ఎస్ ఎస్ . బద్రీనాథ్
జననం | 1940 ఫిబ్రవరి 24 చెన్నై, భారతదేశం |
---|---|
మరణం | 2023 నవంబర్ 21 |
సెంగమేడు శ్రీనివాస బద్రీనాథ్ (జననం 24 ఫిబ్రవరి 1940) భారతదేశంలోని అతిపెద్ద స్వచ్ఛంద నేత్ర వైద్యశాలలలో ఒకటైన చెన్నైలోని శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు. [1] బద్రీనాథ్ నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎన్నికైన శాస్త్రవేత్త . [2] బద్రీనాథ్ 1996లో భారతదేశ మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ పురస్కారంను అందుకున్నాడు. బద్రీనాథ్ పద్మశ్రీ పురస్కారం తో పాటు డాక్టర్ బిసి రాయ్ అవార్డుతో సహా అనేక ఇతర అవార్డులను కూడా అందుకున్నాడు.
బాల్యం
[మార్చు]సెంగమేడు శ్రీనివాస బద్రీనాథ్ భారతదేశంలోని చెన్నై శివారు ప్రాంతమైన ట్రిప్లికేన్‌లో జన్మించారు. బద్రీనాథ్ తండ్రి ఎస్వీ శ్రీనివాసరావు, ఇంజనీర్, మద్రాసు ప్రభుత్వ సర్వీసులో ఉద్యోగం చేసేవారు. బద్రీనాథ్ తల్లి, లక్ష్మీ దేవి, తమిళనాడులోని నెరూర్‌కు న్యాయవాది. బద్రీనాథ్ తన చిన్న వయసులో ఉన్నప్పుడే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయాడు . తన తండ్రి మరణం తరువాత వచ్చిన భీమా డబ్బు నుండి తన వైద్య విద్యను పూర్తి చేశాడు.
వైద్య వృత్తి
[మార్చు]బద్రీనాథ్ 1963లో మద్రాసు వైద్య కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. తరువాత అమెరికాకు వెళ్ళాడు. అమెరికాలోని న్యూయార్క్ లో తన చదువును కొనసాగించాడు. న్యూయార్క్‌లోని గ్లాస్‌ల్యాండ్స్ హాస్పిటల్‌లో తను కొంతకాలం వైద్య సేవలు అందించాడు. బద్రీనాథ్ 1970లో భారతదేశానికి తిరిగి వచ్చాడు 1970 నుండి ఆరేళ్లపాటు చెన్నైలో వైద్యుడుగా పనిచేశాడు.
శంకర నేత్రాలయ
[మార్చు]1978లో, బద్రీనాథ్, తన సహాయ బృందంతో కలిసి, 1978లో మద్రాసులో శంకర్ నేత్రాలయ ఫౌండేషన్ ను స్థాపించారు.. శంకర్ నేత్రాలయ, స్వచ్ఛంద సంస్థ లాభాపేక్ష లేని వైద్యశాల. కంటి ఆసుపత్రి గా మారింది. [3]
శంకర్ నేత్రాలయ కు ప్రతిరోజు , 1200 మంది రోగులు చికిత్స చేయించుకోవడానికి వస్తారు. శంకర్ నేత్రాలయ లో ప్రతిరోజు 100 శస్త్రచికిత్సలు జరుగుతాయి. [4] 1978లో ప్రారంభమైనప్పటి నుండి, శంకర నేత్రాలయ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆప్తాల్మాలజీలో డిప్లొమా ఉన్నవారికి విట్రియో-రెటినాల్ సర్జరీ, కార్నియా, ఓక్యులోప్లాస్టీ, గ్లాకోమా, యువియా జనరల్ ఆప్తాల్మాలజీలో ఫెలోషిప్ కార్యక్రమాలను అందిస్తోంది.
అవార్డులు
[మార్చు]- 1996: పద్మ భూషణ్ [5]
- 1983: పద్మశ్రీ [2]
- 1991: డా. బిసి రాయ్ జాతీయ అవార్డు [5]
- 1992: పాల్ హారిస్ అవార్డు [6]
- 2009: వి. కృష్ణమూర్తి అవార్డ్ [7]
- 2009: మద్రాస్ సిటీ ఆప్తాల్మోలాజికల్ అసోసియేషన్- లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు [5]
- 2014: లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు- [8]
మరణం
[మార్చు]బద్రీనాథ్ 2023 నవంబర్ 21న మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Sankara Nethralaya. A Mission For Vision » 'Best Eye Hospital' in India". Omlog.org. 9 November 2009. Retrieved 2016-05-25.
- ↑ 2.0 2.1 "List of Fellows - NAMS" (PDF). National Academy of Medical Sciences. 2016. Retrieved 19 March 2016.
- ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 6 July 2010. Retrieved 11 December 2009.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Sankara Nethralaya". Sankara Nethralaya. Archived from the original on 2016-05-10. Retrieved 2016-05-25.
- ↑ 5.0 5.1 5.2 "Chennai's trinity of eye specialists honoured". The New Indian Express. Retrieved 2021-05-22.
- ↑ "List of Fellows" (PDF). National Academy of Medical Science (India). p. 8.
- ↑ "Award for Shankar Netralaya founder". The New Indian Express. Retrieved 2021-05-22.
- ↑ "Life Time Achievement Award – Vitreo Retina Society" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-05-22.