Jump to content

ఐఫోన్ 7

వికీపీడియా నుండి
ఐఫోన్ 7, దాని బాక్స్

ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ ఆపిల్ చే రూపకల్పన, అభివృద్ధి చేయబడిన స్మార్ట్ ఫోన్లు . వీటిని ఆపిల్ సి.ఇ.ఓ 2016 సెప్టెంబరు 16న  శాన్ ఫ్రాన్సిస్కోలో విడుదల చేశారు. ఇవి ఐఫోన్ శ్రేణిలో 6S, 6S ప్లస్ తరువాతవి. ఆపిల్ వీటిని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో అక్టోబరు 2016 లోపు విడుదల చేసింది.[1] వీటి తరువత ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ లను 2017 సెప్టెంబరు 22న[2],, ఐఫోన్ X ను 2017 నవంబరు 3న విడుదల చేశారు.[3]

ఐఫోన్ 7 డిజైన్ ఐఫోన్ 6Sను పోలి ఉంటుంది, కానీ కొత్త రంగు ఎంపికలు (మాట్టే నలుపు, జెట్ బ్లాక్) లను పరిచయం చేశారు. ఇవి నీరు, దుమ్ము నిరోధకతో, ఒక కొత్త కెపాసిటివ్, స్టాటిక్ హోమ్ బటన్ను కలిగి,, 3.5 మిమీ హెడ్ఫోన్ జాక్ లోకుండా ఉంటాయి.[4] పరికరం యొక్క అంతర్గత హార్డ్వేర్ కూడా కొన్ని నవీకరణలు చేశారు.  దానిలోని కొత్త చిప్ లతో మెరుగైన వ్యవస్థ, గ్రాఫిక్స్ పనితీరు,, అప్గ్రేడెడ్ 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్  ఆప్టికల్ చిత్రం స్థిరీకరణ చేయగలిన కెమెరా. ఐఫోన్ 7 ప్లస్ మోడల్ కు ఒక అదనపు టెలి ఫోటొ కెమేరా ఉన్నది, ఇది జూమ్ స్థాయిను పెంచుతుంది.

లక్షణాలు

[మార్చు]
పెట్టెలోని భాగాలు

హార్డ్వేర్

[మార్చు]
ఐఫోన్ 6, 7కు మధ్య ఉన్న తేడాలు

ఐఫోన్ 7 ఆకారం, పరిమాణం ఐఫోన్ 6ఐఫోన్ 6S లను పోలి ఉంటుంది. పాత వెండి, బంగారం,, గులాబీ బంగారం రంగులకు మాట్టే నలుపు, నిగనిగలాడే "జెట్ బ్లాక్"లను కలిపారు, , ఒక పరిమిత సమయంలో ఎరుపు రంగును కూడా విడుదలచేశారు. "జెట్ బ్లాక్" రంగు ఒక చాలా నలుపుగా, మెరుస్తూ ఉంటుంది.[5] ఇది బహుళ-దశల ప్రక్రిల ద్వారా రూపొందించబడింది. నల్లటి అల్యూమినియం ఆక్సైడ్ పై అన్టీఆక్సిడెంట్ ఉపరితల పొర ఉంటుంది.ఈ ప్రక్రియ ఒక "సన్నటి కణ స్నానం"తో ముగిస్తారు. మొత్తం ప్రక్రియ ఒక గంట కంటే తక్కువ సమయమే పడుతుంది.[6]

ఐఫోన్ 7 IP67 నీరు, దుమ్ము నిరోధకకు కలిగి ఉంటుంది, అయినప్పటికీ పరీక్షలు లోపభూయిష్టపనితనాలకు దారితీశాయి, ప్రత్యేకంగా నీటి స్పందన తరువాత కొంతసేపటివరకు స్పీకర్లు వక్రీకరించాయి. కని నీటి వలన కలిగిన నష్టాన్ని వారెంటీలో కలపలేదు.[7][8]

ఐఫోన్ 7కు 3.5 mm హెడ్ఫోన్ జాక్ ఫీచర్ లేదు; దాని స్థానంలో రెండవ స్పీకర్ గ్రిల్ ఇవ్వడం జరిగింది. దానిని అంతర్గత భారమితిగా వాడుతున్నరు. ఒక లైట్నింగ్-to-3.5-mm-కనెక్టర్ ఎడాప్టర్, మెరుపు కనెక్టర్ కలిగున్న హెడ్ఫోన్స్, పరికరంతో కూడి ఉంటాయి.[9]

సూచనలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Kahn, Jordan (September 23, 2016). "iPhone 7 launches in 30 more countries today, Apple Watch Series 2 arrives in 20+, Hermès models now available". 9to5Mac. Archived from the original on 18 జనవరి 2017. Retrieved 3 June 2018.
  2. Gartenberg, Chaim (September 12, 2017). "iPhone 8 and 8 Plus announced with wireless charging, True Tone display, A11 Bionic processor". The Verge. Vox Media. Retrieved 3 June 2018.
  3. Savov, Vlad (September 12, 2017). "iPhone X announced with edge-to-edge screen, Face ID, and no home button". The Verge. Vox Media. Retrieved 3 June 2018.
  4. Campbell, Mikey (September 16, 2016). "iPhone 7 solid-state home button works on capacitive touch, gloved users beware". AppleInsider. Retrieved 3 June 2018.
  5. Seifert, Dan (September 7, 2016). "iPhone 7 and 7 Plus announced with water resistance, dual cameras, and no headphone jack". The Verge. Vox Media. Retrieved 3 June 2018.
  6. Rhodes, Margaret (September 8, 2016). "How Apple Made Its Jet Black iPhone None More Black". Wired. Condé Nast. Retrieved 3 June 2018.
  7. Stein, Scott (November 23, 2016). "Apple iPhone 7 review". CNET. CBS Interactive. Archived from the original on 31 డిసెంబరు 2016. Retrieved 3 June 2018.
  8. Griffin, Andrew (September 8, 2016). "iPhone 7: Apple warranty doesn't cover water damage to 'waterproof' new phone". The Independent. Retrieved 3 June 2018.
  9. Miller, Paul; Bohn, Dieter (September 16, 2016). "Apple put a barometric vent in the space where the iPhone 7 headphone jack would have been". The Verge. Vox Media. Retrieved 3 June 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=ఐఫోన్_7&oldid=4339094" నుండి వెలికితీశారు