ఎస్.ఎం.ఏ.ఖాదిర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంగీత విద్వాంసుడు ఎస్.ఎం.ఏ.ఖాదిర్


ఎస్.ఎం.ఏ.ఖాదిర్ తమిళనాడులోని నాగూర్ దర్గా సూఫీ ఆస్థాన విద్వాంసుడు .[1] అతను తమిళనాడు లోని కొద్దిమంది ముస్లిం కర్ణాటక గాయకులలో ఆయన ఒకడు.[2]

జీవిత విశేషాలు

[మార్చు]

ఎస్.ఎం.ఏ ఖాదిర్ సంపన్న కుటుంబంలో జన్మించాడు. తమిళనాడులోని నాగపట్టణంలో స్కూలు విద్య పూర్తవగానే అతని బంధువు హార్మోనియం విద్వాంసుడైన విద్వాన్ దావూద్ మియా ఖాన్ సాహెబ్ వద్ద సంగీతం నేర్చుకున్నాడు. దర్గా ఆస్థాన విద్వాంసుడుగా 1952 లో నియమితులై 2014 లో మరణించే వరకు కొనసాగాడు. షాహుల్ హమీద్ మీరా సూఫీని స్మరిస్తూ దర్గాలోని అమ్మా సాహిబ్ వలియుల్లా సమాధి ఎదుటే కూర్చొని చాలా పాత తమిళ ఇస్లామిక్ కీర్తనలను పాడేవారు. సంపన్నుడైనప్పటికీ దర్గా వాళ్లిచ్చే 101 రూపాయల జీతాన్నే గౌరవంగా తీసుకునేవాడు. అతను ఇతర గుడుల్లో దేవాలయాల్లో కూడా పాడేవాడు. 1952 నుండి తాను పాడిన కీర్తనల ఆల్బమ్ కూడా తెచ్చారు. అతని మొదటి ఆల్బం "ఎన్ముగం పెరుమాయ నాగూర్ మీరా". 7 వ శతాబ్దంలోని కాసిమ్ పులావర్ ఇస్లామిక తమిళ సాహిత్యం "సీర పురాణం " తిరుప్పగళ్ ,కూనంగుడి మస్తాన్ సాహెబ్ రాసిన పాటలు పాడేవాడు. భారవి రాగంలో "చేతులారా"పంతువరాళి రాగంలో "వాడేరా దైవము" అనే త్యాగరాజ కృతులు కూడా ఖాదిర్ ఆల్బమ్ లో ఉన్నాయి.

తమిళ దర్గా విద్వాంసుడు తెలుగు త్యాగరాజ కృతులు ఎందుకు పాడాలి? అని కొంతమంది అభ్యంతరాలను లేవనెత్తగా "అన్ని మతాలను, భాషలను ఆలింగనం చేసుకోవాలి" అనే సూఫీ షాహుల్ హమీద్ నాగూర్ సందేశాన్ని వినిపించారు.

మూలాలు

[మార్చు]
  1. Anwar, Kombai S. (2023-01-12). "When a dargah vidwan sang Tyagaraja kritis". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. Retrieved 2023-04-11.
  2. "Guru – Isaimani Nagore M M Yousuff, Isai Illam, Zamin Pallavaram, Chennai" (in ఇంగ్లీష్). Retrieved 2023-04-11.