Jump to content

ఎర్ర పూలు (కథాసంకలనం)

వికీపీడియా నుండి

ఎర్రపూలు, తెలుగు కథా సంకలనం, శాంతి సాహితి, ఏలూరు ప్రచురణ, 1950, డిసంబరు. ఇంగ్లీషు కథలను తెలుగులో అనువాదం చేసినవారు: అడబాల వీరాస్వామి రాజా. ఇందులో 1. మక్సింగ్ గోర్కీ దొడ్డ దొర, కిషన్ చందర్ కథలు 1.చనిపోయిన సైనికునికి సందేశం, 2.కరువునధికంచేయండి, 3.ఎర్రపూలు ఎప్పుడూ వికసిస్తాయి, 4.స్పెయిన్ బాలుని ప్రతిజ్ఞాచిహ్నం. గోర్కీ దొడ్డ దొర కథలో వ్యంగ్య ధోరణిలో అమెరికా సామ్రాజ్యవాదాన్ని, డాలర్ల ఆధిపత్యం ముసుగుని పటాపంచలు చేసి నిజస్వరూపాన్ని బహిర్గతం చేస్తాడు. అమెరికా ప్రజాస్వామ్యం అసలు స్వరూపాన్ని, రాజులను, రారాజులను తలదన్నే పెట్టుబడిదారుల, సైతానుల పరోక్ష ప్రమేయాన్ని బయటపెడతాడు. ఈ కథలో రచయిత వ్యంగ్య వైభవాన్ని ఆశ్రయించాడు. 2.కొరియా యుద్ధంలో అసువులు బాసిన అమెరికా సైనికుడు తనదేశ యువకులను ఉద్ధేశించి రాసిన ఉత్తరంలో ఈ నిరర్థకమైన యుద్ధంలో, అమెరికా పెట్టుబడిదారుల లాభాపేక్ష కోసం జరిగే యుద్ధంలో పాల్గొనవద్దని సందేశం ఇచ్చాడు. 3. భారత దేశానికి కొత్తగా స్వతంత్రం వచ్చిన రోజులు. పాలకవర్గం అసమర్ధత వలన, ఆహార సమస్యను పట్టించుకోక, ముందు చూపు లేని కారణంగా లక్షలమంది ఆహారం దొరకక చనిపోతారు. రచయిత వ్యంగ్యంగా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడతాడు. 4.ఎర్రపూలు కరుణరసాత్మకమైన కథ. అనాథ అంధబాలుడు మధురంగా పాడుతూ వీధుల్లో విప్లవగీతాల పుస్తకాలు అమ్ముతుంటాడు. శ్రామికులు, ఫ్యాక్టరీ కార్మికులు అతని పాటల పుస్తకాలు కొని పాడుకొంటారు. కర్మాగారంలో సమ్మె జరుగుతుంది. యాజమాన్యం మొండితనం వల్ల సమ్మె వైఫల్యం చెంది ఒక్కొక్కరు సమ్మె విరమణ చేస్తున్న సమయంలో అంధబాలకుడు ఫ్యాక్టరీ గుమ్మం వద్ద గుమిగూడిన కార్మికులవద్ద అద్భుతంగా విప్లవ గీతాలు ఆలపించడంతో శ్రామికులు నూతనోత్సాహంతో సమ్మె కొనసాగిస్తారు. 5. 1936 నాటి స్పెయిన్ విప్లవం, సైన్యం అణచివేత నేపధ్యంలో ఇరవై ఏళ్ల బాలుడు మిలటరీ ఆఘాయీత్యాలకు అన్యాయంగా బలౌతాడు. ప్రజలకు గుణపాఠం కలగాలని మిలటరీ అతణ్ణి బహిరంగంగా, సజీవంగా ఖననం చేసి, అతని ఎత్తిన పిడికిలిని మాత్రం బయటికి ఉంచుతారు. ఆ ఎత్తిన పిడికిలి ప్రజలకు స్ఫూర్తినిచ్చింది. కథలన్నీ ఆనాటి ప్రపంచ పరిస్థితులను ప్రదర్శించి, ప్రజలు కార్యాచరణకు పూనుకునేందుకు స్ఫూర్తి నిస్తాయి.

మూలాలు: ఎర్రపూలు, తెలుగు కథా సంకలనం, శాంతి సాహితి, ఏలూరు ప్రచురణ, 1950, డిసంబరు. ఇంగ్లీషు కథలను తెలుగులో అనువాదం చేసినవారు: అడబాల వీరాస్వామి రాజా