ఏకసంధాగ్రాహి
స్వరూపం
ఏదైనా విషయాన్ని కాని, పద్యాన్ని కాని, పాఠాన్ని గాని ఒకసారి విని గ్రహించి, అప్పజెప్పగలిగిన వ్యక్తిని ఏకసంధాగ్రాహిగా పేర్కొంటారు.[1] వీరికి విశేషమైన ధారణ శక్తి ఉంటుంది. వీరు వేదవిద్యలను గాని, ఇతర విద్యలను గాని సులభంగా గ్రహించి గుర్తుంచుకో గలుగుతారు. శ్రీ ఆది శంకరాచార్యులుగారు, శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహంగారు, శ్రీ ఆదిభట్ల నారాయణ దాసుగారు ఏకసంధాగ్రాహులుగా ప్రసిద్ధికెక్కినవారిలో కొందఱు. రెండుసార్లు విని ధారణ పట్టగల వ్యక్తి ద్విసంధాగ్రాహి.
మూలాలు
[మార్చు]- ↑ "నిఘంటుశోధన - తెలుగు నిఘంటువు ఆంధ్రశబ్ద రత్నాకరము, చలమచర్ల రంగాచార్యులు". andhrabharati.com. Retrieved 2025-01-07.