Jump to content

ఐప్యాడ్

వికీపీడియా నుండి
ఐప్యాడ్
IPad Pro 5th generation.png
సరికొత్త ఐప్యాడ్ ప్రో (6వ తరం) ముందుభాగం
అభివృద్ధిదారుడుఆపిల్ కార్పొరేషన్
ఉత్పత్తిదారులు
రకంట్యాబ్లెట్ కంప్యూటర్
విడుదల తేదీApril 3, 2010; 14 సంవత్సరాల క్రితం (April 3, 2010) (మొదటి తరం ఐప్యాడ్)
విక్రయించింది యూనిట్లు677.7 మిలియన్లు (as of 2022)[5]
ఆపరేటింగ్ సిస్టంఐఒఎస్ (2010–2019)[6]
iPadOS (2019–present)[6]
కనెక్టివిటీవైఫై, సెల్యులార్, 30 పిన్ డాక్ కనెక్టర్, లైట్నింగ్ కనెక్టర్, USB-C, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, 3-pin స్మార్ట్ కనెక్టర్
ఆన్‌లైన్ సర్వీసు
  • ఐట్యూన్స్ స్టోర్
  • ఆప్ స్టోర్
  • ఐక్లౌడ్
  • ఆపిల్ బుక్స్
  • పాడ్‌కాస్ట్
  • ఆపిల్ మ్యూజిక్
  • ఆపిల్ వాలెట్[7]
సంబంధిత విషయములుఐఫోన్, ఐపాడ్ టచ్

ఐప్యాడ్ (iPad) అనేది ఐఓఎస్ ఆధారిత టాబ్లెట్ కంప్యూటర్. దీనిని ఆపిల్ సంస్థ ఉత్పత్తి చేస్తుంది. మొదటి తరం ఐప్యాడ్ జనవరి 27, 2010లో విడుదల చేశారు. దీని తర్వాత ఐప్యాడ్ శ్రేణి చిన్న పరిమాణంలో ఉండే ఐప్యాడ్ మిని, నాజూకైన ఐప్యాడ్ ఎయిర్, ఉన్నత స్థాయి ఐప్యాడ్ ప్రో లకు విస్తరించింది. 2022 నాటికి ప్రపంచ వ్యాప్తంగా సుమారు 67 కోట్ల ఐప్యాడ్లు అమ్ముడయ్యాయని ఒక అంచనా. దీనితో ఆపిల్ సంస్థ అత్యధిక ట్యాబ్లెట్ కంప్యూటర్లు అమ్మిన సంస్థగా అవతరించింది. ఈ ఆదరణతో ఇతర ట్యాబ్లెట్ కంప్యూటర్లను కూడా ఐప్యాడ్ అని వ్యవహరించడం పరిపాటి అయింది.

మొదట్లో ఐఫోన్లలో వాడే ఐఓఎస్ నే ఐప్యాడ్లలో వాడేవారు. సెప్టెంబరు 2019 నాటికి ఐప్యాడ్ల కోసమే ప్రత్యేకంగా ఐఓఎస్ నుంచి ఫోర్క్ చేసిన ఐప్యాడ్ ఓఎస్ ను అభివృద్ధి చేసారు. ఐప్యాడ్ ఓఎస్ ఐప్యాడ్ హార్డ్‌వేర్ కు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పిస్తుంది. అలాగే ఐప్యాడ్ లోని పెద్ద తెరలకు అనుగుణంగా పనిచేస్తుంది. 2019 నుంచి ప్రతి సంవత్సరం కొత్త వర్షన్ విడుదలవుతూ వస్తోంది.

తొలితరం ఐప్యాడ్ దాని సాఫ్ట్‌వేర్‌కు మంచి ఆదరణ పొందింది. 2010లో అత్యంత ప్రభావవంతమైన ఆవిష్కరణలలో ఒకటిగా గుర్తించబడింది. 2021 మూడవ త్రైమాసికం నాటికి, టాబ్లెట్‌లలో ఐప్యాడ్ 34.6% మార్కెట్ వాటాను కలిగి ఉంది. వ్యక్తిగత ఉపయోగంతో పాటు, ఐప్యాడ్ వ్యాపారం, విద్య, ఆరోగ్య సంరక్షణ, సాంకేతిక రంగాలలో ఉపయోగించబడుతుంది. ఐప్యాడ్ రెండు కనెక్టివిటీ వేరియంట్‌లు ఉన్నాయి; ఒకదానిలో Wi-Fi మాత్రమే ఉంటుంది. సెల్యులార్ నెట్‌వర్క్‌లకు అదనపు మద్దతు ఉంది. ఐప్యాడ్ కోసం ఉపకరణాలు ఆపిల్ పెన్సిల్, స్మార్ట్ కేస్, స్మార్ట్ కీబోర్డ్, స్మార్ట్ కీబోర్డ్ ఫోలియో, మ్యాజిక్ కీబోర్డ్, ఇంకా అనేక అడాప్టర్‌లను కలిగి ఉంటాయి.

మూలాలు

[మార్చు]
  1. "Supplier List" (PDF). Apple. Archived (PDF) from the original on January 27, 2022. Retrieved February 5, 2022.
  2. Wagner, Wieland (May 28, 2010). "iPad Factory in the Firing Line: Worker Suicides Have Electronics Maker Uneasy in China". Der Spiegel (in ఇంగ్లీష్). ISSN 2195-1349. Archived from the original on December 25, 2021. Retrieved February 5, 2022.
  3. Dou, Eva (May 29, 2013). "Apple Shifts Supply Chain Away From Foxconn to Pegatron". The Wall Street Journal (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0099-9660. Archived from the original on October 6, 2013. Retrieved February 5, 2022.
  4. Lovejoy, Ben (October 22, 2015). "Majority of iPhone/iPad workers at Pegatron's Shanghai factory exceed 60-hour work limit, claims China Labor Watch". 9to5Mac (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on March 30, 2017. Retrieved February 5, 2022.
  5. "Apple Statistics (2023)". Businessofapps (in ఇంగ్లీష్). Archived from the original on March 29, 2023. Retrieved March 29, 2023.
  6. 6.0 6.1 Byford, Sam (June 4, 2019). "iPadOS should make the iPad a better tablet, but not a laptop". The Verge (in ఇంగ్లీష్). Archived from the original on February 5, 2022. Retrieved February 5, 2022.
  7. "iOS and iPadOS – Feature Availability". Apple (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on January 5, 2022. Retrieved February 5, 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=ఐప్యాడ్&oldid=4361363" నుండి వెలికితీశారు