Jump to content

ఎలుకల నివారణ

వికీపీడియా నుండి

ఎలుకల వలన రైతులు అధిక మొత్తంలో తమ పంటను నష్ట పోతున్నారు. దేశ వ్యాప్తంగా వీటి వలన కలిగే పంట/ ధాన్య నష్టము అధిక మొత్తంలో వుండి జాతీయ సంపదకు కూడా నష్టం కలుగుతున్నది. రైతులు ఎవరికి వారు ఎలుకల నివారణకు తమ వంతు కృషి చేస్తున్నారు. ప్రభుత్వము కూడా తమ వంతు సహకారా న్నందిస్తున్నది. ఎలుకలు పంట పొలాలలోనే కాకుండా, ధాన్యాన్ని నిలువ వుంచిన గోదాములలో చేరి విపరీత నష్టాన్ని కలిగిస్తున్నాయి. వాటి నివారణకు అనేక మార్గాలున్నాయి. ఎవరికి అనుకూలమైన పద్ధతిని వారు అవలంబించి ఎలుకల నివారణకు తోడ్పడవచ్చు.

ఊదరబెట్టడం

[మార్చు]

వరి పంటలో గింజలు ముదిరాక రైతులు ఎలుకల బాధ ఎదుర్కొంటున్నారు. ఎలుకలు గట్లలో బొరియలు చేసుకొని రాత్రి వేళల్లో వరి కంకులను కొరికి తమ బొరియల్లో దాచుకుంటాయి. వీటి వలన రైతుకు చాల పంట నష్టం. ఎలుకలను చంపడానికి ఈ రోజుల్లో ప్రభుత్యం ఉచ్చులను, విషపు బిళ్లలను సరపరా చేస్తున్నది. ఇంకా కొన్ని నివారణ మార్గాలను ప్రచారం చేస్తున్నది. కాని ఆ రోజుల్లో "ఇర్ల వాళ్ళు" ఎలుకలను పట్టడానికి పలుగు, పార, చిన్న గునపం తీసుకొని పొలాల వెంబడి సతీ సమేతంగా తిరుగుతూ ఎలుక బొరియ కనబడితే అందులోకి పొగ పెట్టి త్రవ్వి ఎలుకలను పట్టి, అవి ఆ బొరియల్లో దాచి పెట్టిన వరి కంకులను చేజిక్కించుకునే వారు. పొగ పెట్టడాన్ని "ఊదర పెట్టడం" అంటారు. ఒక చిన్న మట్టి కుండకు కింది వైపున చిన్నని రంధ్రం చేస్తారు. ఆ కుండలో పిడకలు కొన్ని వేసి నిప్పుపెట్టి దాని నిండుకు కొంత గడ్డిని, పచ్చి ఆకులను వేసి కుండ మూతిని ఎలుక బొరియకు బోర్లించి చుట్టు మట్టి కప్పి వెనక వున్న రంధ్రంద్వారు గాలిని ఊదుతారు. అప్పుడు దట్టమైన పొగ ఎలుకల బొరియలంతా వ్వాపిస్తుంది. ఊపిరాడని ఎలుకలు ఎక్కడో ఒక చోట బయటకు వస్తాయి . అప్పుడు వాటిని పట్టుకుంటారు. కొన్ని ఊపిరాడక లోపలే చని పోతాయి. ఆ బొరియలను త్రవ్వి చనిపోయిన ఎలుకలను పట్టు కుంటారు. ఆ రోజుకి వారి కుటుంబానికి కావలసిన తిండి గింజలు, కూరలోకి ఎలుకల మాంసం దొరుకు తుంది. ఇప్పటికి వీరు ఎలుకలను మెట్ట పైర్లలో, ఇతరత్రా ఎలుకలు, పిట్టలను పడుతున్నారు. ఈ ఇర్ల వాళ్ళు ఒక జాతి ప్రజలు. వారి వృత్తి కేవళం తేనె తీయడం, ఎలుకలను పట్టడం, చిన్న చిన్న అడవి జంతువులను, పిట్టలను వేటాడ్డం. వీరు పల్లెలకు దూరంగా అడవులకు దగ్గరగా నివసిస్తుంటారు.

ఎలుకల మందును, జొన్న/సజ్జ పిండితో కలిపి, ఒక ప్లాస్టిక్ కవరులో వుంచి, దానిని చెట్టు మీద పెడతారు. ఎలుకలు, ఈ మిశ్రమాన్ని తిని చనిపోతాయి. అయితే, వానాకాలంలో ఈ విషపు ఎర అంతగా ప్రభావం చూపదు. innovative trap. వేయించిన వేరుశనగ పప్పు పొడి, నువ్వులు, ధనియాలు, ఎలుకలమందు మిశ్రమాన్ని బట్టతో ఒక చిన్న మూట కట్టి, చెట్టుపై వుంచుతారు. అయితే, ఈ పద్ధతిలో, ఎలుకలతోపాటు పక్షులుకూడా ఆ మిశ్రమాన్ని తిన్న ఎలకలను తిని చనిపోతున్నాయి. కొందరు రైతులు ఎలుకలుపట్టేవారిని ఇందుకు నియోగిస్తుంటారు. అయితే, వారు ఒక్కొక్క ఎలుకకు 25-30 రూపాయలు వసూలుచేస్తుండడంతో, ఇది చాలా ఖరీదైన ప్రత్యామ్నాయమవుతున్నది.

కొత్త రకం బోను

[మార్చు]

కర్ణాటక రాష్ట్రంలోని, తుంకూరు జిల్లాకు చెందిన శ్రీ అరుణ్ కుమార్, పొలాలలో ఎలుకల బెడద నివారణకు, పర్యావరణానికి హాని కలిగించని, ఒక కొత్తరకం బోనును రూపొందించారు. ఇందుకోసం ఒక పాత వెదురు బుట్టను ఉపయోగిస్తారు. ఆ బుట్ట నాలుగు మూలలకు ఒక తీగను (బైండింగ్ వైర్) కట్టి, ఆ తీగకు ఒక పొడవైన ప్లాస్టిక్ దారాన్ని ముడివేస్తారు. ఈ ప్లాస్టిక్ దారాన్ని పైకి, కిందకు లాగడానికి వీలుగా ఒక తాటి మట్టకు కడతారు.ఆ వెదురుబుట్టలో, ఎరనులాగగానే, తలుపు మూసుకుపోయే, మామూలు ఎలుకల బోనును వుంచి, దానిలో ఒక కొబ్బరి ముక్క పెడతారు.

ఆ కొబ్బరి ముక్కను తినడంకోసం వెళ్ళి, ఎలుకలు ఆ బోనులో చిక్కుకుని, బోనులోనే చనిపోతాయి. చచ్చిన ఎలుకలను చేతితో తీసి, పొలంలో పాతి పెట్టవచ్చు. ఈ బోనుద్వారా 3-4 ఎలుకలను పట్టి, చంపవచ్చు. అయితే, ఇది ఎలుకల బెడదకు శాశ్వత పరిష్కారం కాదు. ఎందుకంటే, చచ్చిన ఎలుకల శరీరంనుంచి వచ్చే వాసన (వెలువడే ఫెరోమోన్స్), మిగతా ఎలుకలకు ఒక హెచ్చరికలా పనిచేసి, అవి ఇక ఆ ప్రదేశానికి రావు. కాని, పొలంలో మిగతాచోట్ల హాని కలిగిస్తూనే వుంటాయి. శ్రీ అరుణ్ కుమార్ రూపొందించిన బోను 30-35 రూపాయల ఖరీదవుతుంది.