ఎస్ కలైవాణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎస్ కలైవాణి
వ్యక్తిగత సమాచారం
జాతీయతభారతీయురాలు
జననం25నవంబర్, 1999
చెన్నై, తమిళనాడు, ఇండియా
క్రీడ
క్రీడబాక్సింగ్(48కేజీల విభాగం)
సాధించినవి, పతకాలు
ప్రపంచస్థాయి ఫైనళ్ళు1.2012లో జరిగిన సబ్ జూనియర్ విమెన్స్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో కాంస్య పతకం

2019 సీనియర్ విమెన్స్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో రజతం

2019 ఖట్మాండులో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో స్వర్ణ పతకం

ఎస్.కలైవాణి భారతీయ మహిళా బాక్సర్. ఆమె 48 కేజీల విభాగంలో పోటీ పడుతుంటారు. 18 ఏళ్ల వయసులోనే ఇండియన్ సీనియర్స్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో రజత పతకం సాధించారు. ఈ పోటీలు 2019లో విజయనగరంలో జరిగాయి. ఆపై 2019లో ఇండియన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ షిఫ్‌లో ఆమెను మోస్ట్ ప్రామిసింగ్ బాక్సర్‌గా కొనియాడారు. ఆ తరువాత అదే ఏడాది నేపాల్ రాజధాని ఖట్మాండులో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో స్వర్ణం సాధించారు.

వ్యక్తిగత జీవితం-నేపథ్యం[మార్చు]

ఎస్.కలైవాణి తమిళనాడు రాజధాని చెన్నైలో వాషర్‌మ్యాన్ పేటలో నవంబర్ 25, 1999లో జన్మించారు. ఆమె తండ్రి శ్రీనివాసన్ అమెచ్యూర్ బాక్సర్, ఆమె సోదరుడు రంజిత్ కూడా జాతీయ స్థాయి బాక్సర్ కావడం విశేషం. ప్రారంభదశలో బాక్సింగ్ రింగ్‌లో తన తండ్రితో తాను ఎలా తలపడిందీ చాలా ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు కలైవాణి. చిన్నప్పుడు తనకు, తన సోదరునికి తండ్రి శిక్షణ ఇస్తున్న సమయంలోనే బాక్సింగ్ పట్ల అపారమైన ప్రేమను పెంచుకున్నానని ఆమె అంటారు. ఆమె కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. ఆ సమయంలో ఆమె తండ్రి అదనపు ఆదాయం కోసం, ఆమె కలల్ని నెరవేర్చడం కోసం వ్యవసాయం చేసేవారు. [1] [2]

చిన్నప్పటి నుంచే ఆమెను ప్రోత్సహించిన ఆమె తండ్రి మొదట్లో తానే స్వయంగా శిక్షణ ఇచ్చేవారు.  అయితే పాఠశాలలో ఉపాధ్యాయులు మాత్రం ఆమె బాక్సింగ్‌పై ఎక్కువగా శ్రద్ధ పెట్టడానికి పెద్దగా నచ్చేవారు కాదు. ఆమె చదువుపై మరింత దృష్టి పెట్టాలని వారు ఆశించేవారు. నాల్గో తరగతి చదువుతున్నప్పుడే కలైవాణి బాక్సింగ్‌ను ప్రారంభించారు. [3]అయితే సబ్ జూనియర్ లెవెల్ పోటీల్లో ఆమె పతకాలు సాధించిన తర్వాత ఆమె పట్ల ఆమె ఉపాధ్యాయుల అభిప్రాయం మారింది. అప్పటి నుంచి ఆమెను గోల్డెన్ గర్ల్‌గా చూడటం మొదలుపెట్టారు. అంతే కాదు... ఆమెను మరింత ప్రోత్సహించేవారు కూడా. అటు చాలా బంధువులు కూడా ఆమె బాక్సింగ్‌ పట్ల శ్రద్ధ చూపడం పెద్దగా నచ్చేది కాదు. అమ్మాయిలకు ఆ క్రీడ అంతగా నప్పదన్నది వారి అభిప్రాయం. ‘కలైవాణి బాక్సింగ్‌లోనే కొనసాగితే ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రారు’ కొందరు బంధువులు ఆమె తండ్రితో అనేవారు.

[3] [2]

అయితే వారి మాటల్ని కలైవాణి తండ్రి పెద్దగా పట్టించుకునేవారు కాదు. తన శిక్షణను కొనసాగిస్తూనే తన బిడ్డల్ని మరింత ప్రోత్సహించేవారు. తన బాక్సింగ్‌లో రాణించడానికి కారణం తన తండ్రి, సోదరుడే అంటారు కలైవాణి. తన కుమారుణ్ణి కూడా మరింతగా ప్రోత్సహించాలని భావించినప్పటికీ ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించలేదు. దీంతో కేవలం కుమార్తె కెరియర్‌పై మాత్రమే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు.

వృత్తి పరమైన విజయాలు[మార్చు]

  • 9 ఏళ్ల వయసులో తొలిసారిగా బాక్సంగ్ గ్లౌజులు ధరించారు కలైవాణి.  2012లో జరిగిన మహిళల సబ్ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించారు.[4]
  • 2019లో జరిగిన సీనియర్ విమెన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ షిఫ్‌లో రజతం కైవసం చేసుకున్నారు.[1]
  • 2019లో ఖట్మాండులో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో ఆమె తన కెరియర్లో అత్యుత్తమ విజయం నమోదు చేశారని చెప్పవచ్చు.  48 కేజీల విభాగంలో నేపాల్ బాక్సర్ మహార్జన్ లలితను ఓడించి స్వర్ణ పతకం సాధించారు.[5]
  • నిజానికి 2020లో జరగబోయే ఒలంపిక్స్‌లో దేశానికి స్వర్ణం సాధించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ యువ బాక్సర్. ప్రస్తుతం 48 కేజీల విభాగంలో ఆమె పోటీ పడుతున్నారు. అయితే ఈ విభాగం ప్రస్తుతం ఒలంపిక్స్‌లో భాగం కాదు. ఒలంపిక్స్‌లో పాల్గొనాలంటే ఆమె హయ్యర్ వెయిట్ క్యాటగిరిలో పోటీ పడాల్సి ఉంటుంది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Vishal, R. "Tamil Nadu's Kalaivani is emerging as the surprise package in Indian women's boxing". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-02-19.
  2. 2.0 2.1 "ISWOTY ఎస్. కలైవాణి: ఉజ్వల భవిష్యత్తు దిశగా దూసుకెళ్తున్న యువ బాక్సర్". BBC News తెలుగు. Retrieved 2021-02-19.
  3. 3.0 3.1 SURANA, NEHA (2020-02-01). "Packing a punch". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2021-02-19.
  4. "Indian Boxing Federation Boxer Details". www.indiaboxing.in. Retrieved 2021-02-19.
  5. SPORTS, FISTO (2020-12-01). "S.Kalaivani: 'Boxing keeps my head straight'". www.fistosports.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-04-20. Retrieved 2021-02-19.