ఎలిజబెత్ మిచెల్
ఎలిజబెత్ మిచెల్ | |
---|---|
జననం | ఎలిజబెత్ జోవన్నా రాబర్ట్‌సన్ 1970 మార్చి 27[1][2] లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా, అమెరికా |
విద్యాసంస్థ | స్టీఫెన్స్ కాలేజ్ (బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1992–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | క్రిస్ సోల్డెవిల్లా
(m. 2004; div. 2013) |
పిల్లలు | 1 |
ఎలిజబెత్ జోవన్నా రాబర్ట్‌సన్ (జననం 1970 మార్చి 27) అమెరికన్ నటి. ఆమె అమెరికన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ మిస్టరీ డ్రామా సిరీస్ లాస్ట్ (2006–2010)లో జూలియట్ బర్క్‌గా ప్రధాన పాత్రను పోషించి ప్రసిద్ధి చెందింది. దీని కోసం ఆమె ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డు ప్రతిపాదనను అందుకుంది.[3] ఆమె టెలివిజన్ సిరీస్ వి (2009–2010), రివల్యూషన్ (2012–2014), డెడ్ ఆఫ్ సమ్మర్ (2016), ది శాంటా క్లాజెస్ (2022–ప్రస్తుతం)లో కూడా ప్రధాన పాత్రలు పోషించింది. ఆమె టెలివిజన్ ధారావాహిక ఈఆర్ (2000–2001), వన్స్ అపాన్ ఎ టైమ్ (2014), ది ఎక్స్‌పాన్స్ (2018, 2021), ఔటర్ బ్యాంక్స్ (2021–ప్రస్తుతం)లలో పునరావృత పాత్రలు చేసింది.
ఆమె గియా (1998), ఫ్రీక్వెన్సీ (2000), నర్స్ బెట్టీ (2000), ది శాంటా క్లాజ్ 2 (2002), ది శాంటా క్లాజ్ 3: ది ఎస్కేప్ క్లాజ్ (2006), రన్నింగ్ స్కేర్డ్ (2006), ఆన్సర్స్ టు నథింగ్ (2011), ది పర్జ్: ఎలక్షన్ ఇయర్ (2016), క్వీన్ బీస్ (2021) వంటి అనేక చిత్రాలలో కూడా నటించింది.
ప్రారంభ జీవితం
[మార్చు]కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో ఆమె జన్మించింది. ఆమె తల్లి జోసెఫ్ మిచెల్ తో కలసి 1970లో డల్లాస్‌కు మారారు. ఆమె తల్లి 1975లో వివాహం చేసుకుంది.[4] ఆమె సవతి తండ్రి జోసెఫ్ డే మిచెల్, తల్లి జోసెఫిన్ మరియన్ మిచెల్ (నీ జెంకిన్స్) డల్లాస్‌లో న్యాయవాదులు.
ఎలిజబెత్ మిచెల్ బుకర్ టి. వాషింగ్టన్ హై స్కూల్ ఫర్ ది పెర్ఫార్మింగ్ అండ్ విజువల్ ఆర్ట్స్, పబ్లిక్ మాగ్నెట్ స్కూల్ నుండి పట్టభద్రురాయింది. ఆమె ముగ్గురు సోదరీమణులలో పెద్ద, ఇతరులు క్రిస్టినా హెలెన్ క్రిస్టీ మిచెల్, కేథరిన్ డే కేట్ మిచెల్.[5]
నటనలో ఆమె స్టీఫెన్స్ కాలేజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌తో పట్టభద్రురాలైంది, ఆపై బ్రిటిష్ అమెరికన్ డ్రామా అకాడమీలో చదువుకుంది.[6]
వ్యక్తిగత జీవితం
[మార్చు]2000లో ది లిండా మాక్‌కార్ట్‌నీ స్టోరీని చిత్రీకరిస్తున్నప్పుడు, ఆమె సహనటుడు గ్యారీ బేక్‌వెల్ తో డేటింగ్ ప్రారంభించింది. తరువాత నిశ్చితార్థం చేసుకున్నారు, అయితే ఆ సంబంధం 2002లో ముగిసింది.[7]
ఆమె 2004లో ఇంప్రూవైషన్ నటుడు క్రిస్ సోల్‌డెవిల్లాను వివాహం చేసుకుంది. వాషింగ్టన్‌లోని బైన్‌బ్రిడ్జ్ ఐలాండ్‌లో నివసిస్తున్న వీరికి 2005లో ఒక కుమారుడు జన్మించాడు.[8]
మూలాలు
[మార్చు]- ↑ "Book Elizabeth Mitchell | Speakers Bureau | Booking Agent Info". Speakers Bureau. Archived from the original on November 9, 2021. Retrieved June 23, 2022.
- ↑ "Elizabeth Mitchell Agent | Speaker Fee | Booking Contact". NOPACTalent. Archived from the original on November 9, 2021. Retrieved June 23, 2022.
- ↑ Ausiello, Michael (May 19, 2009). "'Lost' scoop: Juliet mystery (sort of) solved". Entertainment Weekly. Archived from the original on December 22, 2021. Retrieved December 6, 2019.
- ↑ Texas Department of State Health Services. Texas Marriage Index, 1966–2002. Texas Department of State Health Services, Texas.
- ↑ "Elizabeth Mitchell - Biographical Summaries of Notable People - MyHeritage". MyHeritage.com. Retrieved December 24, 2016.
- ↑ "Southern Beauty Magazine " Elizabeth Mitchell". www.sobeautymag.com. Archived from the original on December 22, 2010. Retrieved November 20, 2010.
- ↑ "Europe Intelligence Wire – Interview with Gary Bakewell". Elizabeth Mitchell Fan Club. Archived from the original on May 26, 2012. Retrieved August 7, 2016.
- ↑ Rizzo, Monica (February 18, 2008). "Lost's Mystery Woman Elizabeth Mitchell". People. Retrieved December 6, 2019.