved 2023-10-30.
- ↑ "జింబాబ్వే అధ్యక్షుడిగా రెండో సారి ఎమర్సన్ నంగాగ్వా". Samayam Telugu. Retrieved 2023-10-30.
- ↑ "జింబాబ్వే అధ్యక్షుడుగా రెండోసారి నంగాగ్వా ఎన్నిక". Nijam Today. 2023-08-28. Retrieved 2023-10-30.