ఏడిద సంగమేశ్వర స్వామి ఆలయం
ఏడిద సంగమేశ్వర స్వామి ఆలయం | |
---|---|
పేరు | |
ఇతర పేర్లు: | ఏడిద సంగమేశ్వరం |
ప్రధాన పేరు : | సంగమేశ్వరస్వామి ఆలయం |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా: | తూర్పు గోదావరి జిల్లా |
ప్రదేశం: | ఏడిద |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | సంగమేశ్వరుడు (శివుడు) |
ప్రధాన దేవత: | పార్వతి |
ముఖ్య_ఉత్సవాలు: | శివరాత్రి, సుబ్రహ్మణ్య షష్ఠి |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | హిందూ |
ఏడిద సంగమేశ్వర స్వామి ఆలయం, పురాణప్రసిద్ధమైన దివ్యక్షేత్రం.[1] రాజమహేంద్రవరంకి 25 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ఆలయం ఏడిద గ్రామానికి చెందినదైనందువల్ల ఏడిద సంగమేశ్వరమని పిలువబడుతుంది.
స్థలపురాణం
[మార్చు]ఈ ఆలయం గురించి శ్రీనాథుడు తన భీమఖండంలో పేర్కొన్నాడు. ఇక్కడి స్థలపురాణం ప్రకారం ఈ ప్రదేశం తుల్య, సప్త గోదావరుల సంగమమైనందు వల్ల ఈ ఆలయం సంగమేశ్వరం అయ్యింది. అలనాడు దానవులు తుల్య నదీ తీరంలో యజ్ఞయాగాదులు చేస్తుండగా ద్రాక్షారామ భీమేశ్వరుని ప్రతిష్ఠకై దేవఋషులు సప్త గోదావరులను తీసుకుని పోతున్న క్రమంలో తుల్యాతీరంలో జలప్రళయం సంభవించి దానవుల యజ్ఞం విఘ్నమౌతుంది. దానితో దేవదానవులు పోరాడి తుల్య నది పాపభూయిష్టమౌతుందని దేవ ఋషులు, సప్త గోదావరులు ఇంకి పోతాయని దానవ ఋషులు ఒకరినొకరు శపించుకుంటారు. ఆ సమయంలో తుల్యుడనే దానవ ఋషి వారికి మధ్యవర్తిగా వుండి నదులపై శాపాలు తొలుగునట్లు చేసి సప్తగోదావరి అంతర్వాహినియై ద్రాక్షారామం చేరేటట్లు, తుల్యానది పుణ్యకాలంలో పవిత్రమయ్యేటట్లు వరం ఇస్తాడు. ఆ సంధి సమయంలో దేవేంద్రాది దేవతలు సంగమించిన స్థానమగుటచే ఇది సంగమేశ్వరమయ్యిందని భీమఖండంలో పేర్కొనబడింది.
చరిత్ర
[మార్చు]అతి పురాతనమైన ఈ దేవాలయం చాళుక్యుల కాలంలో ఉచ్ఛస్థితిలో ఉన్నట్లు, తరువాత కాలక్రమేణా ప్రాభవం తగ్గి 14వ శతాబ్దం నాటికి శివలింగం ఒకటే మిగిలినట్లు తెలుస్తుంది. రాజమహేంద్రవరంను పాలించిన అనవేమారెడ్డి మంత్రి బెండపూడి అన్నయామాత్యుడు సా.శ.1424-1426ల మధ్య ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేశాడు.
విశేషాలు
[మార్చు]ఈ ఆలయ ప్రాంగణంలో సంగమేశ్వరునితో పాటు విశ్వేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, బ్రహ్మేశ్వరుడు, వేణుగోపాలుడు కొలువై ఉన్నారు. ఈ ఆలయం సంవత్సరంలో రెండుసార్లు శివరాత్రి, సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాలలో భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది.
చిత్రమాలిక
[మార్చు]-
సంగమేశ్వర స్వామి దేవాలయం-2
-
దేవాలయం లోపలి భాగం
-
దేవాలయంలో నంది విగ్రహం
-
దేవాలయం వెనుక భాగం
-
ఆలయ కోనేరు
మూలాలు
[మార్చు]- ↑ "శివాలయాలకు పోటెత్తిన భక్తులు". Prabha News. 2021-11-08. Retrieved 2021-12-08.