ఎలక్ట్రో టైపింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Portrait of Moritz Jacobi (1801-1874), who invented electrotyping in 1838.
Line drawing.
Schematic apparatus for electrotyping. An electrical current flows from the battery, through the copper anode, the electrolyte, and the coated mold. A copper film (the electrotype) grows onto the electrically conducting coating of the mold.

విద్యుద్విశ్లేషణ పద్ధతిలో అక్షరాలు చెక్కి ఉన్న దిమ్మె నుండి ఒక ప్రతిని తయారు చేయటాన్ని ఎలక్ట్రో టైపింగ్ అంటారు. ఈ పద్ధతిని మోరిట్జ్ వాన్ జకోబి అనే రష్యా దేశస్తుడు సా.శ. 1838 లో కనుగొన్నాడు. ఈ విధానం కనుగొన్న వెంటనే ముద్రణా విధానం కొరకు, అసలు ప్రతికి నకలు తయారీకీ వాడబడుచున్నది. ఈ విధానమును అక్రమాకారముగా ఉన్న వివిధ వస్తువుల, విగ్రహాల నకలు తయారీకి వాడతారు.

విధానము

[మార్చు]

చెక్క దిమ్మె నుండి పటం, బొమ్మ లేదా అక్షరాల మైనపు అచ్చుని తయారుచేస్తారు. ఈ మైనపు అచ్చుకు గ్రాఫైట్ లేదా సీసం అద్ది, వాహకంలా తయారు చేస్తారు. ఇపుడు దీనిని వోల్టామీటరులో కాథోడుగా ఉపయోగించి, కావలసిన లోహంతో పూత పూస్తారు. ఇలా పూతపూసిన తర్వాత, మైనాన్ని కరిగించి నకలు ఉన్న గాగి లోహాన్ని దృఢంగా చేస్తారు. ఇలా తయారైన గుల్లతో అలాంటి మరెన్నో ప్రతులని తయారు చేయవచ్చు.