ఏకవర్ణీయత
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
సోడియం దీపం ఏకవర్ణ కాంతిని (λ=58930A) ఉద్గారిస్తుంది. అంటే సోడియం దీపపు గరిష్ఠ కాంతి తీవ్రత λ=58930A వద్ద ఉంటుందని ఆర్థం. గరిష్ఠ కాంతి తీవ్రత λ=58930A కు రెండు వైపులా, 5000A వరకు కూదా, శూన్యంకాదు. ఈ విధంగా గరిష్ఠ కాంతి తీవ్రతకి రెండు వైపులా విస్తరించియున్న తరంగ దైర్ఘ్యాల గరిష్ఠ తీవ్రని "పట్టిక వెడల్పు" లేదా అవధి అంటారు.
- సాధారణ సాంప్రదాయక ఏక వర్ణ కాంతుల పట్టిక వెడల్పు (Δλ) లు 10000A క్రమంలో ఉంటాయి.
- సాధారణ లేసర్ పట్టిక వెడల్పు (Δλ) లు 100A క్రమంలో ఉంటుంది.
- మంచి నాణ్యమైన లేసరు పట్టిక వెడల్పు (Δλ) = 10-8 0A ఉంటుంది. ఇలా చాలా స్వల్ప పట్టిక వెడల్పున్న లేసరు కాంతిని "అధిక ఏకవర్ణీయత" గలదిగా భావిస్తారు.
- ఏక వర్ణీయత అనునది లేసర్ యొక్క ప్రత్యేక లక్షణం
లేసర్
[మార్చు]లేసర్ (LASER) అనునది ఒక సంక్షిప్తపదం. ("Light Amplification by Stimulated Emission of Radiation") అనగా "ఉత్తేజిత కాంతి ఉద్గారం వలన కాంతి వర్థకము" చెందే ప్రక్రియను సూచిస్తుంది. లేసర్ ప్రత్యేక లక్షణాలున్న ఒక కాంతి జనకం. ఈ ప్రత్యేక లక్షణాలు సాధారణంగా మనం చూసే సూర్యుడు, ఉష్ణోద్గార దీపం, ఏకవర్ణ కాంతి జనకం, సోడియం దీపం వంటి కాంతి జనకలలో ఉండవు.
- దీనిని 1954 వ సంవత్సరంలో డా.చార్లెస్.టౌన్స్ మొదటి సారిగా లేసర్ యొక్క శాస్త్రీయ జ్ఞానాన్ని ప్రతిపాదించారు. 1960 వ సంవత్సరంలో అనేక శాస్త్రజ్ఞుల ప్రయాసలతో "స్పందన లేసర్" రూపొందింది.
లేసర్ కాంతి లక్షణాలు
[మార్చు]సాధారణ కాంతి జనకానికి, లేసర్ కు మధ్య నాలుగు ప్రధాన తేడాలున్నాయి. 1.సంబద్ధత 2.దిశనీయత 3. ఏకవర్ణీయత 4. తీవ్రత.