ఎయిర్‌బస్ A380

వికీపీడియా నుండి
(ఎ380 నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఎయిర్‌బస్ A380
ఎయిర్ ఫ్రాన్స్ యొక్క ఎయిర్ బస్ A380-800 ల్యాండింగ్ అవుతున్న కొద్ది సమయం ముందు
పాత్ర విశాలమైన-బాడీ, డబుల్ డెక్ జెట్ విమానం
రూపుదిద్దుకున్న దేశం బహుళ జాతీయ[1]
తయారీదారు ఎయిర్‌బస్
మొదటి విహారం 27 ఏప్రిల్ 2005
చేర్చుకున్నవారు 25 అక్టోబర్ 2007
సింగపూర్ ఎయిర్ లైన్స్ తో
స్థితి సేవలో
ప్రధాన వాడుకరిs ఎమిరేట్స్
సింగపూర్ ఎయిర్‌లైన్స్
క్వాంటాస్
లుఫ్తాన్సా
ఉత్పత్తి జరిగిన కాలం 2005–ప్రస్తుతం
మొత్తం సంఖ్య 153 as of 31 జనవరి 2015[[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]]
ఒక్కొక్కదాని ఖర్చు
US$428 million (2015)[2]

ఎయిర్‌బస్ A380 అనేది ఎయిర్‌బస్ సంస్థ చే తయారు చేయబడిన ఒక డబుల్ డెక్, వైడ్-బాడీ, నాలుగు ఇంజిన్ల జెట్ విమానం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానం. 2007 లో సేవలను ప్రారంభించిన ఈ ప్రయాణికుల విమానం యొక్క క్యాబిన్ విశాలంగా, విలాసవంతంగా ఉంటుంది, ఈ విమానానికి తగ్గట్టు గానే ఈ విమాన సర్వీసును అందిస్తున్న విమానాశ్రయాలు కూడా నవీకరించబడిన సౌకర్యాలను కలిగి ఉన్నాయి. ఇది మొదట్లో ఎయిర్‌బస్ A3XX అనే పేరుతో పెద్ద విమానాల మార్కెట్లో బోయింగ్ యొక్క గుత్తాధిపత్యమును సవాలు చేసేందుకు రూపొందించబడింది. ఈ ఎ380 2005 ఏప్రిల్ 27 న దాని యొక్క మొదటి విమానంగా తయారుచేయబడింది, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సహకారంతో అక్టోబరు 2007 లో వాణిజ్య సేవలోకి ప్రవేశించింది. ఈ విమానం ఎత్తు 24 మీటర్లు, వెడల్పు 80 మీటర్లు, పొడవు 73 మీటర్లు. ఈ విమానంలో కనీసంగా ఒకేసారి 525 మంది ప్రయాణించవచ్చు. దీని ఇంధన సామర్థ్యం సుమారు 82 గ్యాలన్లు. ఈ విమానం బరువు 560 టన్నులు, దీనిలో సుమారు 40 లక్షల విడిభాగాలు ఉంటాయి. ఈ ఎయిర్‌బస్ ప్రధానంగా మూడు భాగాలుగా ఉంటుంది. వీటిని కలపడానికి 8000 బోల్టులు అవసరం. ఇది భూమికి 43,000 అడుగుల ఎత్తులో ఎగురుతూ గంటకు 640 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని జీవితకాల ప్రయాణ సామర్థ్యం 1,40,000 గంటలు.

మూలాలు

[మార్చు]
  • సాక్షి దినపత్రిక - 16-03-2015 - (ప్రపంచంలోకెల్లా అతి పెద్ద విమానం ఏది?)
  1. Final assembly in France
  2. "New Airbus aircraft list prices for 2015". Airbus. 13 January 2015. Retrieved 20 January 2015.

బయటి లింకులు

[మార్చు]