ఏకముఖ విద్యుత్ ప్రవాహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏకముఖ విద్యుత్ ప్రవాహం (ఎరుపు రేఖ). సమాంతర అక్షం సమయాన్ని లెక్కిస్తుంది; నిలువుగీత విద్యుత్ ప్రవాహము లేక వోల్టేజ్‌ను సూచిస్తుంది.

ఏకముఖ విద్యుత్ ప్రవాహం (Direct current - డైరెక్ట్ కరెంట్) అనగా ఏకముఖంగా అనగా ఒకే దిశగా ప్రవహించే విద్యుత్ ప్రవాహము. ఏకముఖ విద్యుత్ ప్రవాహమును ఆంగ్లంలో డైరెక్ట్ కరెంట్ లేదా సింపుల్‌గా డీసీ అంటారు. డైరెక్ట్ కరెంట్ బ్యాటరీలు, థెర్మోకపుల్స్, సోలార్ సెల్స్, డైనమో రకానికి చెందిన దిక్పరివరివర్తన రకపు విద్యుత్ యంత్రాల వంటి వనరులచే ఉత్పత్తి చేయబడుతుంది. డైరెక్ట్ కరెంటు వైరు వంటి ఒక కండక్టరులో ప్రవహించవచ్చు, కానీ అర్ధవాహకాల, అవాహకాల గుండా లేదా ఇంకా ఎలక్ట్రాన్ లేదా అయాన్ బీమ్స్ లో వాక్యూమ్‌ ద్వారాగా కూడా ప్రవహిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కరెంటు స్థిరమైన దిశలో ప్రవహిస్తుంది, దీనిని ఆల్టర్నేటింగ్ కరెంటు నుండి ప్రత్యేకపరచవచ్చు. గతంలో కరెంటు యొక్క ఈ రకం కోసం ఉపయోగించిన పదం గాల్వనిక్ కరెంటు. AC, DC సంక్షిప్తాలను తరచుగా కరెంటు లేదా వోల్టేజ్ సవరించునప్పుడు వంటి సందర్భాలలో ఆల్టర్నెట్, డైరెక్ట్ ల సింపుల్ అర్థమునకు ఉపయోగిస్తారు.

ద్విముఖ విద్యుత్ ప్రవాహం

[మార్చు]

ద్విముఖ విద్యుత్ ప్రవాహం లేదా ఏకాంతర విద్యుత్ ప్రవాహం అనగా ఊయల ఊగినట్లుగా చాలా వేగంగా ముందుకి వెనుకకి ఊగిసలాడుతూ ప్రవహించే విద్యుత్ ప్రవాహం. ద్విముఖ విద్యుత్ప్రవాహమును ఆంగ్లంలో ఆల్టర్నేటింగ్ కరెంట్ లేదా సింపుల్‌గా ఏసీ అని అంటారు. విద్యుత్‌ను అనేక పద్ధతులలో ఉత్పత్తి చేసినా రెండు రకాలుగానే వాడుకునే అవకాశముంటుంది. వాటిలో ఒక రకం ద్విముఖ విద్యుత్ ప్రవాహం కాగా మరొకటి ఏకముఖ విద్యుత్ ప్రవాహం. ఏకముఖ విద్యుత్ ప్రవాహమును ఆంగ్లంలో డైరెక్ట్ కరెంట్ లేదా సింపుల్‌గా డీసీ అని అంటారు. ఏకముఖ విద్యుత్ ప్రవాహం ద్విముఖ విద్యుత్ ప్రవాహమునకు భిన్నమైనది, ఏలననగా ఏకముఖ విద్యుత్ ప్రవాహములో విద్యుత్ ఒకే దిశ వైపు ప్రవహిస్తుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించే కరెంటు ద్విముఖ విద్యుత్ అనగా ఏసీ కరెంటు. ప్రపంచ వ్యాప్తంగా తయారు చేయబడిన అధిక ఎలక్ట్రిక్ పరికరాలు ఏసీ కరెంటును దృష్టిలో ఉంచుకొని తయారు చేయబడినవే. బల్బులు, ఫ్యాన్లు, ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మెషీన్లు, టీవీలు, ప్రింటర్లు, ప్రిజ్‌లు, మోటార్లు ఇలా దాదాపు అన్ని ఎలక్ట్రిక్ పరికరాలు ఏసీ కరెంటును దృష్టిలో ఉంచుకొని తయారు చేయబడినవే. సాధారణంగా ఇళ్ళలో ఉండే కరెంటు ఏసీ కరెంటు, ఈ ఏసీ కరెంటులో 230 వోల్టుల విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. 230 వోల్టుల ఏసీ కరెంటును మానవ శరీరం తట్టుకోలేదు, అందువలన మానవ శరీరానికి ఏసీ కరెంటు తగిలి శరీరం గుండా విద్యుత్ ప్రవహించినట్లయితే షాక్ కొడుతుంది.