Jump to content

ఐఎన్ఎస్ కిర్పాన్

వికీపీడియా నుండి

భారత్ నావికాదళంలో చురుగ్గా సేవలు అందిస్తున్న యుద్ధనౌక ఐఎన్ఎస్ కిర్పాన్‌ ను కేంద్ర ప్రభుత్వం వియత్నాంకు కానుకగా ఇచ్చింది .విదేశాలకు ఒక నౌకని బహుమతిగా ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి[1]. ఈ నౌక విశాఖపట్నం నుంచి జూన్ 28న వియత్నాంకు బయలుదేరి వెళ్ళింది. చైనా పొరుగునే ఉన్న వియత్నాం ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారతదేశానికి అత్యంత కీలక భాగస్వామిగా ఉంది. భావసారూప్యత కలిగిన భాగస్వామ్య దేశమైన వియత్నాం నౌకాదళ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టాలన్నది భారత్ వ్యూహంగా ఉంది. ఐఎన్ఎస్ కిర్పాన్‌ ఖుక్రీ క్లాస్ కు చెందిన అతి చిన్న క్షిపణి యుద్ధ నౌక. 1350 టన్నుల బరువు అయిన ఈ నౌకను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్,ఇంజనీర్లు రూపొందించారు[2] . మీడియం రేంజ్ గన్స్ అంటే 30 ఎంఎం తుపాకీలను అమర్చవచ్చు .ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించేక్షిపణులు, చాఫ్ లాంచర్స్ వైవిధ్యమైన పనులు చేయగలదు[3].

  1. "HANDING OVER OF INS KIRPAN TO VPN - 22 JUL 23". pib.gov.in. Retrieved 2023-09-12.
  2. "In latest move towards growing ties, India hands over missile corvette INS Kirpan to Vietnam". The Indian Express (in ఇంగ్లీష్). 2023-07-23. Retrieved 2023-09-12.
  3. Peri, Dinakar (2023-07-22). "Missile boat Kirpan decommissioned from Indian Navy, handed over to Vietnam as gift". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-09-12.