Jump to content

ఎల్జీబీటీలపై ర్యాగింగ్

వికీపీడియా నుండి

ఎల్జీబీటీలపై, ముఖ్యంగా ఎల్జీబీటీ పిల్లలపై ర్యాగింగ్‌లో భాగంగా ఉద్దేశ్యపూర్వకంగా బాధితులను ఒకరు గానీ అంతకంటే ఎక్కువ‌మంది కానీ అవమానాలకు గురి‌చెయ్యడం, వారితో చెడుగా‌ ప్రవర్తించడం, వారిని శారీరక లేదా మానసిక హింస గురి చేయడం వంటివి జరుగుతుంటాయి.

ఎల్జీబీటీ పిల్లలూ లేదా యువత ఎల్జీబీటీ కాని పిల్లలూ లేదా యువత కంటే వారిపై ర్యాగింగ్ జరిగినట్టు నివేదించే అవకాశం ఎక్కువగా ఉంది.[1] ఒక అధ్యయనం ప్రకారం, ఎల్జీబీటీలపై ఉపయోగించే దుర్భాషలతో ఎగతాళి చేయబడిన అబ్బాయిలు, ఇతర రకాల దుర్భాషలతో ఎగతాళి చేయబడ్డ అబ్బాయిలతో పోలిస్తే మరింత ఎక్కువ ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొన్నారు.[2] కొంతమంది పరిశోధకులు ఎల్జిబీటీ ర్యాగింగ్‌పై పరిశోధనల్లో భాగంగా ఎల్జీబీటీ విధ్యార్థులతో పాటు తమ లైంగికతపై సందేహాలు ఉన్న విధ్యార్థుల్ని కూడా ఈ అధ్యయనాల్లో భాగం చేయమని సూచిస్తారు. ఎందుకంటే వారు కూడా ఈ రకమైన ర్యాగింగ్‌కు గురయ్యే అవకాశం ఉంది.[3][4][5]

ముఖ్యంగా పాఠశాలల్లో ఎల్జీబీటీ పిల్లలు, ఎల్జీబీటీ కాని పిల్లల కంటే ఎక్కువగా ర్యాగింగ్‌కు గురవుతున్నారు. ఎల్జీబీటీ ర్యాగింగ్ బాధితులు ఎల్లప్పుడూ అభద్రతా భావంతో ఉండే అవకాశం ఉంది, ఫలితంగా నిరాశా, నిస్పృహలకూ ఇంకా ఆందోళనకూ గురై, వారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఎక్కువవుతోంది. కొంతమంది ఎల్జీబీటీ విద్యార్థులు ర్యాగింగ్ ఇంకా, వేధింపుల నుండి తప్పించుకోవడానికి ఎల్జీబీటీ కాని వారిలా నటించడానికి ప్రయత్నిస్తుంటారు, కానీ దీని కారణంగా ఇంకా వత్తిడికి గురవ్వటం, ఇంకా వారి శ్రేయోభిలాషుల సపోర్ట్‌కు దూరమవ్వటం జరగవచ్చు. ఎల్జీబీటీ వ్యక్తులపై వేధింపులనూ, ర్యాగింగ్‌నూ నివారించడానికీ, ఇంకా బాధితులకు సపోర్ట్ ఇవ్వడానికీ భారతదేశంతో సహా ఎన్నో దేశాల్లో సహాయక సంస్థలు ఉన్నాయి. కొన్ని ప్రభుత్వాలు, ఎల్జీబీటీ వ్యక్తులపై వేధింపులకూ, ఇంకా ర్యాగింగ్‌కీ వ్యతిరేకంగా చట్టాలను అమల్లోకి తీసుకువచ్చాయి.

మూలాలు

[మార్చు]
  1. (April 2010). "Sexual Orientation and Bullying Among Adolescents in the Growing Up Today Study".
  2. . ""You're so gay!": Do different forms of bullying matter for adolescent males?".
  3. . "You're So Gay!": Do Different Forms of Bullying Matter for Adolescent Males?.".
  4. . "Adolescent Sexual Orientation and Suicide Risk: Evidence From a National Study".
  5. . "Peer Victimization, Social Support, and Psychosocial Adjustment of Sexual Minority Adolescents". Archived 2017-08-08 at the Wayback Machine